T20 World Cup 2022 Full Schedule: తొలి అంకం ముగిసింది.. అసలు పోరుకు రంగం సిద్ధం
21 October 2022, 19:35 IST
- T20 World Cup 2022 Full Schedule: టీ20 వరల్డ్ కప్ 2022 క్వాలిఫయింగ్ రౌండు ముగిసింది. పలితంగా 8 జట్లు పోటీ పడిన ఈ రౌండులో నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఈ సూపర్-12 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి.
టీ20 వరల్డ్ కప్ 2022
T20 World Cup 2022 Full Schedule: టీ20 వరల్డ్ కప్ 2022లో మొదటి అంకం పూర్తయింది. శుక్రవారంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ ముగిసింది. ఎనిమిది జట్లు పోటీ పడిన ఈ రౌండులో నాలుగు టీమ్‌లు సూపర్-12 దశకు చేరుకున్నాయి. ఐసీసీ టాప్-8 జట్లతో పాటు ఈ నాలుగు జట్లు శనివారం నుంచి జరగనున్న సూపర్-12 సమరంలో పోటీ పడనున్నాయి. శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, జింబాబ్వే దేశాలు తుది రౌండుకు అర్హత సాధించాయి. ఎలాంటి అంచనాలు లేని జట్లు అదిరిపోయే రీతిలో అద్బుత ప్రదర్శన చేసి సూపర్-12కు దూసుకొచ్చాయి.
గ్రూప్-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్ రాగా.. గ్రూప్-బీ నుంచి ఐర్లాండ్, జింబాబ్వే జట్లు వచ్చాయి. క్వాలియిర్ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై విజయం సాధించిన జింబాబ్వే తుది రౌండుకు అర్హత సాధించింది. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టు ఈ సారి క్వాలిఫయింగ్ రౌండులోనే ఇంటిముఖం పట్టింది. గత టీ20 ప్రపంచకప్‌లో ఆడిన 12 జట్లలో ఈ సారి విండీస్, నమీబియా, స్కాట్లాండ్ లేవు. వీటి స్థానంలో నెదర్లాండ్స్, జింబాబ్వే వచ్చి చేరాయి.
రెండు గ్రూపులు.. 12 జట్లు..
మొత్తం 12 జట్లలో ఆరేసి జట్లతో రెండు గ్రూపులు ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఆదివారం నాడు మ్యాచ్ జరగబోతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య శనివారం నాడు జరిగే తొలి మ్యాచ్‌తో సూపర్-12 పోరు మొదలు కానుంది. గ్రూప్-ఏలో న్యూజిలాండ్, శ్రీలంక, ఆఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఉండగా.. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే పోటీ పడనున్నాయి. శనివారం నాడు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. అక్టోబరు 23న ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్ 2022 పూర్తి షెడ్యూల్..
భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..
ఇండియా vs పాకిస్తాన్, అక్టోబర్ 23న (మెల్‌బోర్న్)
ఇండియా vs నెదర్లాండ్స్, అక్టోబర్ 27న (సిడ్నీ)
ఇండియా vs దక్షిణాఫ్రికా, అక్టోబర్ 30న (పెర్త్)
ఇండియా vs బంగ్లాదేశ్, నవంబర్ 2న (అడిలైడ్ ఓవల్)
ఇండియా vs జింబాబ్వే, నవంబర్ 6న (మెల్‌బోర్న్)
సూపర్ 12- గ్రూప్ -ఏ మ్యాచ్‌లు..
అక్టోబర్ 22 - ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ - మధ్యాహ్నం 12:30 - SCG, సిడ్నీ
అక్టోబర్ 22 - ఇంగ్లండ్ vs అఫ్ఘనిస్తాన్ - సాయంత్రం 4:30 - పెర్త్ స్టేడియం
అక్టోబర్ 23 - శ్రీలంక vs ఐర్లాండ్ - 9:30 am - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్
అక్టోబర్ 25 - ఆస్ట్రేలియా vs శ్రీలంక - 4:30 pm - పెర్త్ స్టేడియం
అక్టోబర్ 26 – ఇంగ్లాండ్ vs ఐర్లాండ్ - 9:30 am - MCG, మెల్‌బోర్న్
అక్టోబర్ 26 - న్యూజిలాండ్ vs అఫ్ఘనిస్తాన్ - మధ్యాహ్నం 1:30 - MCG, మెల్బోర్న్
అక్టోబర్ 28 - అఫ్ఘనిస్తాన్ vs ఐర్లాండ్ - 9:30 am - MCG, మెల్‌బోర్న్
అక్టోబర్ 28 - ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా - మధ్యాహ్నం 1:30 - MCG, మెల్బోర్న్
అక్టోబర్ 29 - న్యూజిలాండ్ vs శ్రీలంక - 1:30 pm - SCG, సిడ్నీ
అక్టోబర్ 31 - ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ - 1:30 pm - ది గబ్బా, బ్రిస్బేన్
నవంబర్ 1 - ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక - 9:30 am - ది గబ్బా, బ్రిస్బేన్
నవంబర్ 1 - ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్- మధ్యాహ్నం 1:30 pm - ది గబ్బా, బ్రిస్బేన్
నవంబర్ 4 - న్యూజిలాండ్ vs ఐర్లాండ్ - 9:30 am - అడిలైడ్ ఓవల్, అడిలైడ్
నవంబర్ 4 - ఆస్ట్రేలియా vs అఫ్ఘనిస్తాన్ - మధ్యాహ్నం 1:30 - అడిలైడ్ ఓవల్, అడిలైడ్
నవంబర్ 5 – ఇంగ్లాండ్ vs శ్రీలంక - 1:30 pm - SCG, సిడ్నీ
సూపర్-12 గ్రూప్-బీ మ్యాచ్‌లు..
అక్టోబరు 23 - ఇండియా vs పాకిస్థాన్ - మధ్యాహ్నం 1:30 pm - మెల్బోర్న్
అక్టోబర్ 24 - బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్ - 9:30 am - హోబర్ట్
అక్టోబర్ 24 - దక్షిణాఫ్రికా vs జింబాబ్వే - 1:30 pm - హోబర్ట్
అక్టోబర్ 27 - దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ - ఉదయం 8:30 - సిడ్నీ
అక్టోబర్ 27 - ఇండియా vs నెదర్లాండ్స్ - 12:30 pm - సిడ్నీ
అక్టోబర్ 27 - పాకిస్తాన్ vs జింబాబ్వే - 4:30 pm - పెర్త్
అక్టోబర్ 30 - బంగ్లాదేశ్ vs జింబాబ్వే - 8:30 am - బ్రిస్బేన్
అక్టోబర్ 30 - పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ - 12:30 pm - పెర్త్
అక్టోబరు 30 - ఇండియా vs దక్షిణాఫ్రికా - 4:30 pm - పెర్త్
నవంబర్ 2 - జింబాబ్వే vs నెదర్లాండ్స్ - 9:30 am - అడిలైడ్
నవంబర్ 2 - ఇండియా vs బంగ్లాదేశ్ - మధ్యాహ్నం 1:30 - అడిలైడ్
నవంబర్ 3 - పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా - 1:30 pm - సిడ్నీ
నవంబర్ 6 - దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ - 5:30 am - అడిలైడ్
నవంబర్ 6 - పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - ఉదయం 9:30 am - అడిలైడ్
నవంబర్ 6 - ఇండియా vs జింబాబ్వే - 1:30 pm - MCG, మెల్బోర్న్
నాకౌట్ మ్యాచ్‌లు..
సెమీ ఫైనల్ 1 - నవంబర్ 9 (సిడ్నీ)
సెమీ ఫైనల్ 2 - నవంబర్ 10 (అడిలైడ్)
ఫైనల్ - నవంబర్ 13న (మెలబోర్న్).