తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl | ధోనీ తర్వాత ఐపీఎల్‌లో చెన్నై కెప్టెన్ అతడే: గవాస్కర్

IPL | ధోనీ తర్వాత ఐపీఎల్‌లో చెన్నై కెప్టెన్ అతడే: గవాస్కర్

24 March 2022, 15:42 IST

google News
    • వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ధోనీ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు విరామం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో చెన్నై కెప్టెన్ ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. అయితే మహీ స్థానంలో జడ్డూను తీసుకోవచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
సునీల్ గవాస్కర్
సునీల్ గవాస్కర్ (PTI )

సునీల్ గవాస్కర్

ఐపీఎల్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయవంతమైన టీమ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మిస్టర్ కూల్ మహీంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే నాలుగు సార్లు టైటిల్ నెగ్గింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఈ జట్టుకు మహీనే సారథిగా వ్యవహరిస్తూ.. విజయపథాలకు నడపించాడు. అయితే ఆటగాడిగా టీమిండియాకు వీడ్కోలు చెప్పిన ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రం చెన్నై తరఫున ఆడుతూనే ఉన్నాడు.వచ్చే సీజన్‌లో సీఎస్‌కే సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనని మహీ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆ మ్యాచ్‌లకు కెప్టెన్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఈ అంశంపై భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. రవీంద్ర జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించవచ్చని అభిప్రాయపడ్డారు.

“గత కొన్ని సంవత్సరాలుగా రవీంద్ర జడేజా ఆటగాడిగా ఎంతో పరిణితి చెందాడు. మ్యాచ్‌కు తగినట్లు తనను తాను మార్చుకోవడమే కాకుండా.. పరిస్థితులకు అనుగుణంగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌లకు మహీ కనుక విరామం తీసుకంటే.. జడేజా కెప్టెన్సీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. “అని గవాస్కర్ స్పష్టం చేశారు.

టైటిల్‌ను చైన్నై డిఫెన్స్ చేసుకోవాలంటే గత సీజన్‌లో అత్యధిక పరుగురులు సాధించిన రుతురాజ్ గైక్వాడ్ కీలకమని గవాస్కర్ అన్నారు. రుతురాజ్ తన నైపుణ్యంలో కొంతమేర ఇంకొంచెం మెరుగపడాల్సి ఉందని తెలిపారు. అతడికి షాట్లన్నీ ఎలా ఆడాలో బాగా తెలుసని, కానీ షాట్ సెలక్షన్ అత్యంత ముఖ్యమని అన్నారు. అతను ఏ షాట్ ఆడినా నిరాశ చెందించడని, అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడటానికి కూడా అస్సలు భయపడడని తెలిపారు. ఐపీఎల్‌లో అతడి షాట్ సెలక్షన్ బాగుందని కితాబిచ్చాడు. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్‌ను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం