తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 | గన్ పట్టుకున్న రోహిత్‌.. ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ హంగామా

IPL 2022 | గన్ పట్టుకున్న రోహిత్‌.. ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ హంగామా

Hari Prasad S HT Telugu

21 March 2022, 11:40 IST

google News
    • IPL 2022 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ కోసం అన్ని టీమ్స్‌ ఇప్పటికే ట్రైనింగ్‌ ప్రారంభించాయి. ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ మాత్రం టోర్నీకి ముందు తమ ప్లేయర్స్‌కు కాస్త ఫన్‌ అందించింది.
ఎంఐ అరెనాలో బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ
ఎంఐ అరెనాలో బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Twitter)

ఎంఐ అరెనాలో బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ

ముంబై: ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ టీమ్‌ ముంబై ఇండియన్స్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌లలోనూ ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్‌ 15వ సీజన్‌ ప్రారంభానికి ముందు కొత్తగా ముంబై ఇండియన్స్‌ అరెనాను ఆ ఫ్రాంఛైజీ ప్రారంభించింది.

ఈ కొత్త అరెనాలో టీమ్‌లోని సభ్యులు, మేనేజ్‌మెంట్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ అందరూ సరదాగా ఎంజాయ్‌ చేశారు. కెప్టెన్‌ రోహిత్ శర్మతోపాటు టాప్‌ ప్లేయర్స్‌ బుమ్రా, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌లాంటి వాళ్లు కాసేపు సరదాగా ఆడుతూ కనిపించారు. దీనికోసం మొదట టీమ్‌ను ఆరు టీమ్స్‌గా విభజించి ఎంఐ అరెనాలోని ఆరు డిఫరెంట్‌ గేమ్స్‌ ఆడించారు. పికిల్‌ బాల్‌, బాక్స్ క్రికెట్‌, ఫుట్సల్‌, ఫుట్‌వాలీ, మినీ గోల్ఫ్‌, బాటిల్‌గ్రౌండ్‌లాంటి గేమ్స్‌ ఆడారు.

ఎంఐ అరెనా ఓపెనింగ్‌ ఓ ధమాల్‌ ఈవెంట్‌లా సాగిందంటూ ప్లేయర్స్‌ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను ఆ ఫ్రాంఛైజీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. బ్యాటిల్‌గ్రౌండ్‌ గేమ్‌లో భాగంగా రోహిత్‌, బుమ్రాలాంటి వాళ్లు చేతుల్లో గన్స్‌తో కనిపించారు. అలాగే ఫుట్‌బాలీ, మినీ గోల్ఫ్‌లాంటి గేమ్స్‌ను కూడా ప్లేయర్స్‌ బాగా ఎంజాయ్‌ చేశారు. టీమ్‌ కోచింగ్‌ స్టాఫ్‌లో భాగంగా ఉన్న మాజీ క్రికెటర్లు జయవర్దనె, షేన్‌ బాండ్‌లాంటి వాళ్లు కూడా ప్లేయర్స్‌తో కలిసి ఈ గేమ్స్‌ ఆడారు. ఈ నెల 27న తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది ముంబై ఇండియన్స్‌.

టాపిక్

తదుపరి వ్యాసం