Shubman gill: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్...ఆ రికార్డ్ ఏదంటే...
23 July 2022, 20:53 IST
శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు టీమ్ ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్. ఈ మ్యాచ్ ద్వారా అతడు లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఆ రికార్డు ఏదంటే
శుభ్‌మన్ గిల్
వెస్డిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్. 53 బాల్స్ లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో అరవై నాలుగు రన్స్ చేసి మెప్పించాడు. కెప్టెన్ ధావన్‌తో కలిసి టీమ్ ఇండియాకు చక్కటి శుభారాంభాన్ని అందించాడు శుభ్‌మన్. వీరిద్దరి మెరుపులతో టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించింది. భారీ స్కోరు దిశగా సాగుతున్న తరుణంలో సింగిల్ కోసం ప్రయత్నించి రనౌట్ గా వెనుదిరిగాడు శుభ్‌మన్ .
ఈ మ్యాచ్ తో అతడు వన్డేల్లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్‌పై హాఫ్ సెంచరీ సాధించిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. 22 సంవత్సరాల 215 రోజుల్లో విరాట్ కోహ్లి వెస్టిండీస్ పై హాఫ్ సెంచరీ సాధించి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత 22 సంవత్సరాల 317 రోజుల్లో అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా శుక్రవారం నాటి మ్యాచ్ తో శుభ్ మన్ రికార్డు నెలకొల్పాడు.
వీరి తర్వాత టీమ్ ఇండియా దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉన్నాడు. 24 సంవత్సరాల మూడు రోజుల్లో సచిన్ వెస్టిండీస్ తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ తో సచిన్ రికార్డును శుభ్ మన్ అధిగమించాడు. రెండో వన్డేలో శుభ్ మన్ రాణిస్తాడనే నమ్మకముందని కోచ్ రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు.
టాపిక్