shubman gill: ఆ విషయాన్నిశుభ్‌మన్ కు ధావన్ గట్టిగా చెప్పాలి: అజిత్ అగార్కర్
23 July 2022, 16:27 IST
వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ (shubman gill)రనౌట్ అయిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శుభ్‌మన్ గిల్
india vs west indies first odi: శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ మూడు పరుగులు తేడాతో విజయాన్ని అందుకున్నది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ తో పాటు ఓపెనర్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్ కు శుభ్‌మన్, ధావన్ 119 పరుగులు జోడించారు. కీలకమైన సమయంలో శుభ్‌మన్ గిల్ రనౌట్ అయ్యాడు. సింగిల్ కోసం ప్రయత్నించి రనౌట్ గా వెనుదిరిగాడు. నికోలస్ పూరన్ విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకడంతో శుభ్‌మన్ గిల్ కు నిరాశే మిగిలింది.
ఈ రనౌట్ లో శుభ్ మన్ పొరపాటు ఎక్కువగా ఉంది. పూరన్ ను తక్కువగా అంచనా వేసిన అతడు రన్ కోసం బద్దకంగా పరుగు తీశాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అతడి ఆటతీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుభ్‌మన్ లో సీరియస్ నెస్ కనిపించడం లేదని అంటున్నారు. యువ ఆటగాడు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని చెబుతున్నారు. శుభ్ మన్ పై టీమ్ ఇండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ తో మ్యాచ్ ను శుభ్‌మన్ సీరియస్ గా తీసుకోలేదని అన్నాడు. తేలికగా తీసుకున్నందుకు రనౌట్ అయ్యి తగిన మూల్యం చెల్లించుకున్నాడని పేర్కొన్నాడు.
ఇలాంటి తప్పులు మరోసారి చేయకుండా ధావన్ అతడికి గట్టిగానే చెబుతాడని అనుకుంటున్నానని అజిత్ అగర్కార్ అన్నాడు. శుభ్‌మన్ కెరీర్ ఇప్పుడిడప్పుడే మొదలవుతోందని, కాలం గడిచే కొద్ది అనుభవమే అతడికి అన్ని పాఠాల్ని నేర్పిస్తుందని అగార్కర్ అన్నాడు. శుభ్‌మన్ పై అగార్కర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
టాపిక్