తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sanju Samson On Ind Vs Sa 1st Odi: రెండు షాట్ల దూరంలో ఆగిపోయాం.. సంజూ మాటకు ఫ్యాన్స్‌ ఫిదా

Sanju Samson on Ind vs SA 1st ODI: రెండు షాట్ల దూరంలో ఆగిపోయాం.. సంజూ మాటకు ఫ్యాన్స్‌ ఫిదా

Hari Prasad S HT Telugu

07 October 2022, 9:42 IST

    • Sanju Samson on Ind vs SA 1st ODI: రెండు షాట్ల దూరంలో ఆగిపోయామంటూ సంజూ శాంసన్‌ ఇచ్చిన సమాధానానికి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇండియా, సౌతాఫ్రికా తొలి వన్డేలో సంజూ ఒంటరి పోరాటం చేసిన విషయం తెలిసిందే.
మీడియాతో మాట్లాడుతున్న సంజూ శాంసన్
మీడియాతో మాట్లాడుతున్న సంజూ శాంసన్ (BCCI.tv)

మీడియాతో మాట్లాడుతున్న సంజూ శాంసన్

Sanju Samson on Ind vs SA 1st ODI: సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పెద్ద పెద్ద స్టార్లు ఎవరూ లేరు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో యువ రక్తమే ఉంది. అయినా సఫారీలకు చెమటలు పట్టించింది యంగిండియా. ముఖ్యంగా ఎంతో టాలెంట్ ఉన్నా ఇండియన్‌ టీమ్‌లో పెద్దగా అవకాశాలు రాని సంజూ శాంసన్‌.. మరోసారి సెలక్టర్లకు తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

చివరి వరకూ క్రీజులో ఉండి ఇండియాను గెలిపించినంత పని చేశాడు. కానీ కేవలం 9 పరుగుల దూరంలో ఆగిపోయాడు. కేవలం 63 బాల్స్‌లోనే 86 రన్స్‌ చేసిన సంజూ అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో 30 రన్స్‌ అవసరం కాగా.. శాంసన్‌ 20 రన్స్‌ చేయడం విశేషం. అతని ఫైటింగ్‌ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే మ్యాచ్‌ తర్వాత సంజూ కూడా మీడియాతో మాట్లాడాడు. ఎప్పుడూ ఎంతో కామ్‌గా, హుందాగా ఉండే అతడు.. ఇప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా అలాగే సమాధానమిచ్చాడు. ఆడితే మ్యాచ్‌ను గెలిపించడానికే ఆడతానని, అయితే ఈసారి మాత్రం కొద్ది దూరంలో ఆగిపోయామని సంజూ అన్నాడు.

"క్రీజులో కొంతసేపు గడపడానికి నేను ఇష్టపడతాను. ఇండియన్‌ జెర్సీలో ఆడటం మరింత స్పెషల్‌ అవుతుంది. ఆడితే మ్యాచ్‌ గెలిపించడానికే ఆడతాను. కానీ కొంత దూరంలో ఆగిపోయాం. కేవలం రెండు షాట్ల దూరంలో. అయితే ఇందులో నా వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది" అని సంజూ శాంసన్‌ అన్నాడు. ఇక చివరి ఓవర్లో తన వ్యూహం గురించి కూడా సంజూ వివరించాడు. షంసి వేసిన చివరి ఓవర్లో నాలుగు సిక్స్‌లు కొట్టాలని అనుకున్నట్లు చెప్పాడు.

"వాళ్ల బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారు. కానీ షంసి మాత్రం చాలా రన్స్‌ సమర్పించుకున్నాడు. అందుకే మేము అతన్ని టార్గెట్‌ చేసుకున్నాం. అతనిది ఒక ఓవర్లో చివర్లో ఉండిపోయింది. ఆ ఓవర్లో 24 రన్స్‌ అవసరం అయినా సరే 4 సిక్స్‌లు కొట్టగలను అనిపించింది. నేను కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను. ప్లాన్‌ కూడా అదే ఉండింది. కానీ మా బ్యాట్స్‌మెన్‌ బాగానే రెస్పాండ్‌ అయ్యారు" అని సంజూ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్‌కే కాదు ఆ తర్వాత అతని మాటలకు కూడా ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ఆ రెండు షాట్లు పోతే పోనీలే కానీ నువ్వు చాలా బాగా ఆడావు.. తలెత్తుకొని ఉండు అంటూ ఫ్యాన్స్‌ అతని వెంట నిలిచారు.