తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza Watched France Vs Morocco: వరల్డ్‌కప్‌ సెమీస్‌ చూసిన ఇండియన్‌ సెలబ్రిటీలు.. సానియా ఒంటరిగానే..

Sania Mirza watched France vs Morocco: వరల్డ్‌కప్‌ సెమీస్‌ చూసిన ఇండియన్‌ సెలబ్రిటీలు.. సానియా ఒంటరిగానే..

Hari Prasad S HT Telugu

15 December 2022, 18:00 IST

    • Sania Mirza watched France vs Morocco: వరల్డ్‌కప్‌ సెమీస్‌ చూశారు ఇండియన్‌ సెలబ్రిటీలు. పలువురు బాలీవుడ్‌ నటులతోపాటు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా భర్త షోయబ్‌ మాలిక్‌ లేకుండా ఒంటరిగానే మ్యాచ్‌ చూసింది.
ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ వేదికలో సానియా మీర్జా
ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ వేదికలో సానియా మీర్జా

ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ వేదికలో సానియా మీర్జా

Sania Mirza watched France vs Morocco: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌కు విడాకులు ఇవ్వబోతోందన్న వార్తలు చాలా రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను వీళ్లు ఖండించలేదు. అలాగని ధృవీకరించనూ లేదు. అయితే విడాకుల పుకార్ల నేపథ్యంలో సానియా ఒంటరిగా ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ చూసింది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఫ్రాన్స్‌, మొరాకో మధ్య బుధవారం (డిసెంబర్‌ 14) జరిగిన రెండో సెమీఫైనల్‌ను సానియా చూసింది. ఆమెతోపాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు అనన్యా పాండే, సంజయ్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌, చుంకీ పాండేలు ఈ సెమీస్‌ మ్యాచ్‌ చూశారు. ఆ తర్వాత వీళ్లందరితో కలిసి సానియా డిన్నర్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సానియా భర్త షోయబ్‌ మాలిక్‌ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న లంక ప్రీమియర్‌ లీగ్‌ 2022లో జాఫ్నా కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. 2010లో పెళ్లితో ఒక్కటైన సానియా, షోయబ్‌ అప్పటి నుంచీ దుబాయ్‌లోనే ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల కిందటి నుంచీ ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

మరోవైపు షోయబ్‌ మాలిక్ టీ20ల్లో 12 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. జాఫ్నా కింగ్స్‌ తరఫున లంక లీగ్‌లో ఆడుతున్న అతడు.. గత సోమవారం (డిసెంబర్‌ 12) ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 35 రన్స్‌ చేయడంతో షోయబ్‌ టీ20ల్లో 12 వేల రన్స్‌ మైల్‌స్టోన్‌ను అధిగమించాడు. షోయబ్‌ కంటే ముందు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మాత్రమే టీ20ల్లో 12 వేలకుపైగా రన్స్‌ చేశాడు.

షోయబ్‌ మాలిక్‌ తన 485వ టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు. 2006లో తొలి అంతర్జాతీయ టీ20 ఆడిన షోయబ్‌ మాలిక్‌.. 16 ఏళ్లయినా ఇంకా ఆడుతూనే ఉన్నాడు. 2009లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన పాక్‌ టీమ్‌లో షోయబ్‌ మాలిక్‌ సభ్యుడిగా ఉన్నాడు.

తదుపరి వ్యాసం