Sania and Shoaib Malik Divorce: సానియాతో విడాకులపై నోరు విప్పిన షోయబ్ మాలిక్.. ఏమన్నాడంటే?-shoaib malik breaks silence on divorce with sania mirza ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania And Shoaib Malik Divorce: సానియాతో విడాకులపై నోరు విప్పిన షోయబ్ మాలిక్.. ఏమన్నాడంటే?

Sania and Shoaib Malik Divorce: సానియాతో విడాకులపై నోరు విప్పిన షోయబ్ మాలిక్.. ఏమన్నాడంటే?

Maragani Govardhan HT Telugu
Dec 09, 2022 03:02 PM IST

Sania and Shoaib Malik Divorce: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన భార్య, భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో బ్రేకప్‌పై స్పందించాడు. విడాకులపై వస్తున్న వార్తలపై మాట్లాడిన అతడు.. ఇది తమ వ్యక్తిగత విషయమని స్పష్టం చేశాడు.

Shoaib Malik and Sania Mirza
Shoaib Malik and Sania Mirza

Sania and Shoaib Malik Divorce: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇద్దరూ విడిపోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి వారి సన్నిహిత వర్గాలు. వీరిద్దరూ తమ 12 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు వీరిద్దరూ పెదవి విప్పలేదు. తాజాగా ఈ అంశంపై షోయబ్ మాలిక్ నోరు తెరిచాడు.

ఓ న్యూస్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా సానియాతో విడాకుల గురించి షోయబ్ మాట్లాడాడు. ఇది తమ వ్యక్తిగత విషయమని, ఈ అంశం గురించి మాట్లాడటం తనకిష్టం లేదని, వదిలేయాల్సిందిగా స్పష్టం చేశాడు. అయితే మీడియా వర్గాల్లో మాత్రం వీరి విడిపోతున్నారనే వార్తలు బలంగా వస్తున్నాయి. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటించడానికి కొన్ని న్యాయపరమైన అంశాలు అడ్డుగా ఉన్నాయని, అందుకే విడిపోవట్లేదని సమాచారం.

అంతేకాకుండా వీరిద్దరి ప్రొఫెషనల్స్ కమిట్మెంట్స్ కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం సానియా-షోయబ్ మీర్జా టాక్ షో అనే ఓటీటీ షోలో చేస్తున్నారు. ఇలాంటి కమిట్మెంట్స్ కారణంగా విడిపోవడానికి న్యాయపరమైన చిక్కులు అడ్డుగా ఉన్నాయట.

సానియా-షోయబ్ 2010లో వివాహం చేసుకున్నారు. ఐదు నెలల డేటింగ్ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యాడు. వీరికి 2018 అక్టోబరు 30న ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే ఇటీవల కాలంలో పాకిస్థానీ నటి ఆయేషా ఓమర్‌తో షోయబ్ మాలిక్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని, అందుకే సానియా నుంచి విడాకులు కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఆయేషాతో వస్తున్న రూమర్లపై షోయబ్ మాలిక్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. తను తన భార్యతో సంతోషంగానే ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. మరోపక్క ఆయేషా కూడా షోయబ్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనంటూ మాట దాటవేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం