Roger Federer Retirement: 'ముగింపు బెస్ట్‌గా అతిగా ఆలోచించకండి'.. ఫెదరర్ పోస్ట్ వైరల్
30 September 2022, 21:23 IST
- Roger Federer Retirement: టెన్నీస్ స్టార్ రోజర్ ఫెదరర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముగింపు అత్యుత్తమంగా ఉండాలని ఎప్పుడూ అతిగా ఆలోచించవద్దని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టులో పేర్కొన్నాడు.
రోజర్ ఫెదరర్
Roger Federer about His Career: స్విస్ దిగ్గజం టెన్నీస్ స్టార్ రోజర్ ఫెదరర్ గత వారం తన ప్రొఫెషనల్ కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. లేవర్ కప్ 2022లో భాగంగా తన కెరీర్ చివరి మ్యాచ్ నాదల్‌తో కలిసి డబుల్స్ గేమ్ ఆడాడు. అయితే అనూహ్యంగా అందులో ఓటమి పాలై.. పరాజయంతో కెరీర్ను ముగించాడు. దీంతో టెన్నీస్ సమాజం కన్నీటి పర్యంతమైంది. తన కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లు అందుకున్న ఫెదరర్ చివరి మ్యాచ్ అనంతరం భావోద్వాగానికి లోనయ్యాడు. తాజాగా ఫెదరర్ చేసిన ఓ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడ్కోలు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలని అతిగా ఆలోచించవద్దని పిలుపునిచ్చాడు.
“మనమంతా ముగింపు అద్భుతంగా ఉండాలని కోరుకుంటాం. నా విషయమే చూద్దాం. నా చివరి సింగిల్స్ మ్యాచ్‌లో ఓడాను. డబుల్స్ గేమ్‌లో పరాజయం చవిచూశాను. చివరకు టీమ్ ఈవెంట్‌లోనూ ఓడిపోయాను. అంతేకాకుండా నా ఉద్యోగం కూడా కోల్పోయాను. గత వారమంతా నా నోటి నుంచి మాటలే కరవయ్యాయి. నా ఆటకు దూరమయ్యాను. ఇలా నా ముగింపు ఉత్తమంగా లేకపోయినా.. జరిగిన దానిపట్ల నేను సంతోషంగా ఉన్నాను. అందుకే ఉత్తమమైన ముగింపు గురించి అతిగా ఆలోచించవద్దు. మీ సొంత మార్గం ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది” అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో కలిసి లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్‌లో ఓడిన అతడు పరాజయంతో ఆటకు గుడ్‌బై చెప్పాడు. సెంటర్ కోర్టు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ టీమ్.. జాక్స్ సాక్స్- ఫ్రాన్సీస్ టియాఫే జోడీ చేతిలో ఫెదరర్-రఫా ద్వయం ఓటమి పాలైంది. రెండు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్-ఫెదరర్ తీవ్రంగా పోరాడారు. అయితే చివరకు 4-6, 7-6(7-2), 11-9 తేడాతో ఓటమి పాలయ్యారు.
2003లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకున్న ఫెదరర్.. ఆ తర్వాత వెనక్కి తీసుకోలేదు. వింబుల్డన్‌తో మొదటి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో మూడో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు రఫెల్ నాదల్(22), నొవాక్ జకోవిచ్(21) ముందున్నారు. తన కెరీర్‌రో 6 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఓ ఫ్రెంచ్ ఓపెన్, 8 వింబుల్డన్‌లు, 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లు నెగ్గాడు.