తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni Golf Video: 'ఆట ఏదైనా ధోనీ దిగనంత వరకే'.. క్రికెటర్ నుంచి కొత్త అవతారం

MS Dhoni Golf Video: 'ఆట ఏదైనా ధోనీ దిగనంత వరకే'.. క్రికెటర్ నుంచి కొత్త అవతారం

30 September 2022, 18:55 IST

google News
    • Dhoni Plays Golf: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెటర్ నుంచి మరో కొత్త అవతారమెత్తాడు. గోల్ఫ్ ఆటగాడిగా మారిన మిస్టర్ కూల్.. అదిరిపోయే గోల్ఫ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
గోల్ఫ్ ఆడుతున్న ధోనీ
గోల్ఫ్ ఆడుతున్న ధోనీ (Twitter)

గోల్ఫ్ ఆడుతున్న ధోనీ

MS Dhoni Golf Playing Video: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు ప్రపంచకప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనుడు. మైదానంలో తన చురుకుదనంతో ఎన్నో సార్లు అభిమానులు మనస్సు దోచుకున్నాడు. తన పటిమ, ప్రతిభతో ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఎంఎస్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా ధోనీ క్రికెటర్ నుంచి మారి మరో కొత్త అవతారమెత్తాడు.

ఇన్నాళ్లు క్రికెటర్‌గా రాణించిన మిస్టర్ కూల్.. గోల్ఫ్‌తో తన నూతన కెరీర్‌ను ఆరంభించాడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా(PGTI) తన సోషల్ మీడియా ఖాతాలో ధోనీ గోల్ఫ్ ఆడిన వీడియోను షేర్ చేసింది. గోల్ఫ్ హౌస్‌లో కెప్టెన్ కూల్ అని పోస్ట్ పెట్టింది. అతడితో పాటు టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఆటలో భాగమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ధోనీ గోల్ఫ్ ఆడటం చూసి విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ వీడియోను గమనిస్తే.. ధోనీ ఓ ప్రొఫెషనల్ ప్రేయర్ మాదిరిగా కనిపించాడు. అతడు షాట్ కొట్టినప్పుడల్లా హెలికాప్టర్ షాట్లు గుర్తుకువచ్చాయి. ధోనీ గోల్ఫ్ ఆడటం ఇదే తొలిసారి కాదు. అతడి స్నేహితుడు రాజీవ్ శర్మ మిస్టర్ కూల్‌కు గోల్ఫ్‌ను పరిచయం చేశాడు. ఇంతకు ముందు 2019లో అమెరికాకు చెందిన మెతుచెన్ గోల్ఫ్ కంట్రీ క్లబ్ తరఫున తొలిసారి గోల్ఫ్ ఆడాడు ధోనీ. ఈ టోర్నమెంట్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించడమే కాకుండా ఫ్లైట్ కెటగిరీలో రెండో స్థానంలో నిలిచాడు.

ఎంఎస్ ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికాడు. 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 16 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం