తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravindra Jadeja Tweet Viral: అంతా బాగానే ఉంది.. చెన్నై రిటేన్‌ చేసుకున్న తర్వాత జడేజా ట్వీట్‌ వైరల్‌

Ravindra Jadeja Tweet Viral: అంతా బాగానే ఉంది.. చెన్నై రిటేన్‌ చేసుకున్న తర్వాత జడేజా ట్వీట్‌ వైరల్‌

Hari Prasad S HT Telugu

15 November 2022, 21:52 IST

google News
    • Ravindra Jadeja Tweet Viral: అంతా బాగానే ఉంది అంటూ చెన్నై తనను రిటేన్‌ చేసుకున్న తర్వాత జడేజా చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. సూపర్‌ కింగ్స్‌తో తనకు పడటం లేదన్న వార్తల నేపథ్యంలో ఆ టీమ్‌ అతన్ని రిటేన్‌ చేసుకోవడం విశేషం.
రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ
రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ (AFP)

రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ

Ravindra Jadeja Tweet Viral: ఐపీఎల్‌ వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము రిటేన్‌ చేసుకున్న, రిలీజ్‌ చేసిన ప్లేయర్స్‌ వివరాలను పూర్తిగా వెల్లడించాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు ఉన్నాయి. సన్‌రైజర్స్‌ టీమ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను, పంజాబ్‌ కింగ్స్ మాజీ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను, చెన్నై టీమ్‌ బ్రావోను రిలీజ్‌ చేసేశాయి.

అయితే అదే చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను రిలీజ్‌ చేస్తుందా, రిటేన్‌ చేసుకుంటుందా అన్న ఆసక్తి చివరి రోజు వరకూ కొనసాగింది. చివరికి జడేజాను రిటేన్‌ చేసుకున్నట్లు ఆ టీమ్‌ ప్రకటించింది. కొన్నాళ్లుగా టీమ్‌తో, ధోనీతో జడేజాకు పడటం లేదని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌లో మొదట జడేజాను కెప్టెన్‌ను చేయడం, మధ్యలో అతన్ని తప్పించి తిరిగి ధోనీకి కెప్టెన్సీ ఇవ్వడంతో అతడు టీమ్‌పై అలిగాడని, ఇక సూపర్‌ కింగ్స్‌కు గుడ్‌బై చెబుతాడనీ అనుకున్నారు.

కానీ ఇప్పుడు చెన్నై అతన్ని రిటేన్‌ చేసుకోవడం అంతా సద్దుమణిగినట్లు తెలుస్తోంది. తాజాగా జడేజా చేసిన ట్వీట్‌ కూడా అదే విషయాన్ని చెబుతోంది. "అంతా బాగానే ఉంది. రీస్టార్ట్‌" అంటూ ఎల్లో కలర్‌లోని హార్ట్‌ సింబల్‌ను ట్వీట్ చేశాడు. దీనితోపాటు ధోనీ ముందు తాను తలవంచుకొని అతనికి సలాం చేస్తున్న ఫొటోను కూడా జడేజా ట్వీట్‌ చేయడం విశేషం.

2022 సీజన్‌ జడేజాకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అతని కెప్టెన్సీలో టీమ్‌ విఫలం కావడంతోపాటు చివర్లో గాయం కారణంగా అతడు కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతన్ని మళ్లీ ఎల్లో డ్రెస్‌లో చూస్తామో లేదో అని కూడా అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఇప్పుడంతా బాగానే ఉందని జడేజానే ట్వీట్‌ చేయడంతో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే సీజన్‌లో మరోసారి ధోనీ, జడేజా జోడీ మ్యాజిక్‌ చేసి చెన్నై ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం