తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant: మిడిల్ ఆర్డర్ లో పంత్ ఉపయోగపడుతాడు... ద్రావిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

Rishabh Pant: మిడిల్ ఆర్డర్ లో పంత్ ఉపయోగపడుతాడు... ద్రావిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

HT Telugu Desk HT Telugu

20 June 2022, 13:14 IST

google News
  • మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ పరంగా పంత్ ( rishabh pant) జట్టుకు ఎంతో ఉపయోగపడుతాడని టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్అ (rahul dravid)న్నాడు. గత కొంతకాలంగా ఫేలవ ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ పై ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రిషబ్ పంత్
రిషబ్ పంత్ (twitter)

రిషబ్ పంత్

ఓ సిరీస్ ఆధారంగా ఓ ఆటగాడి ప్రతిభపై అంచనాకు రావడం సరికాదని అన్నాడు టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలో కీలక ఆటగాడి గా పంత్ నిలుస్తాడని  తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ (ind vs sa t20 series)  లో బ్యాట్సమెన్ గా రిషబ్ పంత్ విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ గాయపడటంతో అనూహ్యంగా కెప్టెన్ బాధ్యతను చేపట్టిన పంత్ పై సిరీస్ కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగు టీ20 మ్యాచ్ లలో కలిసి 105 స్ట్రైక్ రేట్ తో  58 పరుగులు మాత్రమే చేశాడు. 

పేలవ ఫామ్ కారణంగా ఐర్లాండ్ తో సిరీస్ కు సెలెక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ కు స్థానం దక్కడం అనుమానమే నంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో కార్తిక్ ను తీసుకుంటే మంచిదంటూ  సలహాలు ఇస్తున్నారు. ఈ ప్రచారంతో పాటు పంత్ ఫామ్ పై కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఒక్క సిరీస్ లో విఫలమైనంత   మాత్రాన ఓ ఆటగాడిప్రతిభను తక్కువగా అంచనా వేయలేమని ద్రావిడ్ పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ లో అటాకింగ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఉంటుందని అన్నాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కొన్ని సార్లు తప్పులు జరుగుతుంటాయని ద్రావిడ్ తెలిపాడు. పంత్ విషయంలో అదే జరుగుతుందని అన్నాడు. 

పంత్ ఎడం చేతి వాటం ఆటగాడు కావడంతో మిడిల్ ఓవర్స్ లో బ్యాటింగ్ పరంగా జట్టుకు ఎంతో ఉపయోగపడుతాడని అన్నాడు. టీమ్ ఇండియా బ్యాటింగ్ లైపన్ లో అతడు ఓ అంతర్భాగమేనని అన్నాడు. ఐపీఎల్ లో యావరేజ్ తక్కువగానే ఉన్నా స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడని ద్రావిడ్ అన్నాడు.అంతర్జాతీయ స్థాయిలో అతడి నుండి ఆ స్థాయి  ప్రదర్శనను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ ను (worldcup) దృష్టిలో పెట్టుకొని తాము రూపొందిస్తున్న ప్రణాళికల్లో పంత్ కీలక  భూమిక పోషించనున్నాడని అన్నాడు.  ఉంటాడని ద్రావిడ్ అన్నాడు. తప్పకుండా వరల్డ్ కప్ లో అతడు మంచి ప్రదర్శన చేస్తాడనే నమ్మకముందని తెలిపాడు.  

టాపిక్

తదుపరి వ్యాసం