తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rafael Nadal In Australian Open: తొలి రౌండ్‌ గండం గట్టెక్కిన రఫేల్‌ నదాల్‌

Rafael Nadal in Australian Open: తొలి రౌండ్‌ గండం గట్టెక్కిన రఫేల్‌ నదాల్‌

Hari Prasad S HT Telugu

16 January 2023, 14:19 IST

    • Rafael Nadal in Australian Open: తొలి రౌండ్‌ గండం గట్టెక్కాడు రఫేల్‌ నదాల్‌. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జాక్‌ డ్రేపర్‌తో జరిగిన మ్యాచ్‌లో నదాల్‌ కాస్త కష్టంగానే అయినా విజయం సాధించాడు.
రఫేల్ నదాల్
రఫేల్ నదాల్ (AFP)

రఫేల్ నదాల్

Rafael Nadal in Australian Open: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టాప్‌ సీడ్, స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నదాల్‌ శుభారంభం చేశాడు. సోమవారం (జనవరి 16) జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అతడు జాక్‌ డ్రేపర్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. గతేడాది గాయాల కారణంగా అంతగా ఫామ్‌లో లేని నదాల్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను కూడా కాస్త కష్టంగానే ప్రారంభించాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

డ్రేపర్‌తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 7-5, 2-6, 6-4, 6-1తో నదాల్‌ గెలిచాడు. రాడ్‌ లేవర్‌ అరెనాలో జరిగిన ఈ మ్యాచ్‌ నాలుగు రౌండ్‌ల పాటు ఉత్కంఠభరితంగా జరిగింది. తొలిసెట్‌ను కష్టమ్మీద గెలిచిన నదాల్‌.. రెండో సెట్‌ కోల్పోయాడు. అయితే మూడు, నాలుగు సెట్లలో పుంజుకొని తొలి రౌండ్‌ గండం గట్టెక్కాడు.

తొలి సెట్‌ పదో గేమ్‌లోగానీ డ్రేపర్‌ సర్వ్‌ను నదాల్‌ బ్రేక్‌ చేయలేకపోయాడు. అయితే రెండో సెట్‌లో రెండు నదాల్‌ సర్వ్‌లను బ్రేక్‌ చేసిన డ్రేపర్‌.. మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. రెండో సెట్‌లో నదాల్‌ ఏకంగా 14 అనవసర తప్పిదాలు చేశాడు. మూడో సెట్‌లోనూ నదాల్‌ చేసిన తొలి సర్వ్‌నే డ్రేపర్‌ బ్రేక్‌ చేశాడు. అయితే తర్వాత నదాల్‌ వరుసగా రెండు సర్వ్‌లను బ్రేక్‌ చేసి ఆ సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు.

ఇక నాలుగో సెట్‌లో నదాల్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏకంగా మూడు సర్వ్‌లను బ్రేక్‌ చేయడంతో నాలుగో సెట్‌ను 6-1తో సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నదాల్‌ మొత్తం 124 పాయింట్లు గెలుచుకున్నాడు. డ్రేపర్‌ 13 ఏస్‌లతో నదాల్‌కు సవాలు విసిరినా.. చివరికి 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన నదాలే పైచేయి సాధించాడు.

తదుపరి వ్యాసం