Pro Kabaddi League Season 10: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 రేపటి నుంచే.. ఫ్రీగా ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
01 December 2023, 17:33 IST
- Pro Kabaddi League Season 10: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 శనివారం (డిసెంబర్ 2) నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ మెగా లీగ్ మ్యాచ్ లను ఫ్రీగా చూసే అవకాశం ఉంది.
అహ్మదాబాద్ లో క్రూయిజ్ పై పీకేఎల్ పదో సీజన్లో పాల్గొనబోయే 12 జట్ల కెప్టెన్లు
Pro Kabaddi League Season 10: ప్రొ కబడ్డీ లీగ్ మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ లీగ్ పదో సీజన్ శనివారం (డిసెంబర్ 2) ప్రారంభం కానుండగా.. సుమారు మూడు నెలల పాటు కబడ్డీ ప్రేమికులను అలరించనుంది. డిసెంబర్ 2 నుంచి ఫిబ్రవరి 24 వరకు పీకేఎల్ సీజన్ 10 సాగనుంది. మొత్తంగా 12 జట్లు, 12 వేదికల్లో లీగ్ జరుగుతుంది.
ప్రొ కబడ్డీ లీగ్ వేదికలు ఇవే
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10లో మొత్తం 12 టీమ్స్ తలపడబోతున్నాయి. దీంతో కారవాన్ ఫార్మాట్లో 12 వేదికల్లో ఈ లీగ్ జరగనుంది. ఒక్కో వేదికలో మ్యాచ్ లు ముగిసిన తర్వాత టోర్నీ మరో వేదికకు మారుతుంది. ఈసారి తొలి దశ మ్యాచ్ లు అహ్మదాబాద్ లో ప్రారంభమై.. పంచకులలో ముగియనున్నాయి.
- ది అరెనా బై ట్రాన్స్‌స్టేడియా, అహ్మదాబాద్
- శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు
- బ్యాడ్మింటన్ హాల్, బాలేవాడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, పుణె
- ఎస్‌డీఏటీ మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, చెన్నై
- నోయిడా ఇండోర్ స్టేడియం, నోయిడా
- డోమ్ స్టేడియం, ముంబై
- ఎస్ఎంఎస్ ఇండోర్ స్టేడియం, జైపూర్
- గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైదరాబాద్
- పాటలీపుత్ర ఇండోర్ స్టేడియం, పాట్నా
- త్యాగరాజ ఇండోర్ స్టేడియం, ఢిల్లీ
- నేతాజీ ఇండోర్ స్టేడియం, కోల్‌కతా
- తౌ దేవీలాల్ ఇండోర్ స్టేడియం, పంచకుల
ప్రొ కబడ్డీ లీగ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ లో ప్రతి రోజూ రెండు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ లీగ్ ను ఫ్రీగా చూసే వీలుంది.
ప్రొ కబడ్డీ లీగ్ టీమ్స్ ఇవే
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10లో మొత్తం 12 టీమ్స్ పాల్గొంటున్నాయి. తెలుగు టైటన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ కేసీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, యు ముంబా, యూపీ యోధాస్ తలపడుతున్నాయి. పదో సీజన్ లో తొలి లెగ్ అహ్మదాబాద్ లో శనివారం (డిసెంబర్ 2) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో తెలుగు టైటన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.