Pro Kabaddi League Schedule: ప్రొ కబడ్డీ లీగ్ టీమ్స్, హైదరాబాద్ లెగ్ షెడ్యూల్ ఇదే-pro kabaddi league teams and hyderabad leg schedule ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pro Kabaddi League Schedule: ప్రొ కబడ్డీ లీగ్ టీమ్స్, హైదరాబాద్ లెగ్ షెడ్యూల్ ఇదే

Pro Kabaddi League Schedule: ప్రొ కబడ్డీ లీగ్ టీమ్స్, హైదరాబాద్ లెగ్ షెడ్యూల్ ఇదే

Hari Prasad S HT Telugu
Nov 28, 2023 03:25 PM IST

Pro Kabaddi League Schedule: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో పాల్గొనే టీమ్స్, హైదరాబాద్ లెగ్ షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

పదో సీజన్ తొలి మ్యాచ్ లో తలపడనున్న గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటన్స్
పదో సీజన్ తొలి మ్యాచ్ లో తలపడనున్న గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటన్స్

Pro Kabaddi League Schedule: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పదో సీజన్ ఈ శనివారం (డిసెంబర్ 2) నుంచి ప్రారంభం కాబోతోంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా లీగ్ సుదీర్ఘంగా సాగనుంది. కేవలం లీగ్ స్టేజే రెండున్నర నెలల పాటు ఉంటుందంటే ఎంత సుదీర్ఘమైన టోర్నీయో అర్థం చేసుకోవచ్చు.

yearly horoscope entry point

ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ లీగ్ స్టేజ్ డిసెంబర్ 2న ప్రారంభమై వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ముగుస్తుంది. ప్లే ఆఫ్స్ షెడ్యూల్ తర్వాత అనౌన్స్ చేయనున్నారు. ఈసారి లీగ్ లో 12 జట్లు పాల్గొంటున్నాయి. డిసెంబర్ 2న అహ్మదాబాద్ లోని ట్రాన్స్ స్టేడియా స్టేడియంలో తొలి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటన్స్ మధ్య జరగనుంది.

పీకేఎల్ పదో సీజన్ ఫార్మాట్ ఇలా..

ప్రొ కబడ్డీ లీగ్ లో 12 జట్లు పాల్గొననుండగా.. మ్యాచ్ లు కూడా 12 నగరాల్లో జరుగుతాయి. అయితే ఐపీఎల్లాగా ఒకేసారి టీమ్స్ వివిధ నగరాలు తిరుగుతూ మ్యాచ్ లు ఆడవు. ఒక్కో నగరంలో ఒక్కో లెగ్ ముగిసిన తర్వాత అన్ని టీమ్స్ మరో నగరానికి వెళ్తాయి. అలా ఈసారి మొదటి లెగ్ డిసెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకూ అహ్మదాబాద్ లో జరుగుతుంది.

ఆ తర్వాత బెంగళూరు (డిసెంబర్ 8 నుంచి 13 వరకు), పుణె (డిసెంబర్ 15 నుంచి 20 వరకు), చెన్నై (డిసెంబర్ 22 నుంచి 27 వరకు), నోయిడా (డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు), ముంబై (జనవరి 5 నుంచి 10 వరకు), జైపూర్ (జనవరి 12 నుంచి 17 వరకు), హైదరాబాద్ (జనవరి 19 నుంచి 24 వరకు), పాట్నా (జనవరి 26 నుంచి 31 వరకు), ఢిల్లీ (ఫిబ్రవరి 2 నుంచి 7 వరకు), కోల్‌కతా (ఫిబ్రవరి 9 నుంచి 14 వరకు), పంచకుల (ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు)లో మ్యాచ్ లు జరుగుతాయి.

హైదరాబాద్ లెగ్ షెడ్యూల్ ఇదీ

హైదరాబాద్ లో తొలి మ్యాచ్ జనవరి 19న పాట్నా పైరేట్స్, యూపీ యోధాస్ మధ్య జరుగుతుంది. అదే రోజు రెండో మ్యాచ్ లో తెలుగు టైటన్స్, బెంగళూరు బుల్స్ తలపడతాయి. ఇక రెండో రోజు జనవరి 20న తొలి మ్యాచ్ లో దబంగ్ ఢిల్లీ, యు ముంబై.. రెండో మ్యాచ్ లో తెలుగు టైటన్స్, యూపీ యోధాస్ ఆడతాయి. మూడో రోజు జనవరి 21న తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్, పుణెరి పల్టన్స్.. రెండో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్, తమిళ తలైవాస్ తలపడనున్నాయి.

నాలుగో రోజు జనవరి 22న తొలి మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్.. రెండో మ్యాచ్ లో తెలుగు టైటన్స్, హర్యానా స్టీలర్స్ ఆడతాయి. ఐదో రోజైన జనవరి 23న యు ముంబా, పుణెరి పల్టన్ తలపడతాయి. ఆరో రోజు జనవరి 24న తొలి మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ.. రెండో మ్యాచ్ లో తెలుగు టైటన్స్, తమిళ తలైవాస్ ఆడనున్నాయి.

Whats_app_banner