తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Olympics 2024: కిలో తేడాతో మీరాబాయి మెడ‌ల్ మిస్‌ - ఆశ‌ల‌న్నీ నీర‌జ్ చోప్రాపైనే - కాంస్యం కోసం స్పెయిన్‌తో హాకీ టీమ్ ఫైట్

Olympics 2024: కిలో తేడాతో మీరాబాయి మెడ‌ల్ మిస్‌ - ఆశ‌ల‌న్నీ నీర‌జ్ చోప్రాపైనే - కాంస్యం కోసం స్పెయిన్‌తో హాకీ టీమ్ ఫైట్

08 August 2024, 10:28 IST

google News
  • Olympics 2024: ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను తృటిలో ప‌త‌కం కోల్పోయింది. 49 కేజీల విభాగంలో నాలుగో ప్లేస్‌లో నిలిచింది. నీర‌జ్ చోప్రాపైనే అభిమానులు భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. గురువారం జావెలిన్ త్రో ఫైన‌ల్ పోటీలు జ‌రుగ‌నున్నాయి. 

ఒలింపిక్స్ 2024
ఒలింపిక్స్ 2024

ఒలింపిక్స్ 2024

Olympics 2024: ఒలింపిక్స్‌లో ప‌త‌కం ఆశ‌లు రేకెత్తించిన భార‌త అథ్లెట్లు ఒక్కొక్క‌రుగా నిరాశ‌ప‌రుస్తోన్నారు. కొంద‌రు గ‌ట్టి పోటీ ఇస్తూ తృటిలో మెడ‌ల్స్ కోల్పోతుండ‌గా మ‌రికొంద‌రు అథ్లెట్లు మాత్రం ఏ మాత్రం పోరాటం చేయ‌కుండానే చేతులెత్తేస్తున్నారు.

కిలో తేడాతో...

వంద గ్రాములు ఎక్కువ బ‌రువు ఉండ‌టంతో అన‌ర్హ‌త వేటుకు గురైన రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్‌ అన‌ర్హ‌త వేటుకు గురై ప‌త‌కం కోల్పోయింది. ఆ షాక్ నుంచి తేరుకోక‌ముందే వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను కిలో తేడాతో తృటిలో కాంస్య ప‌త‌కం మిస్స‌యింది. బుధ‌వారం జ‌రిగిన 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను నాలుగో ప్లేస్‌లో నిలిచింది.

కాంస్య ప‌త‌కం గెలిచిన థాయిలాండ్ వెయిట్ లిఫ్ట‌ర్ కాంబావో 200 కిలోల బ‌రువు ఎత్త‌గా... ..మీరాబాయి 199 కిలోలను ఎత్తింది. ఒక్క కిలో తేడాతో ప‌త‌కానికి దూర‌మైంది. స్నాచ్‌లో88 కిలోల బ‌రువు ఎత్తిన మీరాబాయి ...క్లీన్ అండ్ జ‌ర్క్‌లో 111 కిలోల ఎత్తింది. కాంస్య ప‌త‌కం గెలిచిన కాంబావో 112 కిలోల బ‌రువు ఎత్తింది.

జావెలిన్ త్రో ఫైన‌ల్‌...

ఒలింపిక్స్‌లో ఇక ప‌త‌కం ఆశ‌ల‌న్నీ నీర‌జ్ చోప్రాపైనే ఉన్నాయి. జావెలిన్ త్రోలో క్వాలిఫ‌య‌ర్ పోటీల్లో టాప్ ప్లేస్‌లో నిలిచి స‌త్తా చాటాడు. నేడు జావెలిన్ త్రో ఫైన‌ల్ పోటీలు జ‌రుగ‌నున్నాయి. రాత్రి 11 గంట‌ల 55 నిమిషాల నుంచి ఫైన‌ల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. క్వాలిఫ‌య‌ర్ రౌండ్ జోరును ఫైన‌ల్‌లో చాటితే నీర‌జ్ సెకండ్ మెడ‌ల్ గెల‌వ‌డం ఖాయమే అవుతుంది.

రెజ్లింగ్‌...

57 కేజీల ఫ్రీస్టైల్ మెన్స్‌ - అమ‌న్ షెరావ‌త్ , ఉమెన్స్ - అన్షూ మాలిక్‌

హాకీ - కాంస్యం కోసం పోరు…

హాకీలో కాంస్య ప‌త‌కం కోసం స్పెయిన్‌తో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. సెమీఫైన‌ల్‌లో జ‌ర్మ‌నీ చేతిలో అనూహ్యంగా ఓట‌మి పాలైన భార‌త్ జ‌ట్టు క‌నీసం ప‌త‌కం ఖాయం చేసుకోవాల‌ని భావిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త జ‌ట్టు కాంస్య ప‌త‌కం గెలిచింది. ఈ సారి కూడా మెడ‌ల్ ఖాయం చేసుకొని ప‌రువు నిలుపుకోవాల‌ని భావిస్తోంది.

గోల్ఫ్ - అదితి అశోక్‌, దిక్ష దాగ‌ర్‌

ఉమెన్స్ 100 మీట‌ర్స్ హ‌ర్డిల్స్ రెపిటేజ్ పోటీల్లో తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజి బ‌రిలో దిగుతోంది. ఈ విభాగంలో పోటీ ప‌డుతోన్న తొలి భాత‌ర అథ్లెట్‌గా జ్యోతి నిలిచింది.

తదుపరి వ్యాసం