Lakshya Sen match Live Streaming: పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్యసేన్ మెడల్ మ్యాచ్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే
- Paris Olympics 2024 - Lakshya Sen: పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతక పోరులో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ తలపడనున్నాడు. నేడే (ఆగస్టు 5) ఈ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ టైమ్, లైవ్ వివరాలు ఇవే.
- Paris Olympics 2024 - Lakshya Sen: పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతక పోరులో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ తలపడనున్నాడు. నేడే (ఆగస్టు 5) ఈ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ టైమ్, లైవ్ వివరాలు ఇవే.
(1 / 5)
పారిస్ ఒలింపిక్స్ 2024 బ్యాడ్మింటన్‍లో భారత్‍కు పతకం సాధించే అవకాశం ముంగిట ఉంది. ఇండియా యంగ్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ కాంస్య పతక పోరులో తలపడేందుకు రెడీ అయ్యాడు. (REUTERS)
(2 / 5)
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్‍లో మలేషియా ప్లేయర్ లీ జీ జియాతో లక్ష్యసేన్ తలపడనున్నాడు. ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే మెడల్ సాధించే అద్భుతమైన ఛాన్స్ 22 ఏళ్ల లక్ష్య ముందు ఉంది. (Doordarshan Sports-X)
(3 / 5)
లక్ష్యసేన్ ఆడే ఈ బ్రాండ్ మెడల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం నేటి (ఆగస్టు 5) సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‍లో గెలిస్తే అతడికి కాంస్య పతకం దక్కుతుంది. (PTI)
(4 / 5)
లక్ష్యసేన్, లీ జీ జియా మధ్య జరగనున్న పారిస్ ఒలింపిక్స్ 2024 బ్రాంజ్ మెడల్ బ్యాడ్మింటన్ మ్యాచ్‍ను స్పోర్ట్స్ 18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ చూడొచ్చు. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వీక్షించుచొచ్చు. నేటి సాయంత్రం 6 గంటలకు పోరు షురూ అవుతుంది.(AP)
(5 / 5)
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ చేరిన తొలి భారత ప్లేయర్‌గా లక్ష్య రికార్డు సాధించాడు. అయితే, సెమీస్‍లో డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో లక్ష్య ఓడాడు. దీంతో కాంస్య పతకం కోసం లీ జీ జియాతో నేడు (ఆగస్టు 5) తలపడనున్నాడు. మరి లక్ష్య పతకం కొట్టి చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి. (PTI)
ఇతర గ్యాలరీలు