తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli | కోహ్లీ 50 పరుగులు చేసినా.. బాగా ఆడలేదనే అంటారు: అజార్

Virat Kohli | కోహ్లీ 50 పరుగులు చేసినా.. బాగా ఆడలేదనే అంటారు: అజార్

03 June 2022, 16:51 IST

google News
    • విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు 50 పరుగులు చేసినప్పటికీ.. అభిమానులు కోహ్లీ బాగా ఆడలేదనే అంటారని స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (REUTERS)

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ.. ఈ ఐపీఎల్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. రన్నింగ్ మెషిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ.. ప్రస్తుతం పరుగులు కోసం పరితపిస్తుండటం అభిమానులను మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే విరాట్ భారీ స్కోరు సాధించి రెండేళ్లుపైనే అవుతుంది. వర్క్ లోడ్ తగ్గించుకుని అన్ని ఫార్మాట్లలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీని వదులుకున్న ఫలితం రాలేదు. తాజాగా విరాట్ ఫామ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థిరత్వం లేమి కారణంగా ఇబ్బందిపడుతున్న కోహ్లీ.. 50, 60 పరుగులు చేసినా అభిమానులు అతడు విఫలమయ్యాడనే అంటారని తెలిపారు.

“ప్రస్తుతం కోహ్లీ 50 పరుగులు చేసినా అతడు విఫలమ.య్యాడనే అంటారు. ఎందుకంటే అంతకు ముందు అతడు చేసిన ప్రదర్శన అలాంటిది. ఈ సమస్యను ప్రతి క్రికెటర్ ఎదుర్కొంటాడు. అత్యుత్తమ ఆటగాళ్లు కూడా కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కొని ఉంటారు. కోహ్లీ టెక్నిక్ బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్కసారి పెద్ద స్కోరు లేదా సెంచరీ చేసినట్లయితే.. అతడి దూకుడు.. ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది.” అని అజార్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అభిప్రాయపడ్డాడు.

హార్దిక్ పాండ్య తిరిగి ఫామ్ పుంజుకోవడాన్ని అజార్ ప్రశంసించాడు. “హార్దిక్ పాండ్యకు టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకునే సామర్థ్యముంది. కానీ గాయాల కారణంగా స్థిరత్వాన్ని కోల్పోయాడు. తిరిగి మళ్లీ పుంజుకున్నాడు. అతడు నాలుగు ఓవర్లు పూర్తిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎంతకాలం అతడు పూర్తిగా బౌలింగ్ చేస్తాడో తెలియదు కానీ.. అతడు తప్పకుండా ఆల్‌రౌండర్‌గా మెరుగైన బౌలింగ్ చేస్తాడు. ”అని అజార్ స్పష్టం చేశాడు.

ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ.. తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. అతడి కెరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన ఈ సీజన్‌లోనే చేశాడు. 16 మ్యాచ్‍‌ల్లో 22.73 సగటుతో అతడు 341 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నప్పటికీ చాలా సార్లు 20ల్లోనే ఔటయ్యాడు.

టాపిక్

తదుపరి వ్యాసం