తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli | సెహ్వాగ్, కోహ్లిల‌ను అంపైర్లుగా చూడాల‌ని ఉందంటున్న సైమ‌న్ టౌఫెల్‌

Virat kohli | సెహ్వాగ్, కోహ్లిల‌ను అంపైర్లుగా చూడాల‌ని ఉందంటున్న సైమ‌న్ టౌఫెల్‌

HT Telugu Desk HT Telugu

29 May 2022, 11:48 IST

google News
  • ప్రజెంట్ వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ అంపైర్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు సైమన్ టౌఫెల్. ఖచ్చితమైన నిర్ణయాలతో ఎన్నో సందర్భాల్లో క్రికెట్ అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు విరాట్ కోహ్లి, అశ్విన్ అంపైరింగ్ ను కెరీర్ గా ఎంచుకుంటే చూడాలని ఉందంటూ టౌఫెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (twitter)

విరాట్ కోహ్లి

సమకాలీన క్రికెట్‌లో బెస్ట్ అంపైర్‌గా పేరుతెచ్చుకున్నాడు సైమ‌న్ టౌఫెల్‌. పదమూడు సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నాడతడు. 2008 నుంచి 2013 వరకు వరుసగా ఐదేళ్ల పాటు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ గా టౌఫెల్ అవార్డులను దక్కించుకున్నాడు. ప్రస్తుతం టౌఫెల్ ఐపీఎల్ కు అంపైరింగ్ చేస్తున్నాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ లను అంపైర్లుగా చూడాలని ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టౌఫెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  సెహ్వాగ్ లో అంపైరింగ్ చేసే సామర్థ్యం చాలా ఉందని టౌఫెల్ అన్నాడు. 

సెహ్వాగ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో తాను చాలా మ్యాచ్ లకు అంపైరింగ్ చేశానని గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో స్వ్కేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తూ అవుట్, నాటౌట్ లను సెహ్వాగ్ ఖచ్చితంగా చెబుతుండేవాడని టౌఫెల్ అన్నాడు. క్రికెట్ ఆటపై అతడికున్న ప‌రిజ్ఞానాన్ని చూసి అంపైరింగ్ ను కెరీర్ గా ఎంచుకోమని సెహ్వాగ్ కు  సలహా ఇచ్చానని పేర్కొన్నారు. కానీ తన ప్రతిపాదనను సెహ్వాగ్ తిరస్కరించినట్లు టౌఫెల్ పేర్కొన్నాడు. అతడు అంపైరింగ్ చేస్తే చూడాలని ఉందని అన్నాడు. 

అలాగే నేటితరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ లకు ఆటకు సంబంధించిన విధివిధానాలపై స్పష్టమైన అవగాహన ఉందని టౌఫెల్ అన్నాడు. వారు కూడా అంపైరింగ్ చేపట్టవచ్చునని టౌఫెల్ తెలిపాడు. అంపైరింగ్ ను కెరీర్ ఎంచుకోవాలనే మక్కువ చాలా మంది క్రికెటర్లలో తాను చూశానని చెప్పాడు. మోర్నీ మోర్కెల్ లాంటి క్రికెటర్లు ఆ ఆలోచనను తనతో పంచుకున్నారని గుర్తుచేశాడు. కానీ అంపైరింగ్ లో రాణించడం సులభం కాదని టౌఫెల్ పేర్కొన్నాడు. టౌఫెల్ చేసిన ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వీటిపై సెహ్వాగ్  విధంగా స్పందిస్తాడో వేచిచూడాల్సిందే. 

టాపిక్

తదుపరి వ్యాసం