తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lionel Messi Wins Ballon D’or Award: మళ్లీ మెస్సీకే బ్యాలన్ డోర్ అవార్డు.. 8వసారి అందుకున్న స్టార్ ప్లేయర్

Lionel Messi wins Ballon d’Or award: మళ్లీ మెస్సీకే బ్యాలన్ డోర్ అవార్డు.. 8వసారి అందుకున్న స్టార్ ప్లేయర్

Hari Prasad S HT Telugu

31 October 2023, 7:30 IST

    • Lionel Messi wins Ballon d’Or award: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకే బ్యాలన్ డోర్(Ballon d’Or) అవార్డు దక్కింది. 8వసారి ఈ అవార్డు అందుకొని అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.
బ్యాలన్ డోర్ అవార్డుతో లియోనెల్ మెస్సీ
బ్యాలన్ డోర్ అవార్డుతో లియోనెల్ మెస్సీ (AP)

బ్యాలన్ డోర్ అవార్డుతో లియోనెల్ మెస్సీ

Lionel Messi wins Ballon d’Or award: అర్జెంటీనా స్టార్, గతేడాది తన వరల్డ్ కప్ ఆకాంక్షను నెరవేర్చుకున్న లియోనెల్ మెస్సీకి మరోసారి ప్రతిష్టాత్మక బ్యాలన్ డోర్ (Ballon d’Or) అవార్డు దక్కింది. ఈ అవార్డు అతడు అందుకోవడం ఇది 8వసారి కావడం విశేషం. సోమవారం (అక్టోబర్ 30) రాత్రి పారిస్ లోని థియేటర్ డు షాటలెట్ లో జరిగిన సెర్మనీలో మెస్సీ ఈ అవార్డు అందుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఫ్రెంచ్ స్టార్ ప్లేయర్ ఎంబాపె, మాంచెస్టర్ సిటీ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ లను వెనక్కి నెట్టి మెస్సీ ఈ బ్యాలన్ డోర్ అవార్డు ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు అర్జెంటీనా టీమ్ మొత్తానికి నా బహుమానం అని ఈ సందర్భంగా మెస్సీ అన్నాడు. అతనికి ఈ అవార్డును ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్ అందజేశాడు. అర్జెంటీనా దివంగత స్టార్ ప్లేయర్ మారడోనాకు మెస్సీ ఈ అవార్డు అంకితమిచ్చాడు.

సోమవారం మారడోనా 63వ జయంతి. ఈ మధ్యే బ్యాలన్ డోర్ అవార్డు నిబంధనల్లో మార్పు చేయడం మెస్సీకి కలిసి వచ్చింది. పూర్తి కేలండర్ ఇయర్ కాకుండా గత సీజన్ లో ప్లేయర్ రికార్డు చూసి అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మెస్సీకి ఈ అవార్డు దక్కింది. తొలిసారి 2009లో మెస్సీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.

ప్రస్తుతం అందుకున్నది 8వ అవార్డు. మరో స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కంటే మూడు ఎక్కువ కావడం విశేషం. ఈ అవార్డు కోసం ప్లేయర్ ను ఎంపిక చేసేది స్పోర్ట్స్ జర్నలిస్టులే. ఫిఫా ర్యాంకింగ్స్ లో టాప్ 100 దేశాల్లోని ఒక్కో జర్నలిస్ట్ అవార్డు కోసం ఓటు వేస్తారు. బ్యాలన్ డోర్ అనేది ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ మ్యాగజైన్.

గతేడాది తన వరల్డ్ కప్ కల సాకారం చేసుకున్న మెస్సీకి ఆ విజయమే ఈ అవార్డు వరించేలా చేసింది. ఖతార్ లో జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఫ్రాన్స్ ను పెనాల్టీస్ లో 4-2తో ఓడించి అర్జెంటీనా ట్రోఫీ గెలుచుకుంది.

తదుపరి వ్యాసం