తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi Stunning Goal: మెస్సీ అరుదైన ఘనత.. ఫ్రికిక్ గోల్‌తో కెరీర్ బెస్ట్ రికార్డు

Messi Stunning Goal: మెస్సీ అరుదైన ఘనత.. ఫ్రికిక్ గోల్‌తో కెరీర్ బెస్ట్ రికార్డు

08 January 2024, 19:22 IST

google News
  • Messi Stunning Goal: అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ అదిరిపోయే శైలిలో ఫ్రీ కిక్ గోల్ ఆకట్టుకున్నాడు. పనామాతో జరిగిన మ్యాచ్‌లో తన కెరీర్‌లో 800వ గోల్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో గెలిచింది.

మెస్సీ అదిరిపోయే ఫ్రీ కిక్
మెస్సీ అదిరిపోయే ఫ్రీ కిక్ (AFP)

మెస్సీ అదిరిపోయే ఫ్రీ కిక్

Messi Stunning Goal: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో తన దేశానికి టైటిల్ తీసుకొచ్చిన ఈ స్టార్‌కు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారుతోంది. తాజాగా వరల్డ్ కప్ తర్వాత తొలిసారి అర్జెంటీనా తన హోమ్ కమింగ్ సెలబ్రెషన్స్‌లో భాగంగా పనామాతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పనామా 2-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మెస్సీ అద్భుతమైన ఫ్రీ కిక్ గోల్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా మెస్సీ తన ఫుట్‌బాల్ కెరీర్‌లో 800వ గోల్‌ను సాధించాడు. అతడి కంటే ముందు పోర్చుగల్ స్టార్ రొనాల్డో 830 గోల్స్‌తో ఉన్నాడు.

బ్యూనస్ ఎరిస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు 83 వేల మంది వచ్చారు. గతేడాది మూడో సారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న అర్జెంటీనా హోమ్ కమింగ్ సెలబ్రేషన్స్ చూసేందుకు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మెస్సీ ఫ్రీ కిక్ స్టైల్ గోల్‌తో ఆకట్టుకున్నాడు. అతడితో పాటు 21 ఏళ్ల థియాగో అల్మాడా కూడా గోల్ చేశాడు. వీరిద్దరి ప్రదర్శనతో పనామాపై ఆతిథ్య జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం మెస్సీ కొట్టిన ఈ గోల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్ చూసేందుకు మెస్సీ సహా తన కోచ్, ఇతర ఆటగాళ్లు తమ పిల్లలతో కలిసి వచ్చారు. అర్జెంటీనా వరల్డ్ కప్ విజయానికి సంకేతంగా పాడే ప్రచార గీతం 'ముచాచోస్‌' ను అభిమానులు అందరూ కలిసి ఆలపించగా పలువురు ఆటగాళ్లు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ తర్వాత జరిగిన పార్టీలో వరల్డ్ కప్ జట్టు సభ్యులందరికీ ట్రోఫీలు అందజేశారు. పనామా జట్టు ఫీల్డ్‌లో కాస్త బలహీనంగా కనిపించినప్పటికీ ప్రపంచకప్ ఛాంపియన్‌ను 78 నిమిషాల పాటు ఎదుర్కొంది. అప్పటి వరకు గోల్ సాధించకుండా నిలువరించింది.

డిసెంబరులో జరిగిన సాకర్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. మ్యాచ్ 3-3తో డ్రాగా తేలగా.. ఫెనాల్టీ షూటౌట్‌లో మెస్సీ జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది. చివరి వరకు గెలుపు కోసం ఇరుజట్లు పోటీ పడగా.. చివరకు విజయం అర్జెంటీనానే వరించింది.

తదుపరి వ్యాసం