Messi Receives Death Threat: మెస్సీకి బెదిరింపులు.. నీ కోసమే ఎదురుచూస్తున్నామని రాతలు..!-lionel messi receives death threat and left message as waiting for you ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi Receives Death Threat: మెస్సీకి బెదిరింపులు.. నీ కోసమే ఎదురుచూస్తున్నామని రాతలు..!

Messi Receives Death Threat: మెస్సీకి బెదిరింపులు.. నీ కోసమే ఎదురుచూస్తున్నామని రాతలు..!

Maragani Govardhan HT Telugu
Mar 03, 2023 09:12 PM IST

Messi Receives Death Threat: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీపై కొంతమంది ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి భార్య కుటుంబానికి చెందిన సూపర్ మార్కెట్‌పై దాడి చేసి అనంతరం నేలపై నీ కోసం చూస్తున్నాం మెస్సీ అంటూ రాశారు.

మెస్సీ
మెస్సీ (REUTERS)

Messi Receives Death Threat: అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే సంగతి అందరికీ తెలిసిందే. గతేడాది జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌లో నెగ్గి తన జట్టును విశ్వవిజేతగా నిలిపిన మెస్సీ గురించి ఇప్పుడు ఏ చిన్న వార్త వచ్చినా అది పెద్ద సంచలనమే అవుతోంది. తాజాగా మెస్సీనే లక్ష్యంగా చేసుకుని కొంతమంది ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా అతడిని చంపేయడానికి కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అర్జెంటీనాలోని రోసారియా నగరంలో మెస్సీ భార్య కుటుంబానికి చెందిన ఓ సూపర్ మార్కెట్‌పై అర్ధరాత్రి వేల కాల్పులు జరిపారు. సుమారు 14 రౌండ్ల బుల్లెట్లు పేల్చినట్లు సమాచారం. అనంతరం "మెస్సీ నీ కోసం ఎదురుచూస్తున్నాం" అని అక్కడ నేలపై రాశారు. అంతటితో ఆగకుండా "నగర మేయర్ పాబ్లో జావ్కిన్ ఓ డ్రగ్స్ డీలర్. అతడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేడు" అని కూడా పేర్కొన్నారు.

ఈ ఘటనపై నగర మేయర్ జావ్కిన్ కూడా స్పందించారు. దాడి జరిగింది నిజమేననని ఆయన ధ్రువీకరించారు. స్థానికంగా గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నామన్నారు. ప్రపంచానికి మెస్సీపై ఉన్న క్రేజ్‌ను చేసుకోవాలనే కొంతమంది ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మెస్సీ వారు వాడుకుంటే పాపులర్ కావొచ్చన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చన్నారు. మెస్సీపై దాడి కంటే ప్రపంచంలో ఏ స్టోరీ వేగంగా వైరల్ కాగలదని వ్యాఖ్యానించారు. ఇదంతా కొంతకాలంగా జరుగుతుందని, పోలీసులు కూడా ఈ అంశంపై ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారని తెలిపారు.

అర్జెంటీనాలోని రొసారియో మెస్సీ స్వస్థలం. ఈ ప్రదేశం గత కొంతకాలంగా అక్రమ రవాణా, హింసాత్మక ఘటనలకు కేంద్రంగా మారినట్లు చెబుతున్నారు. 2022లో ఇక్కడ 287 హత్యలు జరిగినట్లు సమాచారం.

Whats_app_banner