తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ks Bharat Debut: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు వస్తుందని ఊహించలేదు: తొలి టెస్ట్ ఆడుతున్న కేఎస్ భరత్

KS Bharat Debut: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు వస్తుందని ఊహించలేదు: తొలి టెస్ట్ ఆడుతున్న కేఎస్ భరత్

Hari Prasad S HT Telugu

09 February 2023, 10:34 IST

    • KS Bharat Debut: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు వస్తుందని ఊహించలేదు అని అన్నాడు ఇండియా తరఫున తొలి టెస్ట్ ఆడుతున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్. ఓ బాల్ బాయ్ స్థాయి నుంచి ఇప్పుడింత ఎత్తుకు ఎదిగిన అతని ప్రయాణం అద్భుతమే.
ఇండియన్ టీమ్ క్యాప్ అందుకున్న తర్వాత తన కొడుకు భరత్ కు ముద్దు పెడుతున్న అతని తల్లి
ఇండియన్ టీమ్ క్యాప్ అందుకున్న తర్వాత తన కొడుకు భరత్ కు ముద్దు పెడుతున్న అతని తల్లి (AP)

ఇండియన్ టీమ్ క్యాప్ అందుకున్న తర్వాత తన కొడుకు భరత్ కు ముద్దు పెడుతున్న అతని తల్లి

KS Bharat Debut: 2005, విశాఖపట్నం.. ఎమ్మెస్ ధోనీ అనే ఓ జులపాల జుట్టు ఉన్న వికెట్ కీపర్ అంతర్జాతీయ క్రికెట్ లోకి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. పాకిస్థాన్ పై 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేఎస్ భరత్ ఓ బాల్ బాయ్. అలాంటి వ్యక్తి 18 ఏళ్ల తర్వాత ఒకప్పుడు ఆ లెజెండరీ వికెట్ కీపర్ మోసిన బాధ్యతలను తన భుజానికెత్తుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ లో జరుగుతున్న తొలి టెస్టుతోనే భరత్ ఇండియన్ టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో రెగ్యులర్ కీపర్ అయిన రిషబ్ పంత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం ఇప్పుడు భరత్ కు ఈ అవకాశం వచ్చేలా చేసింది. ఇప్పుడు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ లో తరచూ ఆడుతున్న ఇషాన్ కిషన్ జట్టుతోపాటే ఉన్నా.. అతన్ని కాదని భరత్ కు మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది.

ఎంతో గర్వంగా ఉంది: భరత్

ఇలా ఇండియన్ టీమ్ తరఫున తొలి టెస్టు ఆడుతుండటం తనకెంతో గర్వంగా ఉందని భరత్ అన్నాడు. "చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంతో గర్వంతో మురిసిపోయే క్షణం. నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఈ రోజు వస్తుందని నిజంగా అనుకోలేదు. కానీ నా చిన్ననాటి కోచ్ జే కృష్ణారావ్ నాపై నమ్మకం ఉంచారు. నాకు ఆ సత్తా ఉదని ఆయన నమ్మారు" అని బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ భరత్ చెప్పాడు.

ఇక తన కెరీర్ ఎప్పుడూ రాకెట్ లాగా దూసుకెళ్లలేదని, ఒక్కో అడుగు వేసుకుంటూ ఇప్పుడీ స్థాయి చేరినట్లు తెలిపాడు. 2018లో తొలిసారి ఇండియా ఎ టీమ్ కు ఆడిన సమయంలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్నాడని, అతడు తనను ఎంతగానో ప్రోత్సహించాడని ఈ సందర్భంగా భరత్ చెప్పాడు.

"నా ఆటను అతడు ఎప్పుడూ మార్చాలని చూడలేదు. నేను చేస్తున్నదానిని అలాగే చేస్తూ వెళ్లమని చెప్పాడు. ఓ వ్యక్తిగా, ప్లేయర్ గా ఎలా ఉన్నానో అలాగే ఉండమని ప్రోత్సహించాడు" అని ఆ ఇంటర్వ్యూలో భరత్ చెప్పాడు.

భరత్ ఇప్పటి వరకూ ఆంధ్రా టీమ్ తరఫున 86 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 4707 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 64 లిస్ట్ ఎ మ్యాచ్ లలో 6 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 1950 పరుగులు చేశాడు. భరత్ 67 టీ20లు కూడా ఆడాడు. అందులో 5 హాఫ్ సెంచరీలతో 1116 రన్స్ చేశాడు.

తదుపరి వ్యాసం