KL Rahul | జట్టును గెలిపించాడు... పన్నెండు లక్షల ఫైన్ కట్టాడు
17 April 2022, 11:30 IST
- శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్. ఈ మ్యాచ్ లో ముంబైపై లక్నో పద్దెనిమిది పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది. కానీ ఈ మ్యాచ్ లో కె.ఎల్.రాహుల్ కు పన్నెండు లక్షల ఫైన్ పడింది. ఎందుకంటే...
కె.ఎల్.రాహుల్
శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో లక్నో సూపర్ జెయింట్స్ ను గెలిపించాడు కెప్టెన్ కె.ఎల్.రాహుల్. ఐపీఎల్ లోవందో మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా చరిత్రను సృష్టించాడు. రాహుల్ 60 బాల్స్ లో 103 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లపై అతడు విరుచుకుపడటంతో లక్నో ఇరవై ఓవర్లలో 199 పరుగుల స్కోరు చేసింది. లక్ష్యఛేధనలో తడబడిన ముంబై 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. పద్దెనిమిది పరుగుల తేడాతో లక్నో విజయాన్ని అందుకున్నది.
అయితే సెంచరీ చేసిన ఆనందం కె.ఎల్ రాహుల్ కు ఎక్కువసేపు నిలవలేదు. ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ కె.ఎల్.రాహుల్ కు పన్నెండు లక్షల ఫైన్ విధించినట్లు ఐపీఎల్ బోర్డ్ ప్రకటించింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం లక్నోకు ఇదే మొదటిసారి కావడంతో ఫైన్ తో సరిపెట్టినట్లు వెల్లడించారు. మరోసారి ఇదే పునరావృతమైతే రాహుల్ పై నిషేధం పడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
టాపిక్