Pant Injury Spoil the Team: పంత్ నిన్ను కొట్టేస్తాను.. నీ వల్ల టీమిండియా కాంబినేషన్ దెబ్బతింది.. భారత దిగ్గజం కామెంట్స్
08 February 2023, 13:28 IST
- Pant Injury Spoil the Team: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. భారత దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి గాయం వల్ల భారత జట్టు కాంబినేషన్ దెబ్బతిందని మండిపడ్డారు.
రిషబ్ పంత్
Pant Injury Spoil the Team: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల కారు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అతడు యాక్సిడెంట్‌కు గురికావడంతో త్వరగా కోలుకోవాలని సర్వత్రా తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. తిరిగి జట్టులోకి రావాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నారు. ఇంతమంది అతడి కోసం ప్రార్థినల మధ్యలో ఊహించని స్టేట్మెంట్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది. పంత్ గాయం కారణంగా టీమిండియా కాంబినేషన్ దెబ్బతిందని భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఇలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురైనందుకు కొట్టేస్తాను అంటూ మండిపడ్డారు.
పంత్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతడు త్వరగా కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కానీ అతడి వద్దకు వెళ్ల చెంపదెబ్బ కొట్టాలనుకుంటున్నాను. పంత్ తనపై శ్రద్ధ పెట్టి ఉన్నట్లయితే ప్రమాదానికి గురయ్యే వాడు కాదు. అతడి గాయం టీమ్ మొత్తం కాంబినేషన్‌ను దెబ్బతీసింది. అందుకే అతడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో కోపం కూడా ఉంటుంది. నేటి యువతలో చాలా మంది అబ్బాయిలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అతడికి ఓ చెంపదెబ్బ కూడా కొట్టాలి. అని కపిల్ స్పష్టం చేశారు.
ఏదిఏమైనప్పటికీ కపిల్ దేవ్ ఓ పాజిటివ్ నోట్‌లోనే పంత్‌పై మండిపడ్డారు. అతడి మీద ప్రేమతో, జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది. పంత్ విషయంలో ఓ మంచి పాయింట్ కూడా కపిల్ లేవనెత్తారు. అతడు లేకపోవడంతో మిడిల్ ఆర్డర్‌లో టీమ్ మేనేజ్మెంట్‌కు తలనొప్పిగా మారింది. కేవలం వికెట్ కీపింగ్ కారణమే కాకుండా బ్యాటింగ్ కూడా ఆ స్థానంలో కీలకం. పంత్ లాంటి దూకుడైన బ్యాటర్ లేకపోవడం ఇప్పుడు ఇబ్బందిగా మారింది.
పంత్ సకాలంలో డిశ్చార్జ్ అయితే కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. అయితే అతడు 2023 ప్రపంచకప్ సహా మొత్తం నుంచి తప్పించే అవకాశముంది. పత్ లేకపోవడంతో ఇప్పుడు టీమిండియా ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తోంది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటికే లెజండరీ స్టేటస్‌కు చేరుకున్న టెస్టుల్లో భారత్ కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.