తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ishan Kishan Autograph: ధోనీ ఆటోగ్రాఫ్‌ పక్కనే నా ఆటోగ్రాఫా.. నేను ఆ రేంజ్‌కు వెళ్లలేదు: ఇషాన్‌ కిషన్‌

Ishan Kishan Autograph: ధోనీ ఆటోగ్రాఫ్‌ పక్కనే నా ఆటోగ్రాఫా.. నేను ఆ రేంజ్‌కు వెళ్లలేదు: ఇషాన్‌ కిషన్‌

Hari Prasad S HT Telugu

20 December 2022, 16:14 IST

    • Ishan Kishan Autograph: ధోనీ ఆటోగ్రాఫ్‌ పక్కనే నా ఆటోగ్రాఫా.. నేను ఆ రేంజ్‌కు వెళ్లలేదు అంటూ అభిమానుల మనుసు గెలుచుకున్నాడు యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌.
ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ (PTI)

ఇషాన్ కిషన్

Ishan Kishan Autograph: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈ మధ్యే బంగ్లాదేశ్‌పై వన్డేలో డబుల్‌ సెంచరీ, ఆ తర్వాత రంజీల్లో సెంచరీతో చెలరేగిన ఇషాన్‌.. ఇప్పుడు ఫీల్డ్‌ బయట తన వైఖరితో వార్తల్లో నిలిచాడు. తాను ఇంకా ధోనీ అంతటి వాడిని కాలేదని, అతని ఆటోగ్రాఫ్‌ పైన తన ఆటోగ్రాఫ్‌ చేయలేనని ఇషాన్‌ అనడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ అభిమాని ఇషాన్‌తో ఫొటో దిగి, ఆ తర్వాత అతని ఆటోగ్రాఫ్‌ అడిగాడు. తన మొబైల్‌ వెనుక భాగంలో ఈ ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలని కోరాడు. అయితే అప్పటికే ఆ మొబైల్‌ వెనుక ధోనీ ఆటోగ్రాఫ్‌ ఉండటం చూసిన ఇషాన్.. అదే విషయం ఆ అభిమానితో చెప్పాడు. "ఇప్పటికే మహీ భాయ్‌ సిగ్నేచర్‌ ఇక్కడ ఉంది. దానిపైన నన్ను చేయాలని అంటున్నావ్‌. నేనలా చేయలేను. నేనింకా ఆ స్థాయికి చేరలేదు. కావాలంటే కింద చేస్తాను" అంటూ ధోనీ ఆటోగ్రాఫ్‌ కింద తన ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు ఇషాన్‌ కిషన్‌.

ఇషాన్‌ కిషన్‌ చాలా రోజులుగా ఇండియన్‌ టీమ్‌లోకి వస్తూ వెళ్తున్నా.. ఈ మధ్య బంగ్లాదేశ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. కేవలం 126 బాల్స్‌లోనే డబుల్‌ సెంచరీతో.. ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి తన టీమ్‌ జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు.

ఇషాన్‌ డబుల్‌ సెంచరీపై అతని కోచ్ ఉత్తమ్‌ మజుందార్‌ మాట్లాడుతూ.. నిజానికి అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయకముందే ధోనీ దీనిని ఊహించాడని చెప్పాడు. "ఇషాన్‌ ఇండియాకు ఆడక ముందే అతనిలాంటి టాలెంటెడ్‌ ప్లేయర్‌ ఇండియాకు సుదీర్ఘ కాలం ఆడలేకపోతే అది తనకు తాను అన్యాయం చేసుకుంటున్నట్లే అని ధోనీ చెప్పేవాడు" అని ఉత్తమ్‌ వెల్లడించాడు.

ఇషాన్‌ ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే అతనిలోని చురుకుదనాన్ని గుర్తించినట్లు చెప్పాడు. "తొలిరోజు ఇషాన్‌ ట్రైనింగ్‌కు వచ్చినప్పుడు అతడు చాలా చిన్నగా కనిపించాడు. నేను అతనికి అండర్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేస్తే అతడు పర్ఫెక్ట్‌గా కవర్‌ డ్రైవ్స్‌ ఆడేవాడు. కొన్ని కవర్‌ డ్రైవ్‌లు చూసిన తర్వాత ఇషాన్‌ తండ్రి ప్రణవ్‌తో చెప్పాను. అతడు ఇండియాకు ఆడకపోతే అతని కంటే దురదృష్టవంతులు ఉండరు అని" అంటూ ఉత్తమ్‌ చెప్పుకొచ్చాడు.

టాపిక్

తదుపరి వ్యాసం