తెలుగు న్యూస్  /  Sports  /  Irfan Pathan Responds To Pakistan Pm For Trolling Indian Team

Irfan Pathan Counter to Pakistan PM: పాక్ ప్రధానికి ఇర్ఫాన్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇతరుల ఓటమితో సంతోషిస్తారని వెల్లడి

12 November 2022, 15:44 IST

    • Irfan Pathan Counter to Pakistan PM: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమితో పాకిస్థాన్‌లో మన జట్టుపై ట్రోలింగ్ విపరీతంగా చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా టీమిండియాను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.
ఇర్ఫాన్ పఠాన్
ఇర్ఫాన్ పఠాన్ (PTI)

ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan Counter to Pakistan PM: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్రా భారత్‌పై విమర్శలు వెల్లువెత్తగా.. పాకిస్థాన్ మాత్రం భారత్‌పై ట్రోల్స్ చేస్తూ మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. ఆ దేశ ప్రధాని సైతం టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమిని అపహాస్యం చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా స్పందించారు. దీంతో భారత అభిమానులు పాక్ ప్రధాని ట్వీట్‍పై మండిపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిన అనంతరం ఈ ఆదివారం పాకిస్థాన్-ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా 152/0. 170/0 అంటూ గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో పాక్‌పై ఓటమిని, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో టీమిండియా ఓటమిని గుర్తు చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పాక్ ప్రధాని ట్వీట్‌పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఇతరుల ఓటమితో సంతోషిస్తుంది అని మండిపడ్డారు.

"మీకు, మాకు మధ్య తేడా ఏంటంటే.. మేము మా విజయంతో సంతోష పడతాం. మీరు మాత్రం పక్కవారి ఓటమితో ఆనందిస్తారు. అందుకే మీరు మీ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు" అంటూ ఇర్ఫాన్ చురకలు అంటించాడు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఈ విధంగా రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల కిందట పాకిస్థాన్.. జింబాబ్వే చేతిలో పరాజయం పాలవ్వగా.. ఆ దేశ అధ్యక్షుడిని ఉటంకిస్తూ స్ట్రాంగ్ ట్వీట్ చేశారు. ఫేక్ బీన్ ట్వీట్‌ అంటూ పాక్ ప్రధాని పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.