Bipasha blessed with baby Girl: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా.. ఆనందంలో కరణ్-బిపాసా దంపతులు
12 November 2022, 14:53 IST
- Bipasha blessed with baby Girl: బాలీవుడ్ నటులు బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. శనివారం నాడు బిపాసా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీరు ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా
Bipasha blessed with baby Girl: బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్న బిపాసా.. తాజాగా మరో బేబీ గర్ల్‌కు జన్మనిచ్చింది. దీంతో ఈ దంపతులు ఇంట ఆనందం వెల్లివెరిసింది. ప్రస్తుతం వీరిద్దరూ తమ బేబీ గర్ల్ పుట్టిన సంతోషంలో తేలియాడుతున్నారు. 2016లో కరణ్‌ను పెళ్లి చేసుకున్న బిపాసా.. ఆరేళ్ల తర్వాత తల్లయింది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన ఈ జంట.. తాజాగా బిడ్డ పుట్టడంతో ఆ మధురు క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
గర్భం దాల్చినప్పటికీ తన అందం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంది బిపాసా. ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఫొటోషూట్ చూసి అసలైన మాతృత్వపు అందాలను అభిమానులకు షేర్ చేసింది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మెటర్నిటీ ఫొటోషూట్‌లోనూ అలరించింది.
ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో బిపాసా బ్రాంజ్ క్లాత్‌ను ధరించింది. వీటికి తగినట్లు మ్యాచింగ్ అయ్యే ఇయర్ రింగ్స్ తొడుక్కుని తన అందాలను ప్రదర్శించింది. అంతేకాకుండా ఈ ఫొటోకు ఓ క్యాప్షన్ కూడా జోడించింది. "అన్ని వేళలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకున్న శరీరాన్ని ప్రేమించండి." అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలను జోడించింది.
నెటిజన్లు బిపాసా మెటర్నిటీ ఫొటోపై హార్ట్ ఎమోజీల వర్షాన్ని కురిపించారు. అద్భుతమైన అమ్మ అంటూ ఓ వ్యక్తి స్పందించగా.. సూపర్ మామ్ ఆఫ్ బాలీవుడ్ అంటూ మరో యూజర్ తన కామెంట్ పోస్ట్ చేశారు. గర్భవతిగా మీ కళ మరింత పెరిగింది అంటూ ఇంకో యూజర్ స్పందించాడు. చాలా మంది అభిమానులు బిపాసా గర్భిణీ రూపాన్ని ప్రశంసించారు. హార్ట్ ఎమోజీలతో విషెస్ తెలిపారు.
బిపాసా 2016లో తన సహచర నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. 2015లో వచ్చిన అలోన్ మూవీ షూటింగ్ సమయంలో కలుసుకున్న వీరిద్దరూ ప్రేమించుకున్న పెళ్లిచేసుకున్నారు. బెంగాలీ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ చిత్రం తర్వాత డేంజరస్ అనే వెబ్‌సిరీస్‌లోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు.
టాపిక్