తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Simon Doull On Kohli: వ్య‌క్తిగ‌త రికార్డుల‌పైనే కోహ్లి దృష్టి - న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్ కామెంట్స్‌

Simon Doull on Kohli: వ్య‌క్తిగ‌త రికార్డుల‌పైనే కోహ్లి దృష్టి - న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్ కామెంట్స్‌

11 April 2023, 18:04 IST

google News
  • Simon Doull on Kohli: ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ శైలిపై కామెంటేట‌ర్, న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్ సైమ‌న్ డౌల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

Simon Doull on Kohli: టీమ్ ప్ర‌యోజ‌నాల కంటే వ్య‌క్తిగ‌త రికార్డుల‌కే కోహ్లి ప్రాధాన్య‌త‌నిస్తోస్తోన్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్ సైమ‌న్ డౌల్ చేసిన కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి 44 బాల్స్‌లో 61 ర‌న్స్ చేశాడు. ఆరంభంలో వేగంగా ఆడిన కోహ్లి హాఫ్ సెంచ‌రీకి చేరువ అవుతోన్నస‌మ‌యంలో దూకుడును త‌గ్గించాడు.

25 బాల్స్‌లోనే 42 ర‌న్స్ చేసిన కోహ్లి మిగిలిన ఎనిమిది ర‌న్స్ చేయ‌డానికి ప‌దికిపైగా బాల్స్ తీసుకున్నాడు. హాఫ్ సెంచ‌రీ కోసం కోహ్లి నెమ్మ‌దిగా ఆడ‌టంతో ఆర్‌సీబీ స్కోరు వేగం త‌గ్గింది. కోహ్లి ఆట‌తీరుపై న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్‌, కామెంటేట‌ర్ సైమ‌న్ డౌల్ విమ‌ర్శ‌లు గుప్పించాడు. జ‌ట్టు ప్ర‌యోజ‌నాల కంటే త‌న వ్య‌క్తిగ‌త రికార్డులే ముఖ్యం అన్న‌ట్లుగా కోహ్లి బ్యాటింగ్ శైలి క‌నిపించింద‌ని పేర్కొన్నాడు.

ఇన్నింగ్స్ ఆరంభంలో స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ చేశాడు. బ‌ల‌మైన షాట్స్ కొట్టాడు. 42 ప‌రుగుల వ్య‌క్త‌గ‌త స్కోరు నుంచి అత‌డి ఆట‌తీరు పూర్తిగా మారింది. ఎనిమిది ప‌రుగులు చేయ‌డానికి ప‌దికిపైగా బాల్స్ తీసుకున్నాడు. ఆ స‌మ‌యంలో హాఫ్ సెంచ‌రీ చేయ‌డ‌మే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా బ్యాటింగ్ చేశాడు.

వ్య‌క్తిగ‌త రికార్డుల‌పైనే దృష్టిసారించిన‌ట్లుగా క‌నిపించాడు. రికార్డులు ఆట‌గాళ్ల‌కు మంచివే. కానీ అవి జ‌ట్టు విజ‌యానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉన్న‌ప్పుడే వాటికి విలువ ఉంటుంది అంటూ సైమ‌న్ డౌల్‌ కామెంట్స్ చేశాడు. అత‌డి కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. కోహ్లి, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచ‌రీల‌తో మెరిసినా ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు ఓట‌మి పాలైంది.

తదుపరి వ్యాసం