తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Russell On Rinku: అది రింకు కాకపోయి ఉంటే అసలు పరుగెత్తేవాడినే కాదు: రసెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Russell on Rinku: అది రింకు కాకపోయి ఉంటే అసలు పరుగెత్తేవాడినే కాదు: రసెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

09 May 2023, 14:35 IST

    • Russell on Rinku: అది రింకు కాకపోయి ఉంటే అసలు పరుగెత్తేవాడినే కాదు అంటూ ఆండ్రీ రసెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సోమవారం (మే 8) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కేకేఆర్ గెలిచిన తర్వాత డ్రె రస్ ఇలా స్పందించాడు.
రింకు సింగ్, ఆండ్రీ రసెల్
రింకు సింగ్, ఆండ్రీ రసెల్ (AFP)

రింకు సింగ్, ఆండ్రీ రసెల్

Russell on Rinku: ఈ ఏడాది ఐపీఎల్లో రింకు సింగ్ పేరు మార్మోగిపోతోంది. ఈ సీజన్ లో మొదట గుజరాత్ టైటన్స్ పై చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్ లు కొట్టి కేకేఆర్ కు సంచలన విజయం సాధించి పెట్టిన రింకు.. తర్వాత కూడా నిలకడగా ఆడుతున్నాడు. సోమవారం (మే 8) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ నరాలు తెగే ఉత్కంఠలో చివరి బంతికి ఫోర్ కొట్టి కేకేఆర్ ను గెలిపించాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

దీంతో అతనిపై ఆండ్రీ రసెల్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్ తో రసెల్ కూడా ఫామ్ లోకి తిరిగొచ్చాడు. తన ఫినిషర్ పాత్రను దాదాపు పోషించాడు. అయితే చివరి ఓవర్ ఐదో బంతికి పరుగు తీయబోయి రనౌటయ్యాడు. రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమైన సమయంలో రసెల్ రనౌట్ కావడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే తన రనౌట్ పై మ్యాచ్ తర్వాత రసెల్ స్పందించాడు.

అవతలి వైపు ఉన్నది రింకు కాకపోయి ఉంటే.. తాను అసలు ఆ పరుగు కోసం ప్రయత్నించే వాడినే కాదని రసెల్ అనడం విశేషం. రింకుపై రసెల్ కి ఉన్న నమ్మకం వమ్ము కాలేదు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. అతడు ఫోర్ కొట్టి తన టీమ్ ను గెలిపించాడు. రింకుపై తన పూర్తి విశ్వాసం ఉన్నదని డ్రె రస్ అన్నాడు.

"ఇది మరో మ్యాచ్ అయి ఉండి, అవతలి వైపు మరో బ్యాటర్ ఉండి ఉంటే నేను కచ్చితంగా పరుగెత్తేవాడినే కాదు. ఇంతకుముందు ఎప్పుడూ అలా చేయలేదు. చివరి బంతి వరకూ ఆడి గెలిపించే వరకూ నేను వెనక్కి తగ్గను. కానీ అవతలి వైపు రింకులాంటి బ్యాటర్ ఉన్నప్పుడు నేను కచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అతడు అసలు భయం లేని ప్లేయర్. బంతి ఎక్కడ వేసినా దానిని కౌంటర్ చేసే తెలివి అతనికి ఉంది. నీ అవసరం జట్టుకు ఇప్పుడు ఉంది అని నేను అతనితో అన్నాను. నో వర్రీస్ బిగ్ మ్యాన్ అని అతడు అన్నాడు. చివరి అదే చేశాడు" అని మ్యాచ్ తర్వాత రసెల్ చెప్పాడు.

"నాకు చాలా సంతోషంగా ఉంది. అతడు నాకు మంచి ఫ్రెండ్. సరదాగా ఉంటాడు. ఓ తమ్ముడిగా అతనిపై ప్రేమ ఉంది. అతడిలాగే ఆడాలని కోరుకుంటున్నాను" అని రసెల్ అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయిన ప్రశాంతంగా ఉండటం వల్లే రింకు సక్సెస్ అవుతున్నాడని రసెల్ తెలిపాడు. ఎలాంటి బంతికైనా సిద్ధంగా ఉండి ఆడగలిగే మనస్తత్వం ఉండాలని కూడా అన్నాడు.

తదుపరి వ్యాసం