Dhoni unhappy about Batters: మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు రాణించలేదు.. మ్యాచ్ అనంతరం ధోనీ రియాక్షన్
13 April 2023, 7:52 IST
- Dhoni unhappy about Batters: చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ స్పందించారు. బ్యాటర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
చెన్నై-రాజస్థాన్
Dhoni unhappy about Batters: చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో రెండు సిక్సర్లతో ధోనీ విజృంభించినప్పటికీ.. ఆఖరు బంతికి 5 పరుగులు అవసరం కాగా.. ఒక్క పరుగే లభించింది. ఫలితంగా రాజస్థాన్ విజయం సాధించింది. చివరి వరకు పోరాడినప్పటికీ ధోనీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. మ్యాచ్ అనంతరం మహీ మట్లాడుతూ.. చెన్నై బ్యాటర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయారని తెలిపాడు.
"ఈ మ్యాచ్‌లో మేము ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. స్పిన్నర్లకు అంతగా అనుకూలించినప్పటికీ.. వారికి అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నారు. మేము స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. ఇది అంతా కష్టం కాదు. చివర్లో లక్ష్యం ఎక్కువగా ఉన్నప్పటికీ చేరువ కాగలిగాం. ఈ టోర్నమెంట్ చివరి దశకు చేరుకున్నప్పుడు నెట్ రన్ రేట్ బాగా ప్రభావితం చేస్తుంది. ఫీల్డ్‌ను గమనించాలి, బౌలర్ ఎలా వేస్తున్నాడో అంచనా వేయాలి. అంతవరకు నిలకడగా ఉండాలి. అలాగే బౌలర్ తప్పు చేసేంత వరకు వేచి ఉండాలి. ఒకవేళ బౌలర్ల మంచి ఏరియాలో బౌలింగ్ చేస్తున్నారంటే వారికి అదృష్టం కలిసొచ్చినట్లే." అని మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు.
"ఇదే సమయంలో బౌలర్ల ప్రదర్శనపై ధోనీ ఆనందం వ్యక్తం చేశాడు. చెన్నై కెప్టెన్‌గా 200 మ్యాచ్‌లు ఆడటంపై స్పందిస్తూ.. మైలురాళ్లు పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు. నాకు వర్కౌట్ అయ్యేంతవరకు నేను వేచి ఉంటాను. నేరుగా కొట్టడమే నా బలం. కొంచెం మంచు ఉండటంతో బంతి ఔట్ ఫీల్డ్‌కు వెళ్లిన తర్వాత బ్యాటర్లకు తేలికైంది. మొత్తంగా నేను బౌలర్లతో నేను చాలా సంతోషంగా ఉన్నా." అని ధోనీ తెలిపాడు.
"ఇది నా 200వ మ్యాచ్. నాకు నిజంగా తెలియదు. మైలు రాళ్లు నాకు ముఖ్యమైనవి కావు. మీరు ఎలా రాణిస్తున్నారనేది ముఖ్యం. ఫలితాలపై ఆధారపడి ఉంటుంది." అని ధోనీ స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. సీఎస్కే 16 పరుగుల మాత్రమే చేయగలిగింది. ధోనీ(32) ఆఖర్లు 2 సిక్సర్లతో అదరగొట్టినప్పటికీ జట్టు విజయాన్ని అందించలేకపోయరు. రాజస్థాన్ తరఫున అశ్విన్ బ్యాట్‌తో బౌలింగ్‌లోనూ అదరగొట్టి మంచి ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.