IPL 2023 Points Table: ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో వెంకటేష్ అయ్యర్ టాప్ - పర్పుల్ క్యాప్‌లో చాహల్ జోరు
17 April 2023, 10:31 IST
IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్‌పై విజయంతో రాజస్థాన్ నంబర్ వన్ ప్లేస్‌ను మరింత పదిలపరుచుకుంది. ఆరెంజ్ క్యాప్ లీడర్స్ లిస్ట్‌లో కోల్‌కతా హిట్టర్ వెంకటేష్ అయ్యర్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.
వెంకటేష్ అయ్యర్
IPL 2023 Points Table: ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆదివారం గుజరాత్‌పై విజయంతో పాయింట్స్ టేబుల్‌లో నంబర్ వన్ ప్లేస్‌ను మరింత పదిల పరుచుకుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లను సొంతం చేసుకొని నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది.
ఐదు మ్యాచుల్లో మూడేసి విజయాల్ని లక్నో, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్అందుకున్నాయి. రన్ రేట్ ప్రకారం లక్నో సెకండ్ ప్లేస్‌లో నిలవగా, గుజరాత్ మూడో స్థానాన్ని దక్కించుకున్నది. పంజాబ్ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతా ఐదు, చెన్నై సూపర్ కింగ్స్ ఆరో స్థానంలో ఉన్నాయి. నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలతో సన్‌రైజర్స్ తొమ్మిదో స్థానంలో నిలవగా ఐపీఎల్ 2023లో బోణీ చేయని ఢిల్లీ లాస్ట్ ప్లేస్‌లో ఉంది.
ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో వెంకటేష్ అయ్యర్ టాప్
ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ హిట్టర్ వెంకటేష్ అయ్యర్ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆదివారం ముంబైపై మెరుపు సెంచరీ సాధించిన అతడు 234 పరుగులతో ఆరెంజ్ క్యాప్ లీడర్స్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. 233 పరుగులతో శిఖన్ ధావన్ రెండో స్థానంలో కొనసాగుతోండగా శుభమన్ గిల్ (228 రన్స్)తో మూడో స్థానంలో నిలిచాడు. వార్నర్ (228 రన్స్) నాలుగో స్థానానికి పడిపోయాడు.
పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో చాహల్ నంబర్ వన్
పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన చాహల్ నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. మార్కవుడ్ (11 వికెట్లు), రషీద్ ఖాన్ (11 వికెట్లు)తో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పది వికెట్లతో షమీ నాలుగో స్థానంలో నిలిచాడు.