IPL 2023 Points Table: టాప్ ఫోర్‌లోకి పంజాబ్ - ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌లో ట్రాప్ త్రీలో కోహ్లి-ipl 2023 points table punjab kings enters fourth spot orange and purple cap leaders updated list ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: టాప్ ఫోర్‌లోకి పంజాబ్ - ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌లో ట్రాప్ త్రీలో కోహ్లి

IPL 2023 Points Table: టాప్ ఫోర్‌లోకి పంజాబ్ - ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌లో ట్రాప్ త్రీలో కోహ్లి

Nelki Naresh Kumar HT Telugu
Apr 16, 2023 09:47 AM IST

IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానానికి చేరుకున్న‌ది. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో కోహ్లి టాప్ త్రీలోకి ఎంట‌ర‌య్యాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్‌ టాప్ ఫోర్‌లోకి ఎంట‌రైంది. శ‌నివారం ల‌క్నోపై థ్రిల్లింగ్ విక్ట‌రీతో ఐదు మ్యాచుల్లో మూడు విజ‌యాల‌తో ఆరు పాయింట్లు ద‌క్కించుకున్న పంజాబ్ నాలుగో స్థానానికి చేరుకున్న‌ది.

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిల‌వ‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సెకండ్‌, గుజ‌రాత్ టైటాన్స్ థ‌ర్డ్ ప్లేస్‌లో నిలిచాయి. ఐదు మ్యాచుల్లో ఐదు ఓట‌ముల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చివ‌రి స్థానంలో నిల‌వ‌గా మూడు మ్యాచుల్లో ఒకే విజ‌యంతో ముంబై ఇండియ‌న్స్ తొమ్మిదో ప్లేస్‌లో ఉంది.

ఆరెంజ్ క్యాప్ టాప్ త్రీలో కోహ్లి...

శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్ లిస్ట్‌లో టాప్ త్రీకి చేరుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో 233 ప‌రుగుల‌తో శిఖ‌ర్ ధావ‌న్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతోండ‌గా డేవిడ్ వార్న‌ర్ (228 ర‌న్స్‌)తో రెండో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. 214 ర‌న్స్‌తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్త్ ప్లేస్‌లో జోస్ బ‌ట్ల‌ర్ (204 ర‌న్స్‌) ఐదో స్థానంలో డుప్లెసిస్ (197 ర‌న్స్‌) కొన‌సాగుతోన్నారు.

ప‌ర్పుల్ క్యాప్‌లో మార్క్‌వుడ్ టాప్‌

ప‌ర్పుల్ క్యాప్ లిస్ట్‌లో ల‌క్నో పేస‌ర్ మార్క‌వుట్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 11 వికెట్లు ద‌క్కించుకున్న అత‌డు నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. అత‌డి త‌ర్వాత 10 వికెట్ల‌తో చాహ‌ల్ రెండో స్థానంలో నిల‌వ‌గా తొమ్మిది వికెట్ల‌తో ర‌షీద్ ఖాన్ మూడో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.

WhatsApp channel