తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Du Plessis And Maxwell Partnership: సొంత రికార్డును బ్రేక్ చేసిన డుప్లెసిస్-మ్యాక్స్‌వెల్.. రికార్డు భాగస్వామ్య

Du Plessis and Maxwell Partnership: సొంత రికార్డును బ్రేక్ చేసిన డుప్లెసిస్-మ్యాక్స్‌వెల్.. రికార్డు భాగస్వామ్య

23 April 2023, 18:22 IST

google News
    • Du Plessis and Maxwell Partnership: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు డుప్లెసిస్-మ్యాక్స్‌వెల్ రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మూడో వికెట్‌కు 127 పరుగుల జోడించి ఈ వికెట్‌కు అత్యధిక పాట్నర్షిప్‌‌తో అదరగొట్టారు.
డుప్లెసిస్-మ్యాక్స్‌వెల్
డుప్లెసిస్-మ్యాక్స్‌వెల్ (PTI)

డుప్లెసిస్-మ్యాక్స్‌వెల్

Du Plessis and Maxwell Partnership: రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో థర్డ్ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా తము క్రియేట్ చేసిన రికార్డును 6 రోజుల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు 6 రోజుల ముందు ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులతో పాట్నర్‌షిప్‌తో అదరగొట్టారు. 2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ ఇద్దరూ మూడో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించగా.. చెన్నైతో మ్యాచ్‌లో డుప్లెసిస్(62), మ్యాక్సీ(77) ఆ రికార్డును బ్రేక్ చేశారు. తాజాగా తమ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టారు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన ఈ 127 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్‌ హిస్టరీలో 15వ అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. మూడో వికెట్‌కు మాత్రం ఇదే అత్యుత్తమం.

ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టీ20 క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటికే నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన డుప్లీ.. తాజాగా ఐదో అర్ధశతకాన్ని అందుకున్నాడు. పలితంగా పొట్టి ఫార్మాట్‌లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ చెరో అర్ధశతకంతో విజృంభించారు. డుప్లెసిస్-మ్యాక్సీ మూడో వికెట్‌కు మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. అయితే సెకండాఫ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ అనుకున్నదానికంటే తక్కువ పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, సందీప్ శర్మ చెరో 2 వికెట్లు తీయగా.. అశ్విన్, చాహల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

తదుపరి వ్యాసం