తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Record: దటీజ్ ధోనీ.. ఆ మూడు బంతుల్లోనే ఐపీఎల్ డిజిటల్ రికార్డులు బద్ధలు

Dhoni Record: దటీజ్ ధోనీ.. ఆ మూడు బంతుల్లోనే ఐపీఎల్ డిజిటల్ రికార్డులు బద్ధలు

Hari Prasad S HT Telugu

04 April 2023, 14:06 IST

google News
    • Dhoni Record: దటీజ్ ధోనీ.. ఆ మూడు బంతుల్లోనే ఐపీఎల్ డిజిటల్ రికార్డులు బద్ధలైపోయాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ధోనీ ఆడే సమయంలో జియో సినిమాలో మ్యాచ్ చూసిన వాళ్ల సంఖ్య కొత్త రికార్డును అందుకుంది.
ఎమ్మెస్ ధోనీ
ఎమ్మెస్ ధోనీ (PTI)

ఎమ్మెస్ ధోనీ

Dhoni Record: క్రికెట్ ఫీల్డ్ లో రికార్డులు బ్రేక్ చేయడం ధోనీకి కొత్త కాదు. కానీ అతడు బ్యాటింగ్ చేస్తుంటే టీవీ రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని తాజాగా ప్రూవ్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన సమయంలో ధోనీ చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు ఆడింది కేవలం మూడే మూడు బంతులు. అందులో తొలి రెండు బంతులను సిక్స్ లుగా మలిచాడు.

ఆ మూడు బంతులే ఐపీఎల్ వ్యూయర్‌షిప్ లో ఓ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమాలో మ్యాచ్ లైవ్ చూస్తున్న వారి సంఖ్య ఏకంగా 1.7 కోట్లకు చేరడం విశేషం. ఈ ఏడాది ఇదే అత్యధికం. ఈ క్రమంలో ధోనీ తన పేరిటే ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 1.6 కోట్ల మంది చూశారు. ఇప్పుడా రికార్డు బ్రేక్ అయింది.

వేల కోట్ల పోసి డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న రిలయెన్స్ ఐపీఎల్ మ్యాచ్ లను ఫ్రీగా చూపిస్తోంది. దీంతో జియో సినిమా యాప్ రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్స్ అవుతున్నాయి. అంతేకాదు రోజురోజుకూ ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అందులోనూ ధోనీ.. నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్లో సొంత గ్రౌండ్ అయిన చెపాక్ లో ఆడుతున్నాడు. దీంతో అతడు ఆడింది ఆ మూడు బంతులే అయినా ఎగబడి చూశారు.

ధోనీ ఏకంగా 1426 రోజుల తర్వాత తమ గ్రౌండ్ లో ధోనీ ఆడటం చూసి చెన్నై అభిమానులు కూడా తెగ సంతోషించారు. జడేజా వికెట్ పడగానే స్టేడియం అంతా మార్మోగిపోయింది. కారణం అతని తర్వాత క్రీజులోకి వస్తోంది ధోనీ కావడమే. దీంతో పెవిలియన్ నుంచి క్రీజులోకి వచ్చే వరకూ స్టేడియం అంతా అభిమానుల చప్పట్లు, అరుపులతో నిండిపోయింది.

వాళ్లను ఏమాత్రం నిరాశపరచకుండా ధోనీ వచ్చీ రాగానే తొలి రెండు బంతులను సిక్స్ లుగా మలిచాడు. దీంతో ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. అయితే అతడు మూడో బంతికే ఔటైనా.. వాళ్లకు కావాల్సిన వినోదాన్ని అందించాడు.

తదుపరి వ్యాసం