తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Ceo On Dhoni: ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడు: సీఎస్కే సీఈవో

CSK CEO on Dhoni: ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడు: సీఎస్కే సీఈవో

Hari Prasad S HT Telugu

15 May 2023, 14:40 IST

google News
    • CSK ceo on Dhoni: ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడని తాను నమ్ముతున్నట్లు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. కేకేఆర్ తో మ్యాచ్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను సీఎస్కే రిలీజ్ చేసింది.
ఆదివారం చెన్నైలో కేకేఆర్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్న ధోనీ
ఆదివారం చెన్నైలో కేకేఆర్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్న ధోనీ (AP)

ఆదివారం చెన్నైలో కేకేఆర్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్న ధోనీ

CSK on Dhoni: ధోనీ ఈ సీజన్ ఐపీఎల్ తర్వాత రిటైరవుతాడా లేదా? వచ్చే ఏడాది కూడా అతడు ఆడతాడా? ఈ ప్రశ్నలకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ సమాధానమిచ్చారు. తనకు తెలిసి ధోనీ వచ్చే సీజన్ లోనూ ఆడతాడని, సీఎస్కే ఫ్యాన్స్ ఇలాగే పెద్ద సంఖ్యలో వచ్చి జట్టుకు మద్దతు తెలపాలని కోరారు. 2024లోనూ ధోనీ ఆడతాడన్న నమ్మకం తనకు ఉందని ఆయన అనడం గమనార్హం.

ఆదివారం (మే 14) కేకేఆర్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత సీఎస్కే ఈ వీడియో రిలీజ్ చేసింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఓడిపోయిన విషయం తెలిసిందే. ధోనీకి ఇదే చివరి సీజన్ అని బలంగా నమ్ముతున్న ఫ్యాన్స్.. అతడు ఇండియాలో ఏ స్టేడియంలో ఆడినా పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వస్తున్నారు. అయితే ఈ సీజన్ లో ఓ మ్యాచ్ టాస్ సందర్భంగా ఇదే తన చివరి సీజన్ అని మీరే డిసైడైనట్లు హోస్ట్ తో ధోనీ అనడంతో అతని రిటైర్మెంట్ పై మళ్లీ చర్చ మొదలైంది.

ఇక ఇప్పుడు సీఎస్కే సీఈవో కామెంట్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి. ధోనీకి ఇదే చివరి సీజన్ అని తాను అనుకోవడం లేదని, వచ్చే సీజన్ కూడా అతడు ఆడతాడన్న నమ్మకం తనకు ఉన్నట్లు కాశీ విశ్వనాథన్ చెప్పారు. మరోవైపు ధోనీ ఎప్పుడు రిటైర్ కావాలన్న నిర్ణయం పూర్తిగా అతనిదే అని, ఎందుకు పదే పదే అదే ప్రశ్న అడుగుతారని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్న విషయం తెలిసిందే.

ఈ సీజన్ లో ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు చివర్లో బ్యాటింగ్ కు దిగుతున్నాడు. ఎక్కువగా పరుగెత్తకుండా భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో బ్యాటింగ్ కు దిగినా సిక్స్ లతో మెరుపులు మెరిపించాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో మాత్రం అతడు కేవలం రెండు పరుగులకే చేయగలిగాడు.

తదుపరి వ్యాసం