తెలుగు న్యూస్  /  Sports  /  5 Huge Feats Achieved By Yashasvi Jaiswal In Hostoric Knock Against Kkr In Ipl 2023

Yashasvi Jaiswal Records: ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో పాటు యశస్వీ సాధించిన రికార్డులు ఇవే

12 May 2023, 18:00 IST

    • Yashasvi Jaiswal Records: ఐపీఎల్ చరిత్రలో అత్యంద వేగవంతమైన అర్ధ శతకం సాధించిన యశస్వీ జైస్వాల్ మరి కొన్ని రికార్డులను అధిగమించాడు. తొలి ఓవర్లోనే అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాటర్ రికార్డు సృష్టించాడు.
యశస్వీ జైస్వాల్
యశస్వీ జైస్వాల్ (Sudipta Banerjee)

యశస్వీ జైస్వాల్

Yashasvi Jaiswal Records: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధ శతకం చేసిన సంగతి తెలిసిందే. 13 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన ఈ ఓపెనర్ ధాటికి కేకేఆర్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యం కరిగిపోయింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. మొత్తంగా 47 బంతుల్లో 98 పరుగులు చేసిన యశస్వీ 13 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అయితే ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్ ఐదు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

- ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన ఆటగాడిగా యశస్వీ రికార్డు సృష్టిచాడు. దీంతో కేఎల్ రాహుల్ 14 బంతుల అర్ధశతకం రికార్డును బద్దలు కొట్టాడు.

- ఓవరాల్ టీమ్ ఓవర్లలో అత్యంత వేగంగా అర్ధ శతకం పూర్తి చేసిన ఆటగాడిగా యశ్వస్వీ రికార్డు సృష్టించాడు. కేవలం 2.5 ఓవర్లలోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.

- నితీశ్ రాణా వేసిన తొలి ఓవర్లోనే 26 పరుగులు పిండుకున్నాడు యశస్వీ. ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ముంబయిపై మొదటి ఓవర్లో 27 పరుగులు రాబట్టింది.

- ఐపీఎల్ చరిత్రలో మొదటి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాటర్‌గా యశస్వీ రికార్డు సృష్టించాడు. 26 పరుగులు చేసిన అతడు గతంలో పృథ్వీ షా నమోదు చేసిన 24 పరుగుల మైలురాయిని అధిగమించాడు.

- ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా యశస్వీ జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన ఇషాన్ కిషన్‌ను అతడు అధిగమించాడు. యశస్వీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 575 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 2020లో ఇషాన్ కిషన్ 516 పరుగులు చేశాడు. మొత్తంగా చూసుకుంటే ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ 2008 ఐపీఎల్ సీజన్‌లో 616 పరుగులతో ముందున్నాడు.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. యశస్వీ జైస్వాల్ 47 బంతుల్లో 98 పరుగులతో విజృంభించగా.. సంజూ శాంసన్ 48 పరుగులతో రాణించాడు. వీరిద్దరి ధాటికి 150 పరుగుల లక్ష్యం 13.1 ఓవర్లలోనే ముగిసింది. కేకేఆర్ బౌలర్లలో ఒక్కరికీ కూడా వికెట్ దక్కకపోవడం విశేషం. జాస్ బట్లర్ రనౌట్ కావడం విశేషం.