తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Final : ఫైనల్లో చెన్నై Vs గుజరాత్.. ఈసారి విజేత ఎవరు?

IPL 2023 Final : ఫైనల్లో చెన్నై Vs గుజరాత్.. ఈసారి విజేత ఎవరు?

Anand Sai HT Telugu

27 May 2023, 10:04 IST

    • IPL 2023 Final CSK Vs GT : హోరాహోరిగా సాగిన ఐపీఎల్ 2023.. చివరి దశకు వచ్చింది. చెన్నై వర్సెస్ గుజరాత్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ఫైనల్ లో ఎవరు గెలుస్తారు?
చెన్నై వర్సెస్ గుజరాత్
చెన్నై వర్సెస్ గుజరాత్ (Twitter)

చెన్నై వర్సెస్ గుజరాత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ 16వ ఎడిషన్ ముగియడానికి ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ధోనీ(Dhoni) సారథ్యంలోని నాలుగుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐపీఎల్ చరిత్రలో 10వ సారి ఫైనల్స్‌లోకి ప్రవేశించగా, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని కలలు కంటోంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం లభించలేదు. ఒకానొక సమయంలో ర్యాంకింగ్స్‌లో కూడా దిగువన నిలిచింది. కానీ లీగ్ దశ ముగిసే సమయానికి, CSK జట్టు అద్భుతంగా పునరాగమనం చేసి ప్లేఆఫ్స్‌లో రెండో స్థానంతో ప్రవేశించింది. ప్లేఆఫ్స్‌లో టైటాన్స్ జట్టుపై గుజరాత్ ఘన విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించగలిగింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. శుభమన్ గిల్ మినహా మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. తద్వారా తొలిసారిగా గుజరాత్ టైటాన్స్ జట్టు అన్ని వికెట్లు కోల్పోయి 157 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సీఎస్‌కే తొలి క్వాలిఫయర్‌లో విజయం సాధించి నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించింది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణం ఆరంభం నుంచే అద్భుతంగా సాగింది. గతసారి ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. ఈ ఐపీఎల్‌లోనూ అదే ప్రదర్శన ఇస్తూ వస్తోంది. టోర్నమెంట్‌లో గుజరాత్ నెంబర్ 1 జట్టుగా ఉండటమే కాకుండా నంబర్ 1 జట్టుగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది.

CSKతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఓడిన తర్వాత, రెండో క్వాలిఫయర్‌లో ముంబై జట్టుతో తలపడిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ పనికొచ్చింది. శుభ్‌మన్ గిల్ 129 పరుగుల అద్భుతమైన సహకారంతో, ముంబై ఇండియన్స్ జట్టుకు 234 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ కీలక మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించలేదు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కెమరూన్ గ్రీన్ మాత్రమే మంచి ప్రదర్శన చేయగలిగారు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

ఈ ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే ఐదోసారి ఛాంపియన్ అవుతుందా? లేక గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఛాంపియన్ అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

తదుపరి వ్యాసం