CSK vs GT weather Forecast: మొదటి పోరుకు చెన్నై-గుజరాత్ సిద్ధం.. చెపాక్‌లో వాతావరణం ఎలా ఉంది?-gt vs csk ipl 2023 qualifier 1 weather forecast in chepauk ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Vs Gt Weather Forecast: మొదటి పోరుకు చెన్నై-గుజరాత్ సిద్ధం.. చెపాక్‌లో వాతావరణం ఎలా ఉంది?

CSK vs GT weather Forecast: మొదటి పోరుకు చెన్నై-గుజరాత్ సిద్ధం.. చెపాక్‌లో వాతావరణం ఎలా ఉంది?

Maragani Govardhan HT Telugu
May 23, 2023 08:48 AM IST

CSK vs GT weather Forecast: చెపాక్ వేదికగా మంగళవారం నడు చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ నడుమ ఐపీఎల్ 2023 మొదటి క్వాలిపయర్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధోనీ-హార్దిక్
ధోనీ-హార్దిక్

CSK vs GT weather Forecast: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ రోజు ఐపీఎల్ 2023 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో అద్బుత ప్రదర్శన చేసిన ఈ రెండు జట్లు టాప్-2లో నిలవడంతో ఈ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు డైరెక్టుగా ఫైనల్‌కు చేరుతుంది.ఈ మ్యాచ్‌కు చెన్నై చెపాక్ స్టేడియం వేదిక కానుంది. మంగళవారం నాడు సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటే మరి చెన్నై పిచ్ ఎలా ఉండబోతుంది? వాతావరణ విశేషాలను ఇప్పుడు చూద్దాం.

ఆతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్‌ను చెపాక్ స్టేడియంతో హాట్ వెదర్‌తో ఆహ్వానిస్తోంది. ఇక్కడ వాతావరణం దాదాపు పొడిగా ఉంది. ఈ ఏడాది పిచ్ ఎక్కువగా స్పిన్‌కే అనుకూలిస్తుంది. అలాగే రాత్రికి మంచు కురిసే అవకాశముంది. ఇటీవల కాలంలో జరిగిన మ్యాచ్‌లు, పిచ్ రిపోర్టు ప్రకారం చేజింగ్ జట్టుకు అనుకూలించే అవకాశముంది. గత 7 మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు చేజింగ్ జట్లే గెలిచాయి. అయితే చెన్నైకు సొంత గడ్డ కావడం అనుకూలించే అవకాశం కాగా.. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌తో ఉన్న గుజరాత్‌ను అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు.

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లు స్థిరంగా ఆడుతున్నాయి. ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. చెన్నైలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ స్కిల్స్‌తో జట్టును ముందుడి నడిపిస్తున్నాడు. మరోపక్క హార్దిక్ పాండ్యకు సీనియర్ల నుంచి కాస్త ఇబ్బంది అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఆటగాళ్లయిన విజయ్ శంకర్, మోహిత్ శర్మకు ఎక్కువగా మద్దతు ఇస్తున్నాడు.

ధోనీ సారథ్యంలో అజింక్య రహానే తన ఫామ్‌ను తిరిగి పొందాడు. అలాగే శివమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే లాంటి ఆటగాళ్లు అతడి శిక్షణలో రాటుదేలారు. వీరికి మన కెప్టెన్ కూల్ స్వేచ్ఛను ఇవ్వడంతో అత్యుత్తమంగా రాణిస్తున్నారు. రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉండటంతో మ్యాచ్‌పై అంచనాలు నెలకొన్నాయి.

మరోపక్క గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. అయితే తప్పులను నుంచి నేర్చుకుంటూ జట్టు ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తూనే ఉంది. ఇందుకు ఆ జట్టు అందుకున్న విజయాలే సాక్ష్యం. అన్నీ కుదిరితే ఇందులో విజయం సాధించి రెండో సారి కప్ ఎగురేసుకుని పోవాలని గుజరాత్ ఉవ్విళ్లూరుతోంది.

WhatsApp channel