తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wi Vs Ind: ఉత్కంఠ పోరులో విండీస్‌పై భారత్ విజయం.. కరేబియన్లు కంగారు పెట్టారు

WI vs IND: ఉత్కంఠ పోరులో విండీస్‌పై భారత్ విజయం.. కరేబియన్లు కంగారు పెట్టారు

23 July 2022, 6:06 IST

google News
    • పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ సిరాజ్ 11 పరుగులే ఇచ్చి విజయాన్ని ఖరారు చేశాడు.
విండీస్ భారత్ విజయం
విండీస్ భారత్ విజయం (AP)

విండీస్ భారత్ విజయం

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. 309 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన కరేబియన్ బ్యాటర్లు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులకు పరిమితమయ్యారు. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. 11 పరుగులే చేసింది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ విండీస్ నుంచి విజయాన్ని దూరం చేశాడు. లోవర్ ఆర్డర్ బ్యాటర్లు రొమారియో షెపర్డ్(39), అకీల్ హోసిన్(32) మ్యాచ్‌ గెలిపించేంత పనిచేశారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టుకు శుభారంభమేమి దక్కలేదు. ఆ జట్టు 16 పరుగుల వద్ద ఉన్నప్పుడే ఓపెనర్ షాయ్ హోప్(7)..సిరాజ్ బౌలింగ్‌లో శార్దూల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమర్హ్ బ్రూక్స్‌తో(46) కలిసి మరో ఓపెనర్ కైల్ మేయర్స్(75) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వీరిద్దరూ చాలా సేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. చక్కటి బౌండరీలతో స్కోరు వేగాన్ని నిదానంగా ముందుకు కదిలించారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 117 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో మేయర్స్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అయితే బ్రూక్స్‌ను ఔట్ చేసిన శార్దూల్.. వీరి జోడీని విడదీశాడు. అనంతరం కాసేపటికే కైల్ మేయర్స్‌నూ పెవిలియన్ చేర్చి విండీస్‌ను మరో దెబ్బ కొట్టాడు.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రెండన్ కింగ్(54) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. నికోలస్ పూరన్‌తో కలిసి 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ పూరన్‌ను(25) ఔట్ చేసిస సిరాజ్ విండీస్‌ను ఇరకాటంలో పెట్టాడు. అనంతరం కాసేపటికే కొత్త బ్యాటర్ రోవమన్‌ పోవెల్‌ను(6) చాహల్ వెనక్కి పంపాడు. దీంతో 196 పరుగులకు 5 వికెట్లతో విండీస్ ఇబ్బందుల్లో పడింది.

టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు ఔట్ కావడంతో టీమిండియా గెలుపు సులభమే అనుకున్నారంతా. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రొమారియో షెపర్డ్. అకీల్ హోసీన్ జట్టు విజయం వరకు తీసుకొచ్చారు. బ్రెండన్ కింగ్ అర్ధ సెంచరీ తర్వాత ఔట్ కావడంతో వీరిద్దరూ చాలా సేపు టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా షెపర్డ్ బౌండరీలు, సిక్సర్లతో వేగంగా ఆడీ.. భారత అభిమానుల్లో కలవరం పెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ 11 పరుగులే ఇవ్వడంతో ఓటమి నుంచి భారత్ తప్పించుకుంది. 97 పరుగులతో ఆకట్టుకున్న కెప్టెన్ శిఖర్ ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.

<p>శిఖర్ ధావన్</p>

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్(97) తృటిలో సెంచరీ కోల్పోగా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(64), శ్రేయాస్ అయ్యర్(54) అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో భారత్.. విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభంలో ధారళంగా పరుగులు రాబట్టిన టీమిండియా చివర్లో వేగంగా రన్స్ రాబట్టలేకపోయారు. కరేబియన్ బౌలర్లలో గుడాకేష్ మోట్లే, అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీయగా.. రొమారియో షేపర్డ్, అకీల్ హోసేయిన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

తదుపరి వ్యాసం