తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Women Vs Australia Women: ఇండియా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

India Women vs Australia Women: ఇండియా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu

23 February 2023, 9:54 IST

    • India Women vs Australia Women: ఇండియా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి? వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఎంతగానో ఆసక్తి రేపుతోంది.
భారత మహిళల క్రికెట్ జట్టు
భారత మహిళల క్రికెట్ జట్టు (PTI)

భారత మహిళల క్రికెట్ జట్టు

India Women vs Australia Women: ఇండియా ఇప్పటికే అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు సీనియర్ టీ20 వరల్డ్ కప్ పై కన్నేసింది. అయితే అది జరగాలంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా రూపంలో ఇండియన్ టీమ్ కు కఠినమైన సవాలు ఎదురు కానుంది. ఆ టీమ్ తో గురువారం (ఫిబ్రవరి 23) సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

గ్రూప్ స్టేజ్ లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది ఇండియన్ టీమ్. లీగ్ స్టేజ్ లో ఇండియా బ్యాటింగ్ బాగుంది. ముఖ్యంగా వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధానా రెండు హాఫ్ సెంచరీలు చేసింది. ఇంగ్లండ్ పై పోరాడి చేసిన హాఫ్ సెంచరీతోపాటు చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై టీ20ల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు 87 రన్స్ చేసింది.

ఆమె ఫామ్ సెమీఫైనల్లో కీలకం కానుంది. ఇక బౌలింగ్ లో రేణుకా సింగ్ టాప్ పర్ఫార్మర్. ఆమె టోర్నీలో ఇప్పటి వరకూ 7 వికెట్లు తీసింది. అయితే ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టుపై గెలవడం అంత సులువు కాదు. ఇప్పటికే రెండు వరస టీ20 వరల్డ్ కప్ లతోపాటు మొత్తంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన టీమ్ అది. వరల్డ్ కప్ హ్యాట్రిక్ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్లో ఆ టీమ్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

ఇండియా vs ఆస్ట్రేలియా ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ గురువారం (ఫిబ్రవరి 23) జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్ లో చూడొచ్చు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు.

తదుపరి వ్యాసం