India U19 Women’s team: అండర్ 19 వుమెన్స్ టీమ్‌కు రూ.5 కోట్లు.. అందజేసిన సచిన్
India U19 Women’s team: అండర్ 19 వుమెన్స్ టీమ్‌కు రూ.5 కోట్లు అందజేసింది బీసీసీఐ. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా టీమ్ ను సన్మానించారు.
India U19 Women’s team: వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ గెలిచి సగర్వంగా స్వదేశానికి వచ్చిన ఇండియన్ టీమ్ ను బుధవారం (ఫిబ్రవరి 1) బీసీసీఐ ఘనంగా సత్కరించింది. సౌతాఫ్రికాలో జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్ ను చిత్తు చేసి ఇండియన్ టీమ్ విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 7 వికెట్ల తేడాతో మన టీమ్ ఘన విజయం సాధించింది.
ఈ టీమ్ ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సన్మానించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్, బీసీసీఐ కలిసి అండర్ 19 జట్టుకు రూ.5 కోట్ల చెక్ అందించారు. ఈ మెగా టోర్నీ గెలిచిన వెంటనే ఇండియన్ అండర్ 19 వుమెన్స్ టీమ్ కు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.
అహ్మదాబాద్ లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు అండర్ 19 టీమ్ ను సన్మానించారు. అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
వుమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో ఇండియా అన్ని మ్యాచ్ లు గెలిచింది. సూపర్ 6లో ఆస్ట్రేలియా చేతుల్లో తొలి ఓటమి చవిచూసింది. ఆ తర్వాత మళ్లీ వరుస విజయాలతో దూసుకెళ్లింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 8 వికెట్లతో చిత్తు చేసిన ఇండియన్ టీమ్.. ఫైనల్లో ఇంగ్లండ్ పై 7 వికెట్లతో గెలిచి వరల్డ్ కప్ గెలుచుకుంది.
ఈ టోర్నీలో బ్యాటర్ శ్వేతా సెహ్రావత్, లెగ్ స్పిన్నర్ పర్శావి చోప్రా కీలకపాత్ర పోషించారు. శ్వేతా 297 రన్స్ తో టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచింది. మూడు హాఫ్ సెంచరీలు సహా ఏకంగా 92 సగటుతో ఆమె రన్స్ చేయడం విశేషం. మరోవైపు స్పిన్నర్ పర్శావి 11 వికెట్లు తీసింది.
సంబంధిత కథనం
టాపిక్