Sridhar Autobiography: నీకు ఆ సత్తా ఉంది.. కానీ మిగతా బ్యాటర్ల సంగతేంటని కోహ్లిని ధోనీ అడిగాడు: శ్రీధర్-sridhar autobiography book reveals another interesting conversation between dhoni and kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sridhar Autobiography: నీకు ఆ సత్తా ఉంది.. కానీ మిగతా బ్యాటర్ల సంగతేంటని కోహ్లిని ధోనీ అడిగాడు: శ్రీధర్

Sridhar Autobiography: నీకు ఆ సత్తా ఉంది.. కానీ మిగతా బ్యాటర్ల సంగతేంటని కోహ్లిని ధోనీ అడిగాడు: శ్రీధర్

Hari Prasad S HT Telugu
Jan 31, 2023 01:01 PM IST

Sridhar Autobiography: నీకు ఆ సత్తా ఉంది.. కానీ మిగతా బ్యాటర్ల సంగతేంటని కోహ్లిని ధోనీ అడిగినట్లు మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ వెల్లడించాడు. తన ఆటో బయోగ్రఫీలో ఆస్ట్రేలియా టూర్ కు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని ఓ విషయాన్ని అతడు బయటపెట్టాడు.

ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లి
ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లి

Sridhar Autobiography: ఆస్ట్రేలియా టూర్ అంటే ఇండియాకు ఎప్పుడూ పెద్ద సవాలే. గత రెండు సందర్భాల్లో చారిత్రక విజయాలతో తిరిగి వచ్చినా అంతకుముందు కంగారూ గడ్డపై పెద్దగా సక్సెస్ సాధించింది లేదు. అయితే 2014-15 టూర్ సందర్భంగా అప్పుడు కెప్టెన్ గా ఉన్న ఎమ్మెస్ ధోనీ సిరీస్ మధ్యలోనే తన కెప్టెన్సీని విరాట్ కోహ్లికి అప్పగించాడు.

సిరీస్ రెండో టెస్టులో కెప్టెన్సీ అందుకున్న కోహ్లి.. తొలి మ్యాచ్ లోనే తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాడట. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా.. విరాట్ మాత్రం డ్రా కోసం ఆడకూడదు, గెలవడానికే ఆడాలని నిర్ణయించుకున్నట్లు అప్పుడు ఫీల్డింగ్ కోచ్ గా ఉన్న శ్రీధర్ తన ఆటో బయోగ్రఫీ కోచింగ్ బియాండ్ లో వెల్లడించాడు.

అయితే తొలి టెస్ట్ లోనే తన దూకుడు చూపిస్తున్న కోహ్లిని ధోనీ సున్నితంగా వారించినట్లు కూడా ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపాడు. ఆ మ్యాచ్ లో ఫీల్డ్ బయట ఏం జరిగిందో తన బుక్ లో పూర్తిగా వివరించాడు. కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే విరాట్ ఆ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. కానీ టీమ్ ఓడిపోయింది. అయితే దానికి ముందు మాత్రం కోహ్లి, ధోనీ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగినట్లు శ్రీధర్ వివరించాడు.

"ఆస్ట్రేలియా ఎంత టార్గెట్ పెట్టినా చేజ్ చేయడానికే ఆడాలని కోహ్లి ఫిక్సయ్యాడు. రాత్రికి రాత్రే ఆస్ట్రేలియా డిక్లేర్ చేసినా ఓవర్ కు 4 లెక్కన కొట్టాల్సి వస్తుందని ముందే తెలుసు. కానీ విరాట్ మాత్రం వెనుకడుగు వేయకూడదని, డ్రా కోసం ఆడొద్దని డిసైడయ్యాడు.

కానీ ఆ తర్వాత ధోనీతో జరిగిన సంభాషణ గురించి విరాట్ నాతో చెప్పాడు. విరాట్.. నువ్వు ఈ టార్గెట్ ను చేజ్ చేయగలవు. నువ్వు అలాంటి ప్లేయర్ వే. కానీ ఓ కెప్టెన్ గా ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఓ టెస్ట్ మ్యాచ్ చివరి రోజు మిగతా బ్యాటర్లు కూడా అంత పాజిటివ్ గా ఉండి 360 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయగలరా అన్నది చూడాలి. నిర్ణయాలు తీసుకునే ముందు టీమ్ బలాబలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని ధోనీ కోహ్లితో అన్నాడు" అని శ్రీధర్ తన బుక్ లో వెల్లడించాడు.

"విరాట్ కూడా ధోనీ చెప్పినదాంట్లో నిజముందని అనుకున్నాడు. కానీ పాజిటివ్ గా ఉండటంలో తప్పు లేదు కదా అనుకున్నాడు. అలాగే ధోనీకి తన సమాధానమిచ్చాడు. మనం ట్రై చేస్తేనే అది తెలుస్తుంది కదా? మనం అది చేయగలమో లేదో అన్నది. గతంలో మనం ఎప్పుడూ చివరి రోజు 360 టార్గెట్ చేజ్ చేయలేదు ఎందుకంటే మనం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి మాత్రం ట్రై చేద్దాం. మనం ట్రై చేయనంత వరకూ మనం ఎంత బాగున్నామన్నది తెలియదు కదా అని ధోనీతో కోహ్లి చెప్పాడు" అని శ్రీధర్ వివరించాడు.

ఆ మ్యాచ్ లో చివరి రోజు ఇండియా 364 చేజ్ చేయాల్సి వచ్చింది. విరాట్ అనుకున్నట్లే ఏమాత్రం తగ్గకుండా రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదాడు. మరోవైపు మురళీ విజయ్ కూడా అతనికి చక్కని సహకారం అందించినా.. 99 రన్స్ చేసి ఔటయ్యాడు. మరోవైపు నేథన్ లయన్ వరుసగా వికెట్లు తీసుకుంటూ వెళ్లడంతో చివరికి ఇండియా 48 రన్స్ తేడాతో ఓడిపోయింది.

ఆ మ్యాచ్ ఓడిపోయినా టెస్టుల్లో ఇండియన్ టీమ్ ఎలాంటి ధోరణితో ఆడాలో అప్పుడే తెలిసిందని శ్రీధర్ చెప్పాడు. ఇప్పటి ఇండియన్ టీమ్ ఇలా ఆడుతోందంటే దానికి కారణం ఆ మ్యాచే అని కూడా అతడు అన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం