Sridhar on Ashwin: నీ మాట ఎందుకు వినాలి అని అశ్విన్ అడిగాడు: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్-sridhar on ashwin says he asked him why he should follow his fielding drills ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sridhar On Ashwin Says He Asked Him Why He Should Follow His Fielding Drills

Sridhar on Ashwin: నీ మాట ఎందుకు వినాలి అని అశ్విన్ అడిగాడు: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్

Hari Prasad S HT Telugu
Jan 26, 2023 02:10 PM IST

Sridhar on Ashwin: నీ మాట ఎందుకు వినాలి అని అశ్విన్ అడిగాడని మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ వెల్లడించాడు. తన ఆటో బయోగ్రఫీ కోచింగ్ బియాండ్ మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ బుక్ లో అతడు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

శ్రీధర్, అశ్విన్
శ్రీధర్, అశ్విన్

Sridhar on Ashwin: హైదరాబాదీ స్పిన్నర్ ఆర్ శ్రీధర్ ఏడేళ్ల పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా పని చేశాడు. ముగ్గురు హెడ్ కోచ్ ల కింద పని చేసిన శ్రీధర్.. 2021లో తప్పుకున్నాడు. అతడు కోచ్ గా ఉన్న సమయంలో ఇండియన్ టీమ్ ఫీల్డింగ్ చాలా మెరుగ్గా కనిపించింది. ఆ తర్వాత తన కోచింగ్ బియాండ్ - మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ పేరుతో ఆటోబయోగ్రఫీ రాశాడు. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను అతడు వెల్లడించాడు.

తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో తాను తొలిసారి మాట్లాడిన సందర్భంలో జరిగిన ఓ విషయం గురించి చెప్పాడు. ఫీల్డింగ్ కోచ్ మారినప్పుడల్లా ఏదో ఒక కొత్తది చెబుతుంటారని, మీ మాట నేను ఎందుకు వినాలని అశ్విన్ అడిగినప్పుడు తాను ఆశ్చర్యానికి గురైనట్లు ఈ పుస్తకంలో శ్రీధర్ వివరించాడు.

"నేషనల్ టీమ్ తో చేరిన తొలి వారంలోనే అశ్విన్ తో మాట్లాడినప్పుడు నేను కాస్త షాక్ కు గురయ్యాను. అతడు మామూలుగానే నన్నో విషయం అడిగాడు. మీరు ఏమీ అనుకోకపోతే శ్రీధర్ సర్.. నేను మీరు చెప్పింది ఎందుకు వినాలి. మీరు చెప్పిన ఫీల్డింగ్ డ్రిల్స్ ఎందుకు ఫాలో కావాలి? 2011 నుంచి 2014 వరకు ట్రెవర్ పెన్నీ ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు.

ఇప్పుడు మీరు వచ్చారు. మీరు మరో రెండు, మూడేళ్లు ఉంటారేమో. మీరు ఏదో చెబుతారు. వెళ్లిపోతారు. అప్పుడు మరో కొత్త ఫీల్డింగ్ కోచ్ వస్తాడు. నిజాయతీగా చెప్పాలంటే తర్వాత మూడేళ్లు నాకు చాలా ముఖ్యం. మీరు చెప్పింది నాకు ఉపయోగపడుతుందని నేను నమ్మాలి. అది నా ఆటకు సాయం చేయాలి. లేదంటే నేను ఎందుకు వినాలి అని అశ్విన్ నన్ను అడిగాడు" అని శ్రీధర్ తన పుస్తకంలో వెల్లడించాడు.

అయితే అశ్విన్ అలా మాట్లాడటం వల్ల అప్పటి వరకూ తాను పని చేసిన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్న విషయం తనకు అర్థమైనట్లు శ్రీధర్ చెప్పాడు. అప్పటికే అశ్విన్ గురించి తనకు బాగా తెలుసుని, అతడు ఆ ప్రశ్నలు అడిగిన తర్వాత.. అసలు కోచింగ్ అంటే ఏంటి? ఎంతవరకూ నేను కోచింగ్ ఇవ్వాలి అన్న ప్రశ్నలు తనకు తాను వేసుకున్నట్లు శ్రీధర్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.

WhatsApp channel

సంబంధిత కథనం