BCCI Contract : బీసీసీఐ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్.. A ప్లస్ గ్రేడ్ ఎవరికో..?
BCCI New Central Contract : బీసీసీఐ కొత్త సెంట్రల్ కాంట్రాక్టును వచ్చే నెలలో ప్రకటించనున్నారు. ఈ మేరకు పెద్ద మార్పులతో జాబితా సిద్ధంగా ఉంది.
కొన్నిరోజుల సస్పెన్స్ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వచ్చే నెలలో ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. క్రికెట్ సంఘం ఎన్నికలు, కొత్త సెలక్షన్ కమిటీ నియామకం కారణంగా ప్రకటనలో ఆలస్యం జరిగింది. అయితే ఇప్పుడు జాబితా రెడీ అయింది. పెద్ద మార్పులతో జాబితా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. కొంతమంది ఆటగాళ్లు ప్రమోషన్ పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఓ సీనియర్ ఆటగాడు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవచ్చు అని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమేంతో తెలియాలి.
నివేదికల ప్రకారం.. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్ ప్రమోషన్ అందుకోవచ్చు. T20Iలకు కొత్త కెప్టెన్‌గా ఉన్న పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్‌లను గ్రేడ్ A పొందాలని భావిస్తున్నారు. సూర్య ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ T20I బ్యాటర్, ODIల్లో కూడా దూసుకెళ్తున్నాడు. శుభ్‌మన్ గిల్ అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా అయ్యాడు. ఈ ఇద్దరు బ్యాటర్లకు వచ్చే నెలలో ప్రకటించనున్న BCCI కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చాలా అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది.
'ఎన్నికలు, సెలక్షన్ కమిటీ కారణంగా సెంట్రల్ కాంట్రాక్ట్ లో జాప్యం జరిగింది. ఇప్పటికే తుది చర్చలు పూర్తయ్యాయి. వచ్చే నెలలోపు పూర్తి అయ్యే అవకాశం ఉంది.. వెంటనే ప్రకటిస్తారు.' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఆటగాళ్లు కూడా ఎంతో కాలంగా జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. BCCI ప్రతి గ్రేడ్‌లోని ఆటగాళ్లకు 10 నుంచి 20 శాతం పెంపును మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇది కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కీలక నిర్ణయం కానుంది. ఈ పెంపుతో క్రీడాకారులు మరింత ఉత్సహంగా పని చేస్తారని భావిస్తున్నారు.
'మా ఆటగాళ్లకు జీతం పెంచాల్సి ఉంది. దీనికి అర్హులని భావిస్తున్నాను. అయితే ఇది సమష్టి నిర్ణయం. ప్రతి ఒక్కరూ బోర్డులోకి రావాలి. ఇంగ్లండ్ జీతాలతో పోల్చినట్లయితే.. మా ఆటగాళ్లు మ్యాచ్ ఫీజుతో ఎక్కువ సంపాదిస్తారు.' అని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.
ఇదిలా ఉంటే A ప్లస్ కేటగిరీలోని క్రికెటర్లు తమ మ్యాచ్ ఫీజు కాకుండా ఏటా 7 కోట్ల రూపాయలను అందుకుంటున్నారు. అదే విధంగా A కేటగిరీలో ఉన్నవారు సంవత్సరానికి 5 కోట్లు, B లో ఉన్న ఆటగాళ్లు 3 కోట్లు తీసుకుంటారు. సి కేటగిరీ కాంట్రాక్టు క్రికెటర్లు తమ మ్యాచ్ ఫీజు కాకుండా సంవత్సరానికి 1 కోటి పొందుతారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే A ప్లస్ కేటగిరీలో ఉన్నారు.
సంబంధిత కథనం