Sourav Ganguly Biopic: తన బయోపిక్‌కు తానే స్క్రిప్ట్ రాస్తున్న సౌరవ్ గంగూలీ-sourav ganguly biopic in full pace as the cricketer himself writing the script ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sourav Ganguly Biopic In Full Pace As The Cricketer Himself Writing The Script

Sourav Ganguly Biopic: తన బయోపిక్‌కు తానే స్క్రిప్ట్ రాస్తున్న సౌరవ్ గంగూలీ

Hari Prasad S HT Telugu
Jan 24, 2023 05:42 PM IST

Sourav Ganguly Biopic: తన బయోపిక్‌కు తానే స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం ఈ బయోపిక్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి.

సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ (AFP)

Sourav Ganguly Biopic: ఇండియన్ క్రికెట్ పై చెరగని ముద్ర వేసిన వ్యక్తి సౌరవ్ గంగూలీ. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కొని సతమతమవుతున్న ఇండియన్ క్రికెట్ ను తన కెప్టెన్సీతో మళ్లీ గాడిలో పెట్టడమే కాదు.. విదేశాల్లోనూ చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా బీసీసీఐ అధ్యక్షుడిగా దేశంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

బయోపిక్ తీయడానికి నూటికి నూరు శాతం అర్హత ఉన్న క్రికెటర్ సౌరవ్ గంగూలీ. ఇప్పుడతని సినిమా తెరకెక్కబోతోంది. ఈ బయోపిక్ కోసం గంగూలీయే స్వయంగా స్క్రిప్ట్ రాస్తుండటం విశేషం. ఈ సినిమా డీల్ ను ఫైనలైజ్ చేయడానికి ప్రస్తుతం దాదా ముంబైలో ఉన్నాడు. సోమవారం సాయంత్రం తన ఫ్రెండ్ సంజయ్ దాస్ తో కలిసి గంగూలీ ముంబై వెళ్లినట్లు న్యూస్18 వెల్లడించింది.

బయోపిక్ స్క్రిప్ట్ పై చర్చలు జరపనున్నట్లు కూడా ఈ సందర్భంగా గంగూలీ తెలిపాడు. "స్క్రిప్ట్ నేనే రాస్తున్నాను. స్క్రీన్ ప్లేను లవ్ ప్రొడక్షన్ హౌజ్ తో చర్చిస్తాం. గత కొన్ని నెలలుగా బయోపిక్ పై అడుగు ముందుకు పడలేదు. నాతోపాటు ప్రొడక్షన్ హౌజ్ బిజీ షెడ్యూల్ వల్ల వేగం పెరగడం లేదు. ఈసారి వేగంగా ఈ పని పూర్తి కానుంది" అని గంగూలీ వెల్లడించాడు.

అయితే ఈ సినిమాలో తన పాత్రలో ఎవరు కనిపించనున్నారన్న విషయం మాత్రం దాదా చెప్పలేదు. దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని అన్నాడు. లవ్ ప్రొడక్షన్స్ తో సమావేశం తర్వాత దీనిపై ఏదైనా చెప్పగలనని అన్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పని దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపాడు. గంగూలీ చెప్పకపోయినా.. అతని పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరికొంత మంది పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

WhatsApp channel

సంబంధిత కథనం