తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Odi Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్‌ను అధిగమించిన భారత్

ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్‌ను అధిగమించిన భారత్

13 July 2022, 12:35 IST

    • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. మొన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న భారత్.. ఇంగ్లాండ్‌పై విజయంతో మరో మూడో ర్యాంకును సాధించింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (AP)

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా పుంజుకుంది. ఇప్పటి వరకు వన్డేల్లో నాలుగో స్థానంలో రోహిత్ సేన.. ఓ స్థానాన్ని మెరుగుపరచుకుంది. ఫలితంగా పాక్ ఓ స్థానానికి దిగజారి 4తో సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

భారత్ 105 రేటింగ్ పాయింట్లతో మొన్నటి వరకు నాలుగో స్థానంలో ఉంది. తాజాగా ఇంగ్లాండ్‌పై 10 వికెట్ల విజయంతో 108 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. పాక్ 106 పాయింట్లతో వెనుకంజలో ఉంది. పాయింట్ల పట్టికలో అన్నింటికంటే న్యూజిలాండ్ 126 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 122 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది.

లండన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్, ధావన్ నిలకడగా ఆడి వికెట్ కోల్పోకుండా 111 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా రోహిత్ మాత్రం లక్ష్యం చిన్నదైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మరోపక్క ధావన్ 58 బంతుల్లో 31 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా తన పదునైన బంతులతో నిప్పులు చెరగడంతో ఇంగ్లీష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆరు వికెట్లతో విరుచుకుపడ్డాడు. మరో బౌలర్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రసిధ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

వన్డేల్లో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ జోడీ సచిన్-గంగూలీ తర్వాత రెండో అత్యధిక ఓపెనింగ్ జోడీగా గుర్తింపు తెచ్చుకుంది. తొలి వన్డేలో వీరిద్దరూ 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈ ద్వయం 5 వేల పరుగుల క్లబ్ చేరిపోయింది. సచిన్-గంగూలీ 1996 నుంచి 2007 మధ్య కాలంలో 6609 పరుగులతో తొలిస్థానంలో ఉంది.

 

టాపిక్