IPLAuction 2022 | 1.70 కోట్లకు అమ్ముడుపోయిన హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ
13 February 2022, 17:57 IST
హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ ఐపీఎల్ మెగా వేలంలో అనూహ్య ధర పలికారు. ముంబయి ఇండియన్స్ అతడిని 1.70 కోట్లకు కొనుగోలు చేసింది.
తిలక్ వర్మ
ఐపీఎల్ మెగా వేలంలో రెండో రోజు హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ 1.70 కోట్లకు అమ్ముడుపోయాడు. అతడిని ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకున్నది. 20 లక్షల బేస్ ప్రైస్ లో ఉన్న తిలక్ వర్మ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బిడ్ వేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తిలక్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపాయి. చివరలో పోటీలోకి వచ్చిన ముంబయి ఇండియన్స్ అతడిని 1.70 కోట్లకు దక్కించుకున్నది. 2017-18 రంజీ సీజన్ ద్వారా హైదరాబాద్ టీమ్ తరఫున క్రికెటర్ గా తిలక్ వర్మ కెరీర్ ఆరంభమైంది. అదే సీజన్ లో ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా టీ ట్వంటీల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు పదిహేను టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడిన తిలక్ వర్మ 143.77 స్ట్రైక్ రేట్ తో 381 పరుగులు చేశాడు. బ్యాటింగ్ పాటు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఆల్ రౌండర్ గా ఉపయోగించుకోవచ్చనే ఆలోచనతో ముంబయి ఇండియన్స్ తిలక్ వర్మను కొనుగోలు చేసింది