IPL Auction Live | ముగిసిన ఐపీఎల్ మెగా వేలం - లైవ్ అప్‌డేట్స్
13 February 2022, 21:02 IST
- ముగిసిన ఐపీఎల్ మెగా వేలం
IPL Auction Live : ముగిసిన ఐపీఎల్ మెగా వేలం
రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది.
IPL Auction Live : ఫాబియన్ అలెన్ - రూ.75 లక్షలు
వెస్టిండీస్ ప్లేయర్ ఫాబియన్ అలెన్ ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
IPL Auction Live : సిద్ధార్థ్ కౌల్ - రూ.75 లక్షలు
పేస్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది
IPL Auction Live : వాన్ డర్ డుసెన్ - రూ.కోటి
సౌతాఫ్రికా బ్యాటర్ వాన్ డర్ డుసెన్ ను రూ. కోటికి కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
IPL Auction Live : విక్కీ ఓస్వాల్ - రూ.20 లక్షలు
విక్కీ ఓస్వాల్ ను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
IPL Auction Live : ఇషాంత్ శర్మ - రూ. అన్ సోల్డ్
అమ్ముడుపోని ఇషాంత్ శర్మ
IPL Auction Live : జేమ్స్ నీషమ్ - రూ.1.5 కోట్లు
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
IPL Auction Live : ఉమేష్ యాదవ్ - రూ. 2 కోట్లు
టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
IPL Auction Live : మహ్మద్ నబీ - రూ. కోటి
ఆఫ్ఘనిస‌్థాన్ క్రికెటర్ మహ్మద్ నబీని రూ.కోటికి కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
IPL Auction Live : అర్జున్ టెండూల్కర్ – రూ. 30 లక్షలు
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
IPL Auction Live : హ్యూ ఎడ్మీడ్స్ వచ్చేశారు
అనారోగ్యంతో తొలి రోజు కుప్పకూలిన ఆక్షనీర్ హ్యూ ఎడ్మీడ్స్ చివర్లో మరోసారి వేలం చేపట్టారు
IPL Auction Live : వరుణ్ ఆరోన్ - రూ. 50 లక్షలు
ఇండియన్ పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్
IPL Auction Live : టిమ్ సౌథీ - రూ.1.5 కోట్లు
న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
IPL Auction Live : టిమ్ సైఫర్ట్ - రూ.50 లక్షలు
న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సైఫర్ట్ ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
IPL Auction Live : గ్లెన్ ఫిలిప్స్ - రూ. 1.5 కోట్లు
వికెట్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్ ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
IPL Auction Live : కరుణ్ నాయర్ - రూ.1.4 కోట్లు
ఇండియన్ బ్యాటర్ కరుణ్ నాయర్ ను రూ.1.4 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
IPL Auction Live : ఎవిన్ లూయిస్ – రూ. 2 కోట్లు
వెస్టిండీస్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
IPL Auction Live : అలెక్స్ హేల్స్ - రూ. 1.5 కోట్లు
ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ను కనీస ధర రూ.1.5 కోట్లకే కొన్న కోల్ కతా నైట్ రైడర్స్
IPL Auction Live : కర్ణ్ శర్మ - 50 లక్షలు
స్పిన్నర్ కర్ణ్ శర్మను రూ.50 లక్షలకు కొన్న బెంగళూరు
IPL Auction Live : లుంగి ఎంగిడి - రూ. 50 లక్షలు
సౌతాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడిని రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
IPL Auction Live : జేమ్స్ నీషమ్ - అన్ సోల్డ్
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ను కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
IPL Auction Live : క్రిస్ జోర్డాన్ - రూ. 3.6 కోట్లు
ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ను రూ. 3.6 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
IPL Auction Live : విష్ణు వినోద్ - రూ. 50 లక్షలు
బ్యాటర్ విష్ణు వినోద్ ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ టీమ్.
IPL Auction Live : ఉమేష్ యాదవ్ - అన్ సోల్డ్
ఇండియన్ బౌలర్ ఉమేష్ యాదవ్ కు మళ్లీ నిరాశే. కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
IPL Auction Live : మాథ్యూ వేడ్ - రూ.2.4 కోట్లు
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ను రూ.2.4 కోట్లతో కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్
IPL Auction Live : వృద్ధిమాన్ సాహా - రూ. 1.9 కోట్లు
వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్
IPL Auction Live : సామ్ బిల్లింగ్స్ - రూ. 2 కోట్లు
ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
IPL Auction Live : డేవిడ్ మిల్లర్ - రూ.3 కోట్లు
సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్
IPL Auction Live : ప్రస్తుతం టీమ్స్ దగ్గర ఉన్న డబ్బు ఇదీ (కోట్లలో..)
ముంబై ఇండియన్స్ : 2.17
చెన్నై సూపర్ కింగ్స్: 7.15
పంజాబ్ కింగ్స్: 5.3
గుజరాత్ టైటన్స్: 8.65
లక్నో సూపర్ జెయింట్స్: 2.2
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 5
కోల్‌కతా నైట్‌రైడర్స్: 8.85
రాజస్థాన్ రాయల్స్: 8.6
ఢిల్లీ క్యాపిటల్స్: 1.3
సన్‌రైజర్స్ హైదరాబాద్: 2.6
IPL Auction Live : ప్రస్తుతం టీమ్స్ దగ్గర ఉన్న మొత్తం ప్లేయర్స్ ఒకసారి చూద్దాం. కనీసం 18 ప్లేయర్స్‌ను ఒక్కో టీమ్ తీసుకోవాల్సి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ - 18 (విదేశీ ప్లేయర్స్ 7)
చెన్నై సూపర్ కింగ్స్ - 21 (విదేశీ ప్లేయర్స్ 7)
రాజస్థాన్ రాయల్స్ - 14 (విదేశీ ప్లేయర్స్ 4)
పంజాబ్ కింగ్స్ - 21 (విదేశీ ప్లేయర్స్ 4)
సన్‌రైజర్స్ హైదరాబాద్ - 20 (విదేశీ ప్లేయర్స్ 6)
కోల్‌కతా నైట్ రైడర్స్ - 18 (విదేశీ ప్లేయర్స్ 4)
ఢిల్లీ క్యాపిటల్స్ - 21 (విదేశీ ప్లేయర్స్ 5)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 18 (విదేశీ ప్లేయర్స్ 7)
లక్నో సూపర్ జెయింట్స్ - 19 (విదేశీ ప్లేయర్స్ 6)
గుజరాత్ టైటన్స్ - 17 (విదేశీ ప్లేయర్స్ 6)
IPL Auction Live: రైలీ మెరిడిత్ - రూ. కోటి
ఆస్ట్రేలియా బౌలర్ రైలీ మెరిడిత్ ను రూ. కోటికి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
IPL Auction Live: అల్జారీ జోసెఫ్ - రూ. 2.4 కోట్లు
వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ను రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్
IPL Auction Live: సీన్ అబాట్ - రూ.2.4 కోట్లు
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ సీన్ అబాట్ ను రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
IPL Auction Live: మార్టిన్ గప్టిల్ - అన్ సోల్డ్
న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గప్టిల్ పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు
IPL Auction Live: ప్రశాంత్ సోలంకి - రూ.1.2 కోట్లు
లెగ్ స్పిన్నర్ ప్రశాంత్ సోలంకి కోసం పోటీ పడిన చెన్నై, రాజస్థాన్. రూ.20 లక్షల కనీస ధర ఉన్న అతన్ని చివరికి చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL Auction Live: వైభవ్ అరోరా - రూ. 2 కోట్లు
ఇండియన్ పేస్ బౌలర్ వైభవ్ అరోరా కోసం పోటీ పడిన పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్. రూ.2 కోట్లకు అతన్ని కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
IPL Auction Live: టిమ్ డేవిడ్ - రూ. 8.25 కోట్లు
సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ ను రూ.8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్. అతని కనీస ధర కేవలం రూ.40 లక్షలు మాత్రమే కావడం విశేషం. సింగపూర్ తరఫున అతడు 14 టీ20 ఆడాడు.
IPL Auction Live: ఆడమ్ మిల్న్ - రూ.1.9 కోట్లు
న్యూజిలాండ్ బౌలర్ ఆడమ్ మిల్న్ ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
IPL Auction Live: టైమాల్ మిల్స్ - రూ.1.5 కోట్లు
ఇంగ్లండ్ బౌలర్ టైమాల్ మిల్స్ ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
IPL Auction Live: జేసన్ బెహ్రండార్ఫ్ - రూ.75 లక్షలు
ఆస్ట్రేలియా బౌలర్ జేసన్ బెహ్రండార్ఫ్ ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
IPL Auction Live: రొమారియో షెపర్డ్ - రూ. 7.75 కోట్లు
వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ కోసం పోటీపడిన ఫ్రాంఛైజీలు. చివరికి రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్. అతని కనీస ధర కేవలం రూ.75 లక్షలు కావడం విశేషం. వెస్టిండీస్ తరఫున 7 వన్డేలు, 14 టీ20 మాత్రమే ఆడాడు.
IPL Auction Live: మిచెల్ సాంట్నర్ - రూ.1.9 కోట్లు
న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
IPL Auction Live: డేనియల్ సామ్స్ - రూ.2.6 కోట్లు
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
IPL Auction Live: రిషి ధావన్ - రూ. 55 లక్షలు
రిషి ధావన్ ను రూ.55 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
IPL Auction Live: జోఫ్రా ఆర్చర్ - రూ. 8 కోట్లు
ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం తీవ్రంగా పోటీ పడిన ఫ్రాంఛైజీలు. రాజస్థాన్, ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ. చివరికి ముంబై ఇండియన్స్ అతన్ని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL Auction Live: రోవ్‌మన్ పావెల్ - రూ.2.8 కోట్లు
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోవ్‌మన్ పావెల్‌ను రూ.2.8 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
IPL Auction Live: అలెక్స్ హేల్స్ - అన్ సోల్డ్
ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ను కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
IPL Auction Live: డెవోన్ కాన్వే - రూ. కోటి
న్యూజిలాండ్ బ్యాటర్ డెవోన్ కాన్వేను రూ. కోటికి కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
IPL Auction Live: ఫిన్ అలెన్ - రూ.80 లక్షలు
న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ ను రూ.80 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
IPL Auction Live: యశ్ దయాల్ - రూ. 3.2 కోట్లు
లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ కోసం పోటీ పడిన ఫ్రాంఛైజీలు. రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్
IPL Auction Live: రాజ్‌వర్దన్ హంగర్‌గేకర్ - రూ.1.5 కోట్లు
అండర్-19 టీమ్ ఓపెనర్ రాజ్‌వర్దన్ హంగర్‌గేకర్ కోసం ముంబై, లక్నో, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి అతన్ని రూ.1.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
IPL Auction Live: రాజ్ అంగద్ బవా - రూ. 2 కోట్లు
అండర్-19 స్టార్ ప్లేయర్ రాజ్ అంగద్ బవా కోసం హైదరాబాద్, ముంబై, పంజాబ్ మధ్య పోటీ. చివరికి పంజాబ్ అతన్ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL Auction Live: సంజయ్ యాదవ్ - రూ.50 లక్షలు
సంజయ్ యాదవ్ ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
IPL Auction Live: విక్కీ ఓస్వాల్ - అన్ సోల్డ్
అండర్-19 స్టార్ విక్కీ ఓస్వాల్ ను కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
IPL Auction Live: మహిపాల్ లోమ్రోర్ - రూ.95 లక్షలు
మహిపాల్ లోమ్రోర్ ను రూ.95 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
IPL Auction Live: తిలక్ వర్మ - రూ. 1.7 కోట్లు
హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మను రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
IPL Auction Live: యశ్ ధుల్ - రూ. 50 లక్షలు
ఇండియన్ అండర్-19 టీమ్ కెప్టెన్ యశ్ ధుల్ ను రూ.50 లక్షలకే కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
IPL Auction Live: లలిత్ యాదవ్ - రూ. 65 లక్షలు
ఆల్ రౌండర్ లలిత్ యాదవ్ ను రూ. 65 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
IPL Auction Live: రెండో రోజు లంచ్ వరకు టీమ్స్ కొనుగోలు చేసిన ప్లేయర్స్
ఖలీల్ అహ్మద్ (ఢిల్లీ) - రూ.5.2 కోట్లు
దుశ్మంత చమీర (లక్నో) - రూ.2 కోట్లు
చేతన్ సకారియా (ఢిల్లీ) - రూ.4.2 కోట్లు
సందీప్ శర్మ (పంజాబ్ కింగ్స్) - రూ. 50 లక్షలు
నవ్‌దీప్ సైనీ (రాజస్థాన్ రాయల్స్) - రూ.2.6 కోట్లు
జయదేవ్ ఉనద్కట్ (ముంబై ఇండియన్స్) - రూ.1.3 కోట్లు
మయాంక్ మార్కండే (ముంబై ఇండియన్స్) - రూ.65 లక్షలు
షాబాజ్ నదీమ్ (లక్నో) - రూ.50 లక్షలు
మహీష్ తీక్షణ (చెన్నై) - రూ.70 లక్షలు
రింకు సింగ్ (కోల్‌కతా) - రూ.55 లక్షలు
మనన్ వోహ్రా (లక్నో) - రూ.20 లక్షలు
ఏడెన్ మార్‌క్రమ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)- రూ.2.6 కోట్లు
రహానే (కోల్‌కతా నైట్‌రైడర్స్)- రూ.1 కోటి
మణ్‌దీప్ సింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్)- రూ.1.1 కోట్లు
లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్)- రూ.11.5 కోట్లు
డొమినిక్ డ్రేక్స్ (గుజరాత్ టైటన్స్)- రూ.1.1 కోట్లు
జయంత్ యాదవ్ (గుజరాత్ టైటన్స్) - రూ.1.7 కోట్లు
విజయ్ శంకర్ (గుజరాత్ టైటన్స్)- రూ.1.4 కోట్లు
ఒడియన్ స్మిత్ (పంజాబ్ కింగ్స్)- రూ.6 కోట్లు
మార్కో జాన్సెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)- రూ.4.2 కోట్లు
శివమ్ దూబె (చెన్నై)- రూ.4 కోట్లు
కే గౌతమ్ (లక్నో) - రూ.90 లక్షలు
IPL Auction Live: మనన్ వోహ్రా - రూ.20 లక్షలు
మనన్ వోహ్రాను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ కింగ్స్
IPL Auction Live: రింకు సింగ్ - రూ.55 లక్షలు
బ్యాటర్ రింకు సింగ్‌ను రూ.55 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్
IPL Auction Live: షాబాజ్ నదీమ్ - రూ. 50 లక్షలు
స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌ను కనీస ధర రూ.50 లక్షలకే లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
IPL Auction Live: మయాంక్ మార్కండె - రూ.65 లక్షలు
స్పిన్నర్ మయాంక్ మార్కండెను రూ.65 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
IPL Auction Live: జయదేవ్ ఉనద్కట్ - రూ.1.3 కోట్లు
పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ కోసం ముంబై, చెన్నై పోటీ. చివరికి రూ.1.3 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
IPL Auction Live: నవ్‌దీప్ సైనీ - రూ.2.6 కోట్లు
పేస్ బౌలర్ నవ్‌దీప్ సైనీకి రూ. 2.6 కోట్లు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది.
IPL Auction Live: చేతన్ సకారియా - రూ.4.2 కోట్లు
యువ పేస్ బౌలర్ చేతన్ సకారియా కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL Auction Live: దుశ్మంత చమీర - రూ.2 కోట్లు
శ్రీలంక పేస్ బౌలర్ దుశ్మంత చమీరను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
IPL Auction Live: ఖలీల్ అహ్మద్‌కు భారీ ధర
యువ లెఫ్టామ్ పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ వేలంలో భారీ ధర పలికాడు. అతని కోసం ఢిల్లీ, ముంబై పోటీ పడ్డాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL Auction Live: ఇషాంత్ శర్మ -అన్‌సోల్డ్
టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మపై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు
IPL Auction Live: రెండో రోజు ఇప్పటి వరకూ అమ్ముడైన ప్లేయర్స్
ఏడెన్ మార్‌క్రమ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)- రూ.2.6 కోట్లు
రహానే (కోల్‌కతా నైట్‌రైడర్స్)- రూ.1 కోటి
మణ్‌దీప్ సింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్)- రూ.1.1 కోట్లు
లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్)- రూ.11.5 కోట్లు
డొమినిక్ డ్రేక్స్ (గుజరాత్ టైటన్స్)- రూ.1.1 కోట్లు
జయంత్ యాదవ్ (గుజరాత్ టైటన్స్) - రూ.1.7 కోట్లు
విజయ్ శంకర్ (గుజరాత్ టైటన్స్)- రూ.1.4 కోట్లు
ఒడియన్ స్మిత్ (పంజాబ్ కింగ్స్)- రూ.6 కోట్లు
మార్కో జాన్సెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)- రూ.4.2 కోట్లు
శివమ్ దూబె (చెన్నై)- రూ.4 కోట్లు
కే గౌతమ్ (లక్నో) - రూ.90 లక్షలు
IPL Auction Live: శివమ్ దూబె - రూ.4 కోట్లు
ఆల్‌రౌండర్ శివమ్ దూబెను రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
IPL Auction Live: మార్కో జాన్సెన్ - రూ.4.2 కోట్లు
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ కోసం పోటీపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్. చివరికి రూ.4.2 కోట్లకు అతన్ని సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.
IPL Auction Live: ఒడియన్ స్మిత్ - రూ.6 కోట్లు
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్‌ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్. చివరి వరకూ అతని కోసం ప్రయత్నించి వదిలేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
IPL Auction Live: రెండో రోజు అత్యధిక ధర లియామ్ లివింగ్‌స్టోన్ - రూ.11.5 కోట్లు
రెండో రోజు వేలంలో ఇప్పటి వరకూ అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ నిలిచాడు. అతన్ని రూ.11.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
IPL Auction Live: విజయ్ శంకర్ - రూ.1.4 కోట్లు
ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను రూ.1.4 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్
IPL Auction Live: జయంత్ యాదవ్ - రూ.1.7 కోట్లు
ఇండియన్ టీమ్ ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను గుజరాత్ టైటన్స్ రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL Auction Live: చెతేశ్వర్ పుజారా - అన్‌సోల్డ్
టీమిండియా టెస్ట్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారాను కూడా ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు
IPL Auction Live: ఆరోన్ ఫించ్ - అన్‌సోల్డ్
ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను కూడా ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు
IPL Auction Live: ఇయాన్ మోర్గాన్‌కూ నిరాశే
ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను కూడా ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు. తొలి రౌండ్‌లో అతన్ని కొనుగోలు చేయలేదు
IPL Auction Live: మార్నస్ లబుషేన్‌నూ కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నర్ లబుషేన్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు
IPL Auction Live: డేవిడ్ మలాన్‌ను పట్టించుకోని ఫ్రాంఛైజీలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలాన్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు. రూ.1.5 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన మలాన్.
IPL Auction Live: అజింక్య రహానేకు రూ.కోటి
స్టార్ బ్యాటర్ అజింక్య రహానేను బేస్ ప్రైస్ రూ.కోటికే దక్కించుకుంది కోల్‌కతా నైట్‌రైడర్స్
IPL Auction Live: ఏడెన్ మార్‌క్రమ్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్
సౌతాఫ్రికా బ్యాటర్ ఏడెన్ మార్‌క్రమ్‌ను రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్
IPL Auction Live: ఏ టీమ్ దగ్గర ఎంతమంది ప్లేయర్స్?
ముంబై ఇండియన్స్ : 8
చెన్నై సూపర్ కింగ్స్: 10
రాజస్థాన్ రాయల్స్: 11
పంజాబ్ కింగ్స్: 11
సన్‌రైజర్స్ హైదరాబాద్: 13
కోల్‌కతా నైట్‌రైడర్స్: 9
ఢిల్లీ క్యాపిటల్స్: 13
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 11
లక్నో సూపర్ జెయింట్స్- 11
గుజరాత్ టైటన్స్- 10
IPL Auction Live: రెండో రోజు వేలంలోని స్టార్ విదేశీ ప్లేయర్స్ వీళ్లే
ఆరోన్ ఫించ్, ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్, అలెక్స్ హేల్స్, క్రిస్ లిన్, మార్నస్ లబుషేన్, రాసీ డసెన్, ఐడెన్ మార్‌క్రమ్, డెవోన్ కాన్వే, ఎవిన్ లూయిస్, జేమ్స్ విన్స్, మార్టిన్ గప్టిల్, రోవ్‌మన్ పావెల్, షామ్రా బ్రూక్స్, క్రిస్ జోర్డాన్, కొలిన్ మన్రో, లియామ్ లివింగ్‌స్టోన్, ఒడియన్ స్మిత్, మిచెల్ సాంట్నర్, జోఫ్రా ఆర్చర్, టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, ఆండ్రీ ఫ్లెచర్, హెన్రిచ్ క్లాసెన్
IPL Auction Live: రెండో రోజు వేలంలోని స్టార్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే
అజింక్య రహానే, చెటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, సౌరభ్ తివారీ, శ్రీశాంత్, మనోజ్ తివారీ, శివమ్ దూబె, కే గౌతమ్, విజయ్ శంకర్, రిషి ధావన్, కరుణ్ నాయర్, చేతన్ సకారియా, హనుమ విహారి, పర్వేజ్ రసూల్, మహిపాల్ లామ్రోర్, మురళీ విజయ్
కాసేపట్లో రెండో రోజు వేలం ప్రక్రియ ప్రారంభం
తొలి రోజు సంచలనాల తర్వాత రెండో రోజు ఐపీఎల్ వేలంపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కాసేపట్లోనే రెండో రోజు వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.
ముగిసిన తొలి రోజు వేలం ప్రక్రియ
ఐపీఎల్ మెగా వేలంలో తొలి రోజు ముగిసింది. ఇషాన్ కిషన్, దీపక్ చహర్‌లాంటి స్టార్ ప్లేయర్స్‌తోపాటు అవేష్ ఖాన్‌లాంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కూడా కోట్లు కొల్లగొట్టారు. రైనా, స్మిత్‌లాంటి ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్స్‌ను ఎవరూ కొనకపోవడం మరో సంచలనం. రెండోరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకు వేలం మొదలవుతుంది.
చరిత్ర సృష్టించిన అవేష్ ఖాన్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు పేస్ బౌలర్ అవేష్ ఖాన్. అతన్ని కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
పేస్ బౌలర్ అవేష్ ఖాన్ - రూ.10 కోట్లు
అన్‌క్యాప్డ్ అవేష్ ఖాన్ సంచలనం సృష్టించాడు. కేవలం 20 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఈ పేస్ బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి 50 రెట్లు ఎక్కువ చెల్లించి రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని దక్కించుకుంది.
అన్‌క్యాప్డ్ బౌలర్ కార్తీక్ త్యాగి - రూ. 4 కోట్లు
యువ ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగి ఐపీఎల్ వేలంలో హాట్ కేక్‌లా అమ్ముడయ్యాడు. అతని కోసం సన్‌రైజర్స్, ముంబై పోటీ పడ్డాయి. చివరికి రూ.4 కోట్లకు సన్‌రైజర్స్ అతన్ని దక్కించుకుంది.
అనూజ్ రావత్ - రూ.3.4 కోట్లు
ఉత్తరాఖండ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అనూజ్ రావత్ అనూహ్య ధర పలికాడు. అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది.
కేఎస్ భరత్ - రూ.2 కోట్లు
ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికాడు. అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ కేటగిరీలో వేలంలోకి వచ్చిన ఈ టాలెంటెడ్ ప్లేయర్ కోసం చెన్నై, ఢిల్లీ మధ్య పోటీ నడిచింది. రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ను అతన్ని దక్కించుకుంది.
షాబాజ్ అహ్మద్ - రూ. 2.4 కోట్లు
స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌ను రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
హర్‌ప్రీత్ బ్రార్ - రూ.3.8 కోట్లు
బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను రూ.3.8 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
కమలేష్ నగర్‌కోటి - రూ.1.1 కోట్లు
పేస్ బౌలర్ కమలేష్ నగర్‌కోటిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.1 కోట్లకు దక్కించుకుంది.
ఆల్‌రౌండర్ రాహుల్ తివాతియా - రూ.9 కోట్లు
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వేలంలో అడుగుపెట్టిన ఆల్‌రౌండర్ రాహుల్ తివాతియా కోసం చెన్నై, గుజరాత్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. గతంలో రాజస్థాన్ తరఫున కొన్ని మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన ఈ ప్లేయర్ కోసం భారీ ధర చెల్లించడానికి ఫ్రాంఛైజీలు సిద్ధమయ్యాయి. దీంతో రూ.40 లక్షల బేస్‌ప్రైస్ నుంచి రూ.9 కోట్లకు చేరింది. గుజరాత్ టైటన్స్ అతన్ని దక్కించుకుంది.
బౌలర్ శివమ్ మావి - రూ.7.25 కోట్లు
యువ పేస్‌బౌలర్ శివమ్ మావికి వేలంలో భారీ ధర పలికింది. రూ.40 లక్షల బేస్‌ప్రైస్‌తో మొదలైన అతని బిడ్డింగ్.. చివరికి రూ.7.25 కోట్ల దగ్గర ముగిసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ భారీ మొత్తానికి అతన్ని దక్కించుకుంది.
షారుక్ ఖాన్‌పై కోట్ల వర్షం - రూ.9 కోట్లు
తమిళనాడు యువ బ్యాటర్ షారుక్‌ఖాన్ కోసం చెన్నై, కోల్‌కతా, పంజాబ్ పోటీపడ్డాయి. దీంతో రూ.40 లక్షల బేస్ ప్రైస్ కాస్తా.. రూ.9 కోట్లకు చేరింది. చివరి వరకూ చెన్నై, పంజాబ్ పోటీ పడగా.. చివరికి రూ.9 కోట్లకు పంజాబ్ అతన్ని దక్కించుకుంది.
అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మకు రూ.6.5 కోట్లు
అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నించాయి. మధ్యలో గుజరాత్ టైటన్స్ కూడా చేరింది. దీంతో రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో మొదలైన అతని బిడ్డింగ్ కాస్తా రూ.6.5 కోట్లకు చేరింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అతన్ని కొనుగోలు చేసింది. మొత్తానికి 32 రెట్లు ఎక్కువ మొత్తానికి అతను అమ్ముడుపోవడం విశేషం.
అన్‌క్యాప్డ్ ప్లేయర్ రియాన్ పరాగ్ - రూ.3.8 కోట్లు
ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రియాన్ పరాగ్ కోసం కూడా ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.30 లక్షలతో ప్రారంభమైన అతని కనీస ధర ఎక్కడికో వెళ్లిపోయింది. 12 రెట్లు పెరిగి రూ.3.8 కోట్లకు చేరింది. ఇంత భారీ మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది.
వేలంలో దుమ్మురేపిన రాహుల్ త్రిపాఠి.. రూ.8.5 కోట్లు
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి దుమ్మురేపాడు. అతని కోసం చెన్నై, కోల్‌కతా హోరాహోరీగా బిడ్స్ దాఖలు చేశాయి. మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వచ్చింది. చివరికి రూ.8.5 కోట్లు చెల్లించి అతన్ని సొంతం చేసుకుంది. కనీస ధర కంటే 20 రెట్లు అధిక ధరకు అతను అమ్ముడుపోవడం విశేషం.
సౌతాఫ్రికా అన్‌క్యాప్డ్ ప్లేయర్ డివాల్డ్ బ్రెవిస్‌కు రూ.3 కోట్లు
సౌతాఫ్రికాకు చెందిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ డివాల్డ్ బ్రెవిస్ భారీ ధర పలికాడు. రూ.20 లక్షలతో మొదలైన కనీస ధర కాస్తా.. రూ.3 కోట్లకు చేరడం విశేషం. ఈ భారీ మొత్తం ఇచ్చి అతన్ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్.
అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభినవ్ సదరంగానికి భారీ ధర
అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభినవ్ సదరంగాని కోసం పోటీ పడిన ఫ్రాంఛైజీలు. రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన అభినవ్‌ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్.
హైదరాబాద్ కు ఆడనున్న ప్రియం గర్గ్
రూ.20 లక్షలకు ప్రియం గర్గ్ ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
యజువేంద్ర చహల్‌కు రూ.6.5 కోట్లు
స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
స్పిన్నర్ రాహుల్ చహర్ - రూ.5.25 కోట్లు
ఇండియన్ టీమ్ స్పిన్నర్ రాహుల్ చహర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది.
కుల్‌దీప్ యాదవ్‌కు రూ.2 కోట్లు
టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన కుల్‌దీప్ యాదవ్
ముస్తఫిజుర్ రెహమాన్ కు రూ.2 కోట్లు
బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను కనీస ధర రూ.2 కోట్లకే కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
రూ.10.75 కోట్లు పలికిన శార్దూల్ ఠాకూర్
టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ భారీ ధర పలికాడు. అతని కోసం ఢిల్లీ, పంజాబ్, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.
పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు రూ.4.2 కోట్లు
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ - రూ. 7.5 కోట్లు
ఇంగ్లండ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ ను రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
జోష్ హేజిల్‌వుడ్‌కు రూ.7.75 కోట్లు
ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కు రూ. 10 కోట్లు
న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. దీంతో అతనికి భారీ ధర పలికింది. గుజరాత్ టైటన్స్ అతన్ని రూ. 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
వేలంలో ప్రసిద్ధ్ కృష్ణకు భారీ ధర
టీమిండియా యువ పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ భారీ ధర పలికాడు. అతని కోసం రాజస్థాన్, లక్నో తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి రూ.10 కోట్లు చెల్లించి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
ఉమేష్ యాదవ్ కు తప్పని నిరాశ
పేసర్ ఉమేష్ యాదవ్ పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు
దీపక్ చహర్ కు రూ.14 కోట్లు
ఐపీఎల్ మెగా వేలంలో దీపక్ చహర్ కు భారీ ధర పలికింది. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతని కోసం మొదట సన్ రైజర్స్, ఢిల్లీ.. తర్వాత చెన్నై, రాజస్థాన్ రేసులోకి వచ్చాయి. చివరికి చెన్నై అతన్ని సొంతం చేసుకుంది.
దీపక్ చహర్ కోసం సన్ రైజర్స్, ఢిల్లీ పోటాపోటీ
టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చహర్ కోసం వేలంలో హైదరాబాద్, ఢిల్లీ పోటాపోటీగా బిడ్లు వేస్తున్నాయి.
బౌలర్ నటరాజన్ కు రూ.4 కోట్లు
తమిళనాడు బౌలర్ నటరాజన్ ను రూ. 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
వేలంలో నికొలస్ పూరన్ కు భారీ ధర
వెస్టిండీస్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్ ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
సామ్ బిల్లింగ్స్ ను కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ పై ఆసక్తి చూపని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు
వృద్ధిమాన్ సాహాకు నిరాశ
వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
దినేష్ కార్తీక్‌ను కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
జానీ బెయిర్‌స్టోను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్. వేలంలో రూ.6.75 కోట్లు పలికిన జానీ బెయిర్‌స్టో.
ఇషాన్ కిషన్ కు రూ.15.25 కోట్లు
యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు రూ.15.25 కోట్లు చెల్లించనున్న ముంబై ఇండియన్స్. ఒక ప్లేయర్ కు ఆ టీమ్ 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లించడం ఇదే తొలిసారి.
ఇషాన్ కిషన్ కోసం ముంబై, పంజాబ్ కింగ్స్ హోరాహోరీ
వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను దక్కించుకోవడానికి పంజాబ్, ముంబై పోటీ పడుతున్నాయి.
అంబటి రాయుడుకు రూ.6.75 కోట్లు
అంబటి రాయుడు వికెట్ కీపర్ ఆల్ రౌండర్ కేటగిరీలో వేలంలోకి వచ్చాడు. అతన్ని రూ.6.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
మాథ్యూ వేడ్ కి నిరాశే
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కు నిరాశే ఎదురైంది. ఫ్రాంఛైజీలు అతన్ని కొనుగోలు చేయలేదు.
మహ్మద్ నబీని కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.
మిచెల్ మార్ష్ ను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ను రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
కృనాల్ పాండ్యాను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను రూ. 8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
వాషింగ్టన్ సుందర్ కు రూ.8.75 కోట్లు
స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను రూ.8.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.
వేలంలో భారీ ధర పలికిన శ్రీలంక బౌలర్ హసరంగ
శ్రీలంక బౌలర్ వానిందు హసరంగను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
చారు శర్మకు ఐపీఎల్ వేలం బాధ్యతలు
ఐపీఎల్ వేలం వేస్తూ మధ్యలోనే కుప్పకూలిపోయిన హ్యూ ఎడ్మీడస్ స్థానంలో చారు శర్మ వేలం బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐపీఎల్ ట్విటర్లో వెల్లడించింది. హ్యూ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పింది.
3.30 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న ఐపీఎల్ వేలం
ఆక్షనీర్ హ్యూ ఎడ్మీడస్ కుప్పకూలడంతో ఆగిపోయిన ఐపీఎల్ వేలం తిరిగి 3.30 గంటలకు ప్రారంభం కానున్నట్లు బ్రాడ్ కాస్టర్లు వెల్లడించారు.
నిలిచిపోయిన ఐపీఎల్ వేలం
వేలం వేస్తున్న సమయంలోనే ఆక్షనీర్ హ్యూ ఎడ్మీడస్ కుప్పకూలారు. స్టేజీ మీది నుంచి కింది పడిపోయారు. దీంతో వేలం అర్ధంతరంగా ఆగిపోయింది.
వేలం మధ్యలోనే కుప్పుకూలిపోయిన ఆక్షనీర్
ఐపీఎల్ వేలంలో అనుకోని ఘటన జరిగింది. వేలం వేస్తున్న సమయంలోనే వేలం వేసే వ్యక్తి.. హ్యూ ఎడ్మీడస్ కుప్పకూలారు.
దీపక్ హుడాకు రూ. 5.75 కోట్లు
దీపక్ హుడా కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ మధ్య పోటీ. మధ్యలో ముంబై, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి హైదరాబాద్, లక్నో కూడా రేసులోకి వచ్చాయి. చివరికి రూ. 5.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
పేస్ బౌలర్ హర్షల్ పటేల్ కు రూ. 10.75 కోట్లు
హర్షల్ పటేల్ కోసం బెంగళూరు, చెన్నై మధ్య పోటాపోటీ. మధ్యలో పోటీలోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్. చివరికి రూ.10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. గతంలోనూ అతడు ఆర్సీబీకే ఆడాడు.
అమ్ముడుపోని ఆల్ రౌండర్ షకీబుల్ హసన్
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు. అతని కనీస ధర రూ.2 కోట్లుగా ఉంది.
వేలంలో భారీ ధర పలికిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్
వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ కోసం కూడా ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్, లక్నో పోటీపడ్డాయి. చివరికి రూ.8.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
ఐపీఎల్ వేలంలో నితీష్ రాణాకు ఫుల్ డిమాండ్
ఐపీఎల్ వేలంలో రూ.కోటి కనీస ధరతో వచ్చిన నితీష్ రాణా కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. దీంతో అతని ధర చాలా వేగంగా పెరిగిపోయింది. అతని కోసం కేకేఆర్, లక్నో పోటీ పడ్డాయి. చివరికి రూ.8 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అతడు గతంలోనూ కేకేఆర్ టీమ్ కే ఆడాడు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోకు రూ.4.4 కోట్లు
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్. అతని కోసం మొదట్లో చెన్నై, సన్‌రైజర్స్ మధ్య పోటీ ఏర్పడింది. తర్వాత సన్‌రైజర్స్ డ్రాప్ కాగా.. ఢిల్లీ పోటీలోకి వచ్చింది. చివరికి చెన్నైయే కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కూ నిరాశే
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది.
సురేశ్ రైనాను కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనాపై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు. ఐపీఎల్‌లో తన దైన మార్కు చూపిన రైనాను ఎవరూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం.
దేవదత్ పడిక్కల్‌కు రూ.7.75 కోట్లు
వేలంలో యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అతని కోసం బెంగళూరు, ముంబై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. చివరికి రూ.7.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
అమ్ముడుపోని సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు
ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ కు రూ.2 కోట్లు
వేలంలో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ను కనీస ధర రూ.2 కోట్లకే కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్
బేస్ ప్రైస్ కే అమ్ముడైన రాబిన్ ఉతప్ప
రాబిన్ ఉతప్పను రూ.2 కోట్లకే కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
వెస్టిండీస్ బ్యాటర్ హెట్‌మెయర్‌కు రూ.8.5 కోట్లు
వెస్టిండీస్ హిట్టర్ షిమ్రన్ హెట్‌మెయర్‌కు ఐపీఎల్ మెగా వేలంలో అనూహ్య డిమాండ్ ఏర్పడింది. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి రూ.8.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
మనీష్ పాండే ఫుల్ డిమాండ్.. రూ.4.6 కోట్లు
వేలంలో అనూహ్య ధర పలికిన మనీష్ పాండే. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది.
రెండో సెట్ ప్లేయర్స్ వేలం ప్రారంభం
రెండో సెట్లో వేలంలోకి వచ్చిన తొలి ప్లేయర్ మనీష్ పాండే. రూ. కోటి ప్రారంభ ధరతో వచ్చిన పాండే.
వార్నర్ కు రూ.6.25 కోట్లు
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.
ఇప్పటి వరకూ శ్రేయస్ అయ్యరే టాప్
ఐపీఎల్ మెగా వేలంలో తొలి పది మంది ప్లేయర్స్ వేలం ముగిసింది. అయ్యర్ అందరి కంటే ఎక్కువ ధర పలికాడు.
శ్రేయస్ అయ్యర్ - రూ.12.25 కోట్లు (కోల్ కతా నైట్ రైడర్స్)
15 నిమిషాల బ్రేక్
ఐపీఎల్ వేలంలో తొలి పది మంది ప్లేయర్స్ వేలం తర్వాత 15 నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చారు.
డేవిడ్ వార్నర్ కోసం ఢిల్లీ, చెన్నై మధ్య పోటీ
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కోసం ఢిల్లీ, చెన్నై మధ్య పోటాపోటీ బిడ్ నడుస్తోంది.
క్వింటన్ డీకాక్‌కు రూ.6.75 కోట్లు
సౌతాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్‌ను రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్
క్వింటన్ డీకాక్ కోసం లక్నో, చెన్నై పోటాపోటీ
సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ కోసం లక్నో, చెన్నై పోటీపడుతున్నాయి.
డుప్లెస్సికి రూ.7 కోట్లు
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సిని రూ.7 కోట్లకు కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఫాఫ్ డుప్లెస్సి కోసం చెన్నై, బెంగళూరు పోటాపోటీ
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి కోసం చెన్నై, బెంగళూరు టీమ్స్ పోటీ పడుతున్నాయి.
ఇండియన్ బౌలర్ మహ్మద్ షమికి రూ.6.25 కోట్లు
ఇండియన్ పేస్ బౌలర్ మహ్మద్ షమిని రూ.6.25 కోట్లకు గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది.
రూ.12.25 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను కొన్న కోల్‌కతా
ఐపీఎల్ మెగా వేలంలో ఇండియన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రూ.12.25 కోట్ల ధర పలికాడు. అతన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కెప్టెన్ కోసం చూస్తున్న ఆ టీమ్.. వేలంలో భారీ ధరకు అయ్యర్‌ను సొంతం చేసుకుంది.
శ్రేయస్ అయ్యర్‌కు ఫుల్ డిమాండ్
ఊహించినట్లే ఇండియన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో అతడు వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
వేలంలో రూ.8 కోట్లు పలికిన ట్రెంట్ బౌల్ట్
వేలంలో రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వచ్చిన న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
రూ.9.25 కోట్లకు రబాడాను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడాను రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
వేలంలోకి వచ్చిన సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడా
రబాడా కోసం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ పోటాపోటీ
రూ.7.25 కోట్లకు అమ్ముడైన ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రూ.7.25 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
వేలంలో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
రూ.2 కోట్ల బేస్ ప్రేస్‌తో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.
రూ.5 కోట్లకు అశ్విన్‌ను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోసం ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. చివరికి రూ.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
వేలంలో రెండో ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్
అశ్విన్ రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి ఎంట్రీ.
రూ.8.25 కోట్లకు అమ్ముడైన శిఖర్ ధావన్
రూ.8.25 కోట్లకు శిఖర్ ధావన్‌ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
ధావన్ కోసం పోటీ పడుతున్న ఢిల్లీ, పంజాబ్
శిఖర్ ధావన్ కోసం పోటీ పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్. పోటీకి పంజాబ్ కింగ్స్.
తొలి ప్లేయర్ శిఖర్ ధావన్
వేలంలో తొలి ప్లేయర్ శిఖర్ ధావన్. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వచ్చిన ధావన్. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ.
ఈసారి వేలంలో అందరి కళ్లూ ఈ ప్లేయర్స్‌పైనే...
ఇండియన్ ప్లేయర్స్ (క్యాప్డ్): శిఖర్ ధావన్, దీపక్ చహర్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, ప్రిసద్ధ్ కృష్ణ, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, హర్షల్ పటేల్
ఇండియన్స్ (అన్‌క్యాప్డ్): షారుక్ ఖాన్, అవేష్ ఖాన్, యశ్ ధుల్, రాజ్‌వర్దన్ హంగర్‌గేకర్
విదేశీ ప్లేయర్స్: డేవిడ్ వార్నర్, జేసన్ రాయ్, ఫాబియెన్ అలెన్, ఒడియన్ స్మిత్, క్వింటన్ డీకాక్, కగిసో రబాడా, జేసన్ హోల్డర్, ప్యాట్ కమిన్స్
రైట్ టు మ్యాచ్ కార్డు ఈసారి లేదు
ఈసారి మెగా వేలంలో రెండు కొత్త టీమ్స్ రావడంతో రైట్ టు మ్యాచ్ కార్డు ఉండబోదని ఐపీఎల్ పాలక మండలి స్పష్టం చేసింది. గతంలో తమ టీమ్‌లో ఉన్న ప్లేయర్‌ను మరో టీమ్ వేలంలో గెలుచుకున్నా.. ఈ కార్డు ద్వారా తిరిగి పొందే వీలు ఆయా ఫ్రాంచైజీలకు ఉండేది. కానీ ఈసారి ఆ అవకాశం ఉండదు.
పంజాబ్ కింగ్స్ దగ్గర ఎక్కువ డబ్బు
కాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ మెగా వేలం. ప్రస్తుతం ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఒకసారి చూద్దాం.
పంజాబ్ కింగ్స్ : రూ. 72 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ : రూ. 68 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: రూ. 62 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్: రూ. 59 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 57 కోట్లు
గుజరాత్ టైటన్స్: రూ.52 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: రూ. 48 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రూ.48 కోట్లు
ముంబై ఇండియన్స్: రూ.48 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 47.5 కోట్లు