తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 Today Schedule: ఈక్వెడార్‌ నిలిచేనా? సెనెగల్‌తో మ్యాచ్.. డచ్‌తో ఖతర్ ఢీ

FIFA World Cup 2022 Today Schedule: ఈక్వెడార్‌ నిలిచేనా? సెనెగల్‌తో మ్యాచ్.. డచ్‌తో ఖతర్ ఢీ

29 November 2022, 7:01 IST

google News
    • FIFA World Cup 2022 Today Schedule: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. నెదర్లాండ్స్ జట్టు ఖతర్‌తో పోటీ పడనుండగా.. ఈక్వెడార్-సెనెగల్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి.
ఫిఫా ప్రపంచకప్ 2022 పదో రోజు షెడ్యూల్
ఫిఫా ప్రపంచకప్ 2022 పదో రోజు షెడ్యూల్ (AFP)

ఫిఫా ప్రపంచకప్ 2022 పదో రోజు షెడ్యూల్

FIFA World Cup 2022 Today Schedule: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో గ్రూప్ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చాయి. మరో నాలుగో రోజుల్లో రౌండ్-16 మ్యాచ్‌లు ఆరంభం కానున్న దశలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు గ్రూప్-ఏ జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ గ్రూపులో ఆతిథ్యమిస్తున్న ఖతర్ సహా నెదర్లాండ్స్, ఈక్వెడార్, సెనెగల్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ టాపర్‌గా నెదర్లాండ్స్ ఉండగా.. చివరి స్థానంలో ఉన్న ఖతర్ రౌండ్ ఆఫ్ 16 ఆశలపై నీళ్లు చల్లుకుంది.

నవంబరు 29న జరగనున్న మ్యాచ్‌లు..

గ్రూప్-ఏలో నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు కూడా రాత్రి 8.30కే ప్రారంభం కానుండటం గమనార్హం.

ఈక్వెండార్-సెనెగల్.. మధ్య ఖలీపా ఇంటర్నెషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.

నెదర్లాండ్స్-ఖతర్.. మధ్య అల్ బైట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.

ఈ గ్రూప్‌‌లో నెదర్లాండ్స్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ దాంట్లో విజయం సాధించగా.. మరో దాంట్లో డ్రాగా నిలిచి అగ్రస్థానంలో ఉంది. మరోపక్క ఖతర్ మాత్రం ఆడిన రెండింటిలోనూ ఓడి రౌండ్ ఆఫ్ 16 ఆశలను దాదాపు వదిలేసుకుంది. నెదర్లాండ్స్ మాత్రం సునాయసంగా రౌండ్ ఆఫ్ 16కి చేరుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ డచ్ జట్టుకు పెద్దగా నష్టమేమి జరగదు.

మరోవైపు ఈక్వెండార్-సెనెగల్ మధ్య మ్యాచ్ ఆసక్తిగా మారనుంది. ఈక్వెడార్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం రౌండ్ ఆఫ్ 16 ఆశలు సంక్లిష్టమవుతాయి. ఎందుకంటే ఈక్వెడార్ ఆడిన రెండింటిలో ఓ మ్యాచ్‌లో డ్రా చేసుకోగా.. మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోపక్క సెనెగల్ ఓ విజయం, ఓ ఓటమితో మూడో స్థానంలో ఉంది. ఈక్వెండార్ రేసులో నిలవాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. సెనెగల్‌పై ఓడితే మాత్రం.. నెదర్లాండ్స్‌ను ఖతర్ అత్యధిక మార్జిన్‌తో ఓడించాలి. అప్పుడే ఈక్వెడార్‌ రౌండ్ ఆఫ్ 16 ఆశలు నిలుస్తాయి.

ఈ రెండు మ్యాచ్‌లు కాకుండా ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు గ్రూప్-బీ జట్లయిన ఇరాన్-అమెరికా, వేల్స్-ఇంగ్లాండ్ మధ్య కూడా మ్యాచ్ జరగనుంది. గ్రూప్ మ్యాచ్‌లు ముగింపునకు వచ్చేసరికి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తదుపరి వ్యాసం